For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళలలో గర్భధారణ ఆలస్యానికి ప్రధాన కారణాలు

|

నిజానికి మన ప్రాచీన కాలంలో సంబంధం తప్ప ఎటువంటి ఇతర కష్టాలకు లోనూ కాకుండా అప్రయత్నంగానే గర్భం దాల్చే స్త్రీలు, నేడు అనేక శాతం సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ కాళ్లు అరిగిపోయేలా తిరుగుతున్నారు అన్నది జగమెరిగిన సత్యం. మారుతున్న కాలం,కాలుష్యం, పెరుగుతున్న వ్యాధులు ఔషదాలు, తగ్గుతున్న జీవ క్రియలు, మొదలైనవి అనేకం వీటికి ప్రధాన కారకాలు గా ఉన్నాయి.

ఈ కారకాలు మహిళలకే కాదు పురుషులకు కూడా వర్తిస్తాయి, పురుషులు అనేకమంది వ్యంద్యత్వ సమస్యలతో భాధపడుతుంటారు. అనేక అద్యయానాల ప్రకారం పురుషుల్లో రాను రాను ఈ సమస్య అధికమవుతుందని తేటతెల్లమయింది. స్మోకింగ్, మద్యపానం, కాలుష్యం, కుర్చీ అతుక్కుపోయే ఉద్యోగాలు, సరైన వ్యాయామం లేకపోవడం, అనారోగ్య ఆహార జీవన లక్షణాలు అనేకం ప్రభావితం చేస్తున్నాయి.

ఈ వ్యాసంలో మహిళలకు ఈసమస్య ఎందుకు ఎక్కువగా ఉన్నదో చెప్పబడినది.

గర్భాశయ ముఖద్వార సమస్యలు:

గర్భాశయ ముఖద్వార సమస్యలు:

ఇది గర్భాశయానికి యోనికి మద్య ఒక మార్గంవలె పనిచేస్తుంది. శుక్రకణాలు గర్భాశయంలోనికి వెళ్ళు ఈమార్గంలో సమస్యలు తలెత్తడం మూలంగా అనేకమంది మహిళలు గర్భధారణకు నోచుకోవడంలేదు. వీళ్ళు tsh హార్మోన్(థైరాయిడ్), HSG (ట్యూబ్ టెస్ట్), TBPCR(mole bacteria tuberculosis) వంటి కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. క్షయ అనేది శరీరంలో ఏభాగంలో అయినా వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా గర్భాశయంలో కూడా వస్తుంది. అధిక శాతం మహిళలు ఈ విషయంపై అవగాహన లేకనే గర్భధారణకు సగం దూరంగా ఉంటున్నారు. కావున డాక్టరుని అడిగి వారి సలహా మేరకు ఈ పరీక్షలు చేయించుకోవడం అవసరం. అవసరం అనేకన్నా ఖచ్చితం అని చెప్పాలి.

PH బాలెన్స్:

PH బాలెన్స్:

యోని వాతావరణంలోని PH విలువలు కూడా గర్భధారణ విషయంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. తక్కువ లేదా ఎక్కువ PH విలువలు ఉన్న ఎడల, ఇది అండం ఫలాధీకరణపై ప్రభావం చూపిస్తుంది.

అసాధారణ సమస్యలు:

అసాధారణ సమస్యలు:

గర్భాశయంలో కణుతులు చేరడం (ఫైబ్రాయిడ్), కణజాలం దెబ్బతినడం, ఫెలోపియన్ ట్యూబ్ సమస్యలు, అంటువ్యాధులు, కటి వలయ సమస్యలు వంటివి అనేకo పునరుత్పత్తి సమస్యలకు కారణం. ఇలాంటి సమస్యలు శుక్రకణాలను గర్భాశయంలోని అండానికి చేరడo పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి తద్వారా గర్భధారణ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్తితులు తీవ్రమైన పక్షంలోనే IVF, సరోగశీ, టెస్ట్ట్యూబ్, IUI వంటి మార్గాలను డాక్టర్లు సూచిస్తుంటారు.

కొన్ని సాధారణ సమస్యలు:

కొన్ని సాధారణ సమస్యలు:

మద్యపానం, ఊబకాయం, బహిష్టు సమయాల్లో అసాధారణ మార్పులు, శిస్టులు వంటివి కూడా గర్భధారణకు ప్రతికూల కారణాలు కావొచ్చు.

PCOS :

PCOS :

అత్యధిక మహిళలు ఎదుర్కుంటున్న సమస్యల్లో PCOS కూడా ఉంది. polycystic ovarian syndrome సమస్య వలన కూడా గర్భధారణ ఆలస్యం కావొచ్చు. కానీ ఇది తాత్కాలికం, దీనికి సరైన చికిత్సలు కూడా నేడు అందుబాటులో ఉన్నాయి.

వయసు:

వయసు:

వయసు మీదపడుతున్న దృష్ట్యా వ్యాధులు, మెనోపాజ్ సమస్యలు, ఆస్ట్రియోపోరాసిస్ వంటి వ్యాధులు కూడా గర్భధారణకు అడ్డంకిగా పరిణమించవచ్చు. ముఖ్యంగా వయసు ప్రభావం అండం యొక్క ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.

ఇతరములు:

ఇతరములు:

తక్కువ కొవ్వు శాతాన్ని కలిగి ఉండడం మరియు గనేరియా, క్లమేడియా, pelvic inflammatory వంటి సుఖవ్యాధులు కూడా గర్భధారణ సమస్యలకు కారణభూతాలు.

English summary

Why Can It Take Long To Get Pregnant

It is a fact that women of the previous generation got pregnant effortlessly. Today, the percentage of women suffering from fertility issues is increasing. Read this to know why.
Desktop Bottom Promotion