For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమ్మో! 20 సార్లు గర్భం దాల్చిన ఆ యువతి.. 17వ సారి డెలివరీ.. అవాక్కైన డాక్టర్లు..

|

మన తాతలు, ముత్తాతల కాలంలో ఒక్కో మహిళ ఒక్కో క్రికెట్ జట్టు (11 లేదా 15 మంది) సభ్యుల సంతానాన్ని కలిగి ఉండేవారు. అప్పట్లో అది చాలా సాధారణ విషయం. ఆ సంతాన సంఖ్య కాలానుగుణంగా తగ్గుతూ వచ్చింది. మన తాతల కాలం నాటికి 5 నుండి ఏడు మంది సంతానం వరకు ఉండేది. అది కాస్త మన తండ్రుల జనరేషన్ కు వచ్చేసరికి నలుగురికి పడిపోయింది. ప్రస్తుత జనరేషన్ లో అయితే ప్రతీ జంట ఒకరు లేదా ఇద్దరు పిల్లలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? ప్రస్తుత జనరేషన్లోనూ అలాంటి రికార్డును బద్దలు కొట్టింది ఓ మహిళ. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 సార్లు గర్భం దాల్చింది. 17వ సారి ప్రసవానికి సిద్ధమైంది. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రస్తుత జనరేషన్ లో ఒక్కో మహిళకు నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ సంతానం ఉండటం చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ మాత్రం ఏకంగా 20వ సారి గర్భం దాల్చి రికార్డులను తిరగరాసింది. అంతేకాదు 16సార్లు ఇంట్లోనే 16 మంది పసిబిడ్డలకు జన్మనిచ్చింది. వీరందరూ నార్మల్ డెలివరీతోనే జన్మించడం విశేషం. కానీ వీరిలో ఐదుగురు శిశువులు ప్రసవించిన కొన్ని గంటల తర్వాత చనిపోయారు. అయినప్పటికీ ఆమెకు 11 మంది సంతానం ఉన్నారు.

అదొక్కటే కాదు ఆమెకు మూడుసార్లు

అదొక్కటే కాదు ఆమెకు మూడుసార్లు

అదొక్కటే కాదు ఆమెకు మూడుసార్లు గర్భస్రావం అయ్యింది. ఇవి కూడా మూడు నెలలు గర్భం నిలిచిన తర్వాత జరిగాయి. పదహారు సార్లు ఇంట్లోనే పురుడు పోసుకున్న ఆ మహిళ 17వ సారి డెలివరీ కోసం ఆసుప్రతికి వచ్చింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా ఆసుప్రతి వైద్యులు ఆమె 20వ సారి గర్భం దాల్చిందన్న విషయం తెలుసుకుని షాకయ్యారు.

ఇంతకీ ఆమె పేరు ఏంటంటే

ఇంతకీ ఆమె పేరు ఏంటంటే

ఇంతకీ ఆమె పేరు ఏంటంటే లంకాబాయి ఖరత్. 38 ఏళ్ల వయసులో 20వ సారి గర్భం దాల్చి ఆసుప్రతికి వచ్చిన రావడంతో అందరూ నోరెళ్లబెట్టారు. ఆమెను పరీక్షించిన వైద్యులు సైతం ఇదే నిజమేనని తెలుసుకుని విస్తుపోయారు.

ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భవతి

ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భవతి

ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భవతిగా ఉందని, బీడ్ జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ అశోక్ థొరాట్ నిర్ధారించారు. తల్లి, ఆమె గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఇన్నిసార్లు గర్భం ధరించడం వల్ల నెలలు నిండకుండానే ఆమెకు ప్రసవం అయ్యే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. సో ఆమె త్వరలో మరో బిడ్డకు జన్మను ఇవ్వనుంది.

ఎక్కువ సార్లు గర్భం ధరిస్తే..

ఎక్కువ సార్లు గర్భం ధరిస్తే..

మహిళ శరీరంలో పిండం పెరిగే గర్భాశయం ఒక కండరం వంటిది. డెలివరీ అయిన ప్రతిసారీ ఆ కండరం సాగిపోతుందని వైద్యులు తెలిపారు. ఎక్కువ సార్లు గర్భం దాల్చిన మహిళలో మాయ(ప్లసెంటా) విడిపోయిన తర్వాత గర్భాశయం సంకోచించడం కష్టంగా ఉంటుంది.

వరుస కాన్పుల వల్ల గర్భసంచి బలహీనపడటమే కాకుండా

వరుస కాన్పుల వల్ల గర్భసంచి బలహీనపడటమే కాకుండా

వరుస కాన్పుల వల్ల గర్భసంచి బలహీనపడటమే కాకుండా, తీవ్రస్థాయిలో రక్తం పోయే ముప్పు కూడా ఉంటుంది. గత గర్భధారణకు సంబంధించి గర్భాశయంలో ఉండిపోయే స్కార్ కణజాలం ప్లసెంటాకు సమస్యల్ని తెప్పించడమే కాకుండా, నెలలు నిండాకుండానే ప్రసవం అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

English summary

A woman pregnant for 20th time

In the current generation it is very rare for a woman to have four or more children. However, only one woman from Maharashtra conceived the record for the 20th time. She also gave birth to 16 toddlers at home 16 times. They are all born with normal delivery. But five of them died just hours after giving birth. However, she has 11 children.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more