గర్భంతో ఉన్నప్పుడు పచ్చిమాంసం తినడం ఎందుకు మంచిది కాదు?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

కడుపుతో ఉన్నప్పుడు పచ్చిమాంసం ఎందుకు తినకూడదు? సూక్ష్మజీవులు అనేకరకాలు, అవి పరాన్నజీవులలాగా ఇతర జంతువులు, మనుషుల శరీరాలలో నివసిస్తుంటాయి. మన మామూలు కంటికి కన్పించవు కాబట్టి మనకి అవి మనలోనే ఉంటున్నాయని కూడా తెలీదు.

కానీ అవి ఉన్నట్లు మనకి తెలిసేది మనకు వచ్చే రోగాల వల్లనే. మీరు అనారోగ్యం పాలయినప్పుడు, ఆ చిన్ని దెయ్యాలు మీ ఆరోగ్యాన్ని మెల్లగా అపహరిస్తున్నట్టు లెక్క. కడుపుతో ఉన్నప్పుడు, ఇలాంటి కొన్ని పరాన్నజీవులను దూరంగా ఉంచటం ఎంతో ముఖ్యం.

why avoid raw meat during pregnancy

ఇటీవలి అధ్యయనంలో టాక్సోప్లాస్మా- గోండీ అనే సూక్ష్మజీవి గర్భిణులకి చాలా అపాయకరమని తేల్చారు. మరిన్ని వాస్తవాలకోసం వ్యాసం మొత్తం చదవండి.

కడుపుతో ఉన్నప్పుడు పచ్చిమాంసం ఎందుకు తినకూడదు?

పూర్తిగా ఉడకని మాంసం కడుపుతో ఉన్నవారికి చాలా ప్రమాదకరం. అదేవిధంగా ఇంటిచుట్టూ పిల్లి మలంలో చేరిన సూక్ష్మజీవులు కూడా అపాయకరం. ఎందుకు?

why avoid raw meat during pregnancy

టాక్సోప్లాస్మా- గోండీ

టాక్సోప్లాస్మా-గోండీ అనే పరాన్నజీవి సమయానికి ముందే బిడ్డ పుట్టేట్లు చేయడం, పుట్టుకలో లోపాలు వంటివి కలిగిస్తుంది. మహిళలకి ఇలాంటి సూక్ష్మజీవి ఎలా సంక్రమిస్తుంది? ఇంట్లో,చుట్టుపక్కలా పచ్చిమాంసం, పిల్లి మలం వలన ఇది సంక్రమిస్తుంది.

why avoid raw meat during pregnancy

ఈ పరాన్నజీవి ఇంకా ఏం చేయగలదు?

మొదటి రిస్క్ గర్భస్రావం. మరొకటి సమయానికి ముందే బిడ్డ పుట్టటం. మూడవది పుట్టిన బిడ్డలో లోపాలు ఉండటం. ఇవి మెదడు లేదా కంటికి సంబంధించిన లోపాలు కావచ్చు.

why avoid raw meat during pregnancy

ఈ పరాన్నజీవి పెద్దవారిపై ప్రభావం చూపిస్తుందా?

మీ రోగనిరోధక శక్తి బాగా ఉంటే, సాధారణంగా ఇది మిమ్మల్ని ఏం చేయదు. కానీ గర్భవతులను అనారోగ్యం పాలు చేయగలదు. మామూలు వారికి ఇది సంక్రమిస్తే కొన్నిరోజులు ఫ్లూజ్వరం లాగా వచ్చిపోతుంది.

why avoid raw meat during pregnancy

లక్షణాలు

కొన్ని లక్షణాలు జ్వరం, తలనొప్పి, రక్తహీనత, మెడపట్టేయటం, గొంతునొప్పి, అయోమయం, ర్యాషెస్, వికారం, చెవి మరియు కడుపు నొప్పి.

ఈ సూక్ష్మజీవి గురించి మరింత సమాచారం

టాక్సోప్లాస్మా- గోండీ అనే ఈ పరాన్నజీవి మీ కణాల్లో నివసిస్తుంది. ఇది ప్రోటోజోవా వర్గానికి చెందినది. ప్రస్తుత పరిశోధనల ప్రకారం ప్రపంచంలో సగం మంది వారి వంట్లో దీన్ని కలిగిఉన్నారు ! నిజం, పిల్లుల్లో కూడా ఈ సూక్ష్మజీవి కన్పించింది !

why avoid raw meat during pregnancy

మెదడుపై దీని ప్రభావం ఉంటుందా?

ఈ పరాన్నజీవి సంక్రమణ వల్ల మనిషి ప్రవర్తన కూడా మారుతుందని నమ్ముతున్నారు (ఇంకా తేలాల్సి వుంది). ఇది మెదడుపై ప్రభావం చూపి మనిషిని మరింత ఆందోళన పడేట్లా చేస్తుంది.

స్క్రిజోఫ్రెనియా వచ్చే అవకాశం కూడా పెంచుతుంది. కానీ ఇవన్నీ ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. కానీ కడుపుతో ఉన్నవారు పిల్లులకు, పచ్చిమాంసానికి దూరంగా ఉండాలి.

English summary

why avoid raw meat during pregnancy

Why avoid raw meat during pregnancy? There are so many types of microbes and most of them are parasites that live on other animals or human beings. The naked eyes can't see them and that is why you cannot even know that they are living on you.
Subscribe Newsletter