For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో, రొమ్ము కాన్సర్ ఉంటే ఏం జరుగుతుంది ?

|

గర్భధారణ సమయంలో రొమ్ము క్యాన్సర్ నిర్ధారించడం తల్లులకు కష్టంగా ఉండొచ్చు. రొమ్ము క్యాన్సర్ అనేది గర్భధారణ సమయంలో నిర్ధారించబడే అత్యంత సాధారణ క్యాన్సర్ రకంగా ఉంటుంది. ఇది సరాసరిగా ప్రతి 3000 మంది మహిళల్లో ఒకరికి తలెత్తే సమస్యగా ఉంది.

అదేవిధంగా, గర్భధారణ సమయంలో వక్షోజాలలో కలిగే మార్పులను అర్ధం చేసుకోవడం, లేదా గుర్తించడం కూడా అత్యంత క్లిష్టతరంగా ఉంటుంది. అందుకే, అధిక శాతం రొమ్ము క్యాన్సర్ కేసులను పరిస్థితి తీవ్రమైన తర్వాతనే గుర్తించడం జరుగుతుంటుంది.

గర్భాదారణ సమయంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే ఏం జరుగుతుంది

ఇది నిజంగా బాధాకరమైన విషయం. క్రమంగా, ఎక్కువ మంది వైద్యులు సాధారణ గర్భధారణ పరీక్షలలో భాగంగా రొమ్ము కాన్సర్ పరీక్షలను కూడా సిఫార్సు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు సిఫార్సు చేసిన అన్ని రకాల పరీక్షలను అనుసరించాలని గుర్తుంచుకోండి.

ఇప్పటి రోజులలో, ఔషధాలు మరియు టెక్నాలజీ క్యాన్సర్లను జయిస్తూ ఉన్నప్పటికీ, గర్భధారణ సమయంలో ఈ పరిస్థితి తీవ్రంగా మారే అవకాశాలు అధికంగా ఉంటాయి. క్రమంగా తల్లి గర్భంలోని, పిండం సురక్షితంగా మరియు ఆరోగ్యవంతంగా ఉంచడమనేది, వైద్యులకు ఒక అదనపు బాధ్యతగా ఉంటుంది. కావున వారు సూచించిన తేదీలలో తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని గుర్తుంచుకోండి.

గర్భధారణ సమయంలో రొమ్ము క్యాన్సర్ సమస్యకు చికిత్స చేసేటప్పుడు అనేక విషయాలు పరిగణించవలసి ఉంటుంది. గర్భధారణ సమయంలో బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యను ఎదుర్కొనేందుకు తెలుసుకోవలసిన సమగ్ర వివరాలను ఈ వ్యాసంలో పొందుపరచడం జరిగింది. తెలుసుకునేందుకు వ్యాసంలో ముందుకు సాగండి.

 గర్భధారణ సమయంలో రొమ్ము క్యాన్సర్ ఏవిధంగా నిర్ధారించబడుతుంది ?

గర్భధారణ సమయంలో రొమ్ము క్యాన్సర్ ఏవిధంగా నిర్ధారించబడుతుంది ?

రొమ్ము క్యాన్సర్ అనేది సాధారణంగా గర్భధారణ సమయంలో చేసే పరీక్షలలోనే గుర్తించడం జరుగుతుంటుంది. క్యాన్సర్ యొక్క లక్షణాలుగా రొమ్ము సున్నితత్వం, లేదా ఛాతీ పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ, ఇవి గర్భధారణ సమయంలో మహిళల రొమ్ముల్లో సంభవించే మార్పులను పోలి ఉంటాయి. క్రమంగా, మీ వైద్యులు, రోజువారీ గర్భధారణ పరీక్షలలో భాగంగా రొమ్ము పరీక్షలను కూడా సిఫార్సు చేయవచ్చు. ఏమాత్రం సంకోచించకుండా, తప్పనిసరిగా పరీక్షలను చేయించుకోండి.

ఒకవేళ వారు రొమ్ములో అనుమానాస్పద కణితిని కనుగొన్న ఎడల, వైద్యులు సాధారణంగా ప్రభావిత రొమ్ముకు, మామోగ్రఫీ కన్నా, అల్ట్రాసౌండ్ చేయడం ఉత్తమంగా సూచించవచ్చు. దీనికి కారణం, మామోగ్రఫీ గర్భస్థ పిండానికి హానికరం అని చెప్పబడింది.

బయాప్సీ అనేది రొమ్ము క్యాన్సర్ గుర్తించడానికి సూచించదగిన మరో సురక్షితమైన మార్గంగా చెప్పబడుతుంది. రొమ్ముల్లో ఏర్పడిన కణజాలాల గడ్డల నుండి, ఒక చిన్న భాగాన్ని సేకరించి బయాప్సీకి పంపడం జరుగుతుంటుంది. అంతేకాకుండా కేన్సర్ కణాలను గుర్తించడానికి సూక్ష్మ దర్శిని (మైక్రోస్కోప్) కింద అధ్యయనం చేయవచ్చు.

మీ బిడ్డను క్యాన్సర్ ప్రభావితం చేస్తుందా ?

మీ బిడ్డను క్యాన్సర్ ప్రభావితం చేస్తుందా ?

రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లుగా నిర్ధారించబడ్డ తరువాత, గర్భస్థ శిశువు మీదనే ప్రధానంగా దృష్టి సారించడం జరుగుతుంది. కొన్ని ప్రాధమిక చర్యలు తీసుకోవడం ద్వారా, రొమ్ము కాన్సర్ గర్భస్థ పిండం మీద తక్షణ ప్రభావం చూపకుండా చేయవచ్చు. క్యాన్సర్ కణాలు మాయ యొక్క అడ్డుగోడ ద్వారా ప్రసరించేలా చేసిన పక్షంలో, అవి పిండం యొక్క అభివృద్ధి నిరోధక వ్యవస్థ చేతిలో నాశనం కాబడుతాయి. క్రమంగా కాన్సర్ కణాలు పిండంపై ప్రభావితం చూపకుండా జాగ్రత్త తీసుకోవచ్చు.

అయితే, తల్లి యొక్క క్యాన్సర్ కణాలు గర్భస్థ పిండానికి ప్రసరించేలా, అత్యంత అరుదైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటికీ దీని గురించిన ఖచ్చితమైన సమాచారాన్ని, వాస్తవాలను ఎటువంటి అధ్యయనాలూ బయటపెట్టలేకపోయాయి.

అయితే, తల్లి తీసుకునే చికిత్సలు, గర్భస్థ పిండంమీద ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఇవి ఎంపిక చేసిన చికిత్సల మీద ఆధారపడి ఉంటుంది. కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలు పెరుగుతున్న శిశువు మీద ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పబడింది. అందుకని సాధారణంగా, ప్రసవం తర్వాతగానీ చికిత్సను ప్రారంభించరు. అప్పటి వరకు కాన్సర్ కణాలు పెరుగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంటుంది.

 గర్భధారణ సమయంలో కీమోథెరపీ చేయించుకోవచ్చా ?

గర్భధారణ సమయంలో కీమోథెరపీ చేయించుకోవచ్చా ?

గర్భధారణ సమయంలో కొన్ని రకాల కీమోథెరపీ ఔషధాలు సురక్షితంగా చెప్పబడుతాయి. అయితే, ఈ ప్రక్రియను మొదటి త్రైమాసికంలో చేయడం జరగదు. లేనిచో, శిశువు యొక్క అభివృద్ధిపై ప్రభావం పడుతుంది. మరియు గర్భస్రావం అయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి.

అయితే, రెండవ మరియు మూడవ త్రైమాసికంలో కీమోథెరపీ చేయడం కొంతమేర సురక్షితంగా ఉంటుంది. కాకపోతే ఇందులో కూడా, శిశువు తక్కువ బరువుతో జన్మించడం లేదా, ముందస్తు జననం వంటి సమస్యలను తరచుగా ఎదుర్కోవడం గమనించబడింది. ప్రసవంలో ఎటువంటి సంక్లిష్టతలు రాకుండా ఉండేందుకు, వైద్యులు మూడు నుండి నాలుగు వారాల ముందుగానే కీమోథెరపీ సెషన్లను నిలిపివేయడం జరుగుతుంటుంది.

 చికిత్సా విధానాలలో, ఎంచుకోదగినవిగా ఏవైనా ఉన్నాయా ?

చికిత్సా విధానాలలో, ఎంచుకోదగినవిగా ఏవైనా ఉన్నాయా ?

గర్భధారణ సమయంలో రొమ్ము క్యాన్సర్ చికిత్స చేయడమనేది, కణితి పరిమాణం మరియు దాని స్థానం మరియు ప్రసవానికి ముందు ఉన్న రోజుల ఆధారితంగా నిర్ణయించబడుతుంది.

గర్భం దాల్చిన మొదట్లోనే క్యాన్సర్ సమస్యను గుర్తించినట్లయితే, కణితిని తొలగించడానికి ఉత్తమమైన మార్గంగా సర్జరీ సూచించబడవచ్చు. క్రమంగా గర్భస్థ శిశువు మీద ఎటువంటి ప్రతికూల ప్రభావాలు పడకుండా జాగ్రత్తపడవచ్చు. మరియు సురక్షితమైన పద్దతిగా సూచించబడుతుంది.

ప్రధానంగా చికిత్సా విధానాలు రెండు రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది మాస్టెక్టమీ. ఈ ఆపరేషన్లో రొమ్ము భాగాన్ని పూర్తిగా తొలగించడం జరుగుతుంది. మరియు రెండవదిగా రొమ్ము సంరక్షణ శస్త్రచికిత్స ఉంటుంది., ఇందులో, రేడియేషన్ లేదా కీమోథెరపీ వంటి వాటిని అనుసరించవలసి ఉంటుంది.

గర్భధారణ యొక్క ఏదైనా దశలో కూడా, సిఫారసు చేయబడని రకంగా రేడియోథెరపీ చికిత్స ఉంటుంది. దీనికి కారణం, ఈ చికిత్స బిడ్డకు తీవ్రంగా ప్రమాదాన్ని కలిగించేదిగా ఉంటుంది. మీ వైద్యుడు మీకు ఇచ్చిన ఒకే ఒక్క ఆప్షన్ రేడియోథెరపీ అయితే, వారు ఆ ప్రక్రియ నిర్వహించడం కొరకు డెలివరీ వరకు కూడా ఆగవలసి ఉంటుంది.

కావున, క్యాన్సర్ ఆలస్యంగా గుర్తించడం జరిగితే, ప్రసవం అయ్యే వరకు చికిత్సను వాయిదా వేయడం జరుగుతుంది. గర్భధారణ ప్రారంభ సమయంలో రొమ్ము క్యాన్సర్ నిర్ధారించబడిన ఎడల, చికిత్సకు సూచించదగిన ఉత్తమ పద్దతి, మాస్టెక్టమీ ఆపరేషన్.

మీ బాబుకు మీరు చనుబాలను ఇవ్వడం కుదురుతుందా ?

మీ బాబుకు మీరు చనుబాలను ఇవ్వడం కుదురుతుందా ?

రొమ్ము క్యాన్సర్ ఉన్నప్పుడు మీ బిడ్డకు తల్లిపాలు ఇవ్వడంలో కొన్ని ప్రద్దతులను ఆచరించవలసి ఉంటుంది. ఒకవేళ మీరు క్యాన్సర్ పూర్తి స్థాయిలో తొలగించడం కొరకు శస్త్రచికిత్సను పాటించవలసి ఉండి, మరియు కీమోథెరపీ లేదా రేడియోథెరపీ అవసరంలేని పక్షంలో మాత్రమే, మీరు మీ బిడ్డకు తల్లిపాలను అందించేందుకు ఆస్కారం ఉంది. అది కూడా వైద్యుని ధృవీకరణతో మాత్రమే జరగాలి. ఒకవేళ మీరు కీమోథెరపీ లేదా రేడియోథెరపీ చేయించుకుంటున్న పక్షంలో, చికిత్సా సమయంలో ఉపయోగించే ఔషధాలు రొమ్ము పాలలోనికి వెళ్ళే అవకాశాలు లేకపోలేదు. అవి బిడ్డకు ప్రాణహానిని తీసుకుని రాగలవు. క్రమంగా ఇటువంటి పరిస్థితుల్లో తల్లిపాలను సూచించడం జరగదు. ఈమధ్యనే జరిగిన ఒక కథనం ప్రకారం, ఒక తల్లి డిప్రెషన్ సంబంధిత మాత్రలను వేసుకుని బిడ్డకు పాలిచ్చిన కారణంగా హంతకురాలిగా ముద్ర వేయించుకోవలసి వచ్చింది. కావున బిడ్డల విషయంలో తల్లులు, వైద్యుని సూచనల ప్రకారమే మందులను అనుసరించవలసి ఉంటుందని మరువకండి. కారణం వారి రోగ నిరోధక శక్తి అత్యంత తక్కువగా ఉండడమే.

మీరు సరైన చికిత్సా పద్దతులను పాటిస్తున్న ఎడల, ఎట్టిపరిస్థితుల్లోనూ మీ బిడ్డకు ఎటువంటి హాని కలుగదు. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్న మెజారిటీ తల్లులు విజయవంతంగా దశను దాటగలిగారు కూడా. కాకపొతే ఇక్కడ మీ కుటుంబం మరియు వైద్యుని అండ ఖచ్చితంగా అవసరం అవుతుంది. మానసిక స్థైర్యం అవసరం.

కొందరు పరిస్థితి తెలిసిన వెంటనే డీలా పడిపోయి, డిప్రెషన్ వంటి సమస్యల బారిన పడుతారు. క్రమంగా రక్తపోటు, హార్మోన్ల అసమతుల్యం వంటి సమస్యలను ఎదుర్కొని, విజయావకాశాలు ఉన్నా కూడా, చేతులారా నాశనం దిశగా అడుగులు వేస్తుంటారు. కావున ఇక్కడ ప్రధానంగా మానసిక ధైర్యం అవసరంగా ఉంటుంది. మీ వైద్యుల సూచనల మేరకు, ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ, సరైన చికిత్సా పద్దతులను, ఆహార నియమావళి, వ్యాయామం వంటి వాటిని అనుసరిస్తున్న ఎడల, ఖచ్చితంగా విజయం మీ చెంత చేరుతుంది. పైగా ఇటువంటి సమస్యలు సర్వసాధారణంగా ఉంటాయన్నది వాస్తవం.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర మేకప్, ఫాషన్, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, మాతృ శిశు సంబంధ, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

What Happens If You Have Breast Cancer During Pregnancy

During pregnancy breast cancer is the most common kind of cancer that is diagnosed. One of the safe way to detect breast cancer is through biopsy
Desktop Bottom Promotion