For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో పుప్పొడి బహిర్గతం పీడియాట్రిక్ ఆస్తమా ప్రమాదాన్ని పెంచుతుందా..

|

అలర్జీ అనే వ్యాధి ఎక్కువగా వచ్చేందుకు పుప్పొడి ఒక కారణంగా చెప్పొచ్చు. గడ్డి మరియు కలుపు ద్వారా ఉత్పత్తి చేయబడిన చక్కటి పొడినే పుప్పొడి అంటారు. ఈ పుప్పొడి ఊపిరి పీల్చుకున్నప్పుడు అవాంతరాలను కలిగిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థకు వ్యతిరేకంగా ఇది ఒక రసాయనాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇలా కొందరు ఏడాది పొడవునా పుప్పొడి అలర్జీలతో బాధపడుతుంటారు. మరికొందరు ఏడాదిలో కొన్ని సమయాల్లో మాత్రమే ఈ అలర్జీతో బాధపడుతుంటారు. మరి గర్భిణులు ఈ వ్యాధి వస్తే వారికి పుట్టబోయే పిల్లలకు ప్రమాదమా లేదా అనే విషయాలతో పాటు ఈ అలర్జీకి అడ్డుకట్ట వేసేందుకు గల మార్గాలను తెలుసుకునేందు ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవండి..

1) పుప్పొడి మరియు ఉబ్బాసానికి మధ్య లింక్..

1) పుప్పొడి మరియు ఉబ్బాసానికి మధ్య లింక్..

ఉబ్బసం కోసం ఒక మామూలు ట్రిగ్గర్ మాదిరిగా ఉండే అలర్జీ కారకం ఒక వ్యక్తిలో పరిస్థితిని ప్రేరేపిస్తుంది. దీంతో మీ ఊపిరితిత్తులు ప్రభావితమవుతాయి. పైన చెప్పినట్లుగా, పుప్పొడి మీ శ్వాసకోశ వ్యవస్థలోకి ప్రవేశించినపుడు, రోగ నిరోధక వ్యవస్థకు నష్టం కలిగిస్తుంది. అంతేకాదు మీ శరీరంలో అలర్జీ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. ఎందుకంటే రోగ నిరోధక వ్యవస్థ ప్రోటీన్లు లేదా యాంటీ బాడీస్ పుప్పొడిని చెడుగా పరిగణిస్తాయని పలు పరిశోధనల్లో తేలింది.

2) ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం..

2) ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం..

రోగ నిరోధక వ్యవస్థ ద్వారా విడుదలయ్యే రసాయనాలు ముక్కు కారటం, కళ్లు దురద, చర్మ ప్రతిచర్యలతో పాటు మొదలైన వాటికి కారణమవుతాయి. ఉబ్బసం ఉన్న వ్యక్తులలో, పుప్పొడి వాయుమార్గాలు మరియు ఊపిరితిత్తులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. లక్షణాలను ప్రేరేపిస్తుంది. దీంతో మీ పరిస్థితి మరింత దిగజారిపోతుంది.

3) ఉరుములతో కూడిన ఉబ్బసం..

3) ఉరుములతో కూడిన ఉబ్బసం..

ఉరుములతో కూడిన ఉబ్బసం అనేది ఒక వాతావరణ ఆధారిత పరిస్థితి. ఇది ఉబ్బసం ఉన్నవారికి క్లిష్టమైనది. ఇది పుప్పొడి మరియు వాతావరణ పరిస్థితుల మిశ్రమం. గాలిలో ఉండే పుప్పొడి వర్షపు బిందువులు లేదా గాలితో సంబంధంలోకి వచ్చి చిన్న కణాలుగా విచ్ఛిన్నమైనప్పుడు సంభవిస్తుంది. ఈ విచ్ఛిన్నమైన కణాలు మీ ఊపిరితిత్తుల యొక్క లోతైన భాగాలలోకి ప్రవేశిస్తాయి. మీ శ్వాసకోశను అస్తవ్యస్తం చేస్తాయి. ఇది ఊపిరి వేగంగా శ్వాస తీసుకోవడం, ఛాతీలో గట్టి భావన మరియు శ్వాసతో తీవ్రమైన దగ్గును కలిగిస్తుంది.

4) పీడియాట్రిక్ ఆస్తమాకూ కారణం కావచ్చు..

4) పీడియాట్రిక్ ఆస్తమాకూ కారణం కావచ్చు..

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్నోలోని లా ట్రోబ్ విశ్వ విద్యాలయంలో పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం గర్భిణీ తల్లులలో పుప్పొడి బహిర్గతమయ్యే ప్రభావాన్ని అన్వేషించారు. త్వరలో పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుందా అని పరిశీలించారు. చివరి త్రైమాసికంలో ప్రసూతి పుప్పొడి బహిర్గతం పిల్లల్లో ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని పెంచే అవకాశాలున్నాయని అధ్యయనం సూచించింది.

5) అలర్జీ వ్యాధుల సూచన..

5) అలర్జీ వ్యాధుల సూచన..

పుప్పొడి సీజన్లో పుట్టుకొచ్చిన లేదా పుట్టిన పిల్లలలో బొడ్డు తాడు రక్తంలో అధిక ఇమ్యునోగ్లోబులిన్ స్థాయిలు ఉన్నాయని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఇది అలర్జీ వ్యాధుల సూచన. ఇది భవిష్యత్తులో మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతుంది.

6) మరిన్ని పరిశోధనలు..

6) మరిన్ని పరిశోధనలు..

మెల్బోర్నోలోని లా ట్రోబ్ విశ్వవిద్యాలయం యొక్క అసోసియేట్ ప్రొఫెసర్ బిర్కాన్ ఎర్బాస్, ‘‘పుట్టిన తర్వాత మొదటి రెండు నెలల్లో బహిరంగ పుప్పొడి బహిర్గతం వల్ల అలర్జీ శ్వాసకోశ వ్యాధులకు దారితీసే విషయం గురించి అందరికీ తెలుసు. కానీ వారు దీనిపై మరింత పరిశోధనలు చేశారు. వారు కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. బొడ్డుతాడు రక్తంలో అధిక స్థాయిలో ఇమ్యునోగ్లోబులిన్ ఉన్న పిల్లలకు బాల్యం నుండే అలర్జీ పెరుగుతుందని అధ్యయనాలు సూచించాయని ఓ పరిశోధకు తేల్చారు. అయితే పుప్పొడి బహిర్గతం (గర్భాశయంలో) దానిపై ప్రభావం చూడం అస్పష్టం ఉంది.

7) పుప్పొడి ఒక ఎక్స్ పోజర్..

7) పుప్పొడి ఒక ఎక్స్ పోజర్..

పైన పేర్కొన్న దానికి ఇంటర్నేషనల్ జర్నల్ లో ప్రచురించబడిన మరో అధ్యయనం నుండి మద్దతు లభించింది. ఇది మొత్తం గడ్డి పుప్పొడి కాలం వరకు గర్బవతిగా ఉండటం వల్ల ఉబ్బసం సమస్యల నుండి శిశువులపై రక్షణ ప్రభావం ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత అధ్యయనం ప్రకారం ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధుల అంచనా, నివారణ మరియ నిర్వహణ గురించి కొత్త అవగాహనను కలిగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఉబ్బసం ఎవరికి వస్తుందో నిర్ణయించే అనేక అంశాలు ఉన్నాయని అధ్యయనం నొక్కి వక్కాణిస్తోంది. ఎందుకంటే పుప్పొడి ఒక ఎక్స్ పోజర్ అంశం మాత్రమే..

8) ఉబ్బసంపై పుప్పొడి ప్రభావాన్ని నిరోధించేందుకు మార్గాలు

8) ఉబ్బసంపై పుప్పొడి ప్రభావాన్ని నిరోధించేందుకు మార్గాలు

మీ ప్రాంతంలో ఏ రకమైన పుప్పొడి సమస్యగా ఉందో తెలుసుకోండి.

వాటిని నివారించడమే లక్ష్యంగా పెట్టుకోండి.

ఇంట్లో ఉండే సమయంలో, అధిక పుప్పొడి రోజులు, గాలులతో కూడిన రోజులలో తలుపులు మరియు కిటికీలు మూసివేయడానికి ప్రయత్నించండి.

కారులో ప్రయాణించేటప్పుడు, కిటికీలు మూసివేసి ఉంచండి.

ఫేస్ మాస్కును తప్పకుండా ధరించండి.

పుప్పొడిని మొత్తం తగ్గించడానికి మీరు ఇంటికి తిరిగొచ్చినప్పుడు చేతులు మరియు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.

మరిన్ని జాగ్రత్తల కోసం మీరు వైద్యుడిని సంప్రదించండి.

English summary

Pollen Exposure During Pregnancy May Increase The Risk Of Paediatric Asthma

An allergic reaction is a common trigger for asthma. This will affect your lungs. As mentioned above, when pollen enters your respiratory system, it causes damage to the immune system. It also triggers an allergic reaction in your body. This is because many studies have shown that the immune system proteins or antibodies treat pollen badly.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more