For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వయస్సు దాటితే గర్భం పొందడం ప్రమాదకరం? కొన్ని వాస్తవాలను తెలుసుకోండి

ఈ వయస్సు దాటితే గర్భం పొందడం ప్రమాదకరమా? కొన్ని వాస్తవాలను తెలుసుకోండి

|

మహిళల్లో వయస్సు పెరిగే కొద్ది ప్రత్యుత్పత్తి మరియు ఫలదీకరణ అవకాశాలు తగ్గుతాయి. ప్రస్తుత ఆధునిక యుగంలో ఆలస్యంగా వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతారు. స్త్రీ, పురుషులిద్దరిలోనూ కెరీర్, ఉద్యోగం అంటూ 30ఏళ్ళ తర్వాత పెళ్ళి చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ అలా పెళ్ళి చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని యుత గ్రహించలేకపోతున్నారు. ఆలస్యం పెళ్ళి చేసుకోవడం వల్ల సంతానం పొందలేకపోతున్నారు. తల్లి అయ్యే అద్రుష్టాన్ని ఏ ముప్పై అయిదో లేదా నలబైలోనో జరుగుతోంది. మరికొందరిలో అయితే ఫలదీకరణ విషయంలో చాలా సమస్యలకు కారణం అవుతున్నది. వైవాహిక జీవితంలో స్త్రీ, పురుషులిద్దరికి వంధ్యత్వం ఒక విలన్ గా మారుతుంది. ఇది వారు పిల్లలు కనడానికి ఒక సవాలుగా ఎదుర్కోవల్సి వస్తుంది. కానీ నలభై ఏళ్ళ తర్వాత స్త్రీలు గర్భం పొందాలంటే కొన్ని వాస్తవిక విషయాలను తెలుసుకోవాలి.

Risk Factors Of Pregnancy After 40

ఈ మధ్య కాలంలో వంధ్యత్వానికి చికిత్స తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇది తరచూ స్త్రీ, పురుషుల్లో వివిధ రకాల సమస్యలను కలిగిస్తుంది. . నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మారుతున్న జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లు క్రమంగా వంధ్యత్వం వంటి సమస్యలకు దారితీస్తున్నాయి. 35ఏళ్ళ తర్వాత గర్భం పొందాలంటే స్త్రీలలో అనేక సమస్య ఉన్నాయి. 35 తర్వత తల్లి అవ్వాలని కోరుకునే వారు అందుకు తగిన విధంగా ట్రీట్మెంట్ తీసుకోవల్సి ఉంటుంది. 35 లేదా 40 ఏళ్ళ తర్వాత గర్భాధారణ కోరుకునే వారు తెలుసుకోవల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు మరియు ప్రమాదాలు ఈ క్రింది విధంగా..

గర్భధారణ

గర్భధారణ

35 నుండి 40 సంవత్సరాల వయస్సు తరువాత, మహిళల్లో సంతానోత్పత్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి. వృద్ధులకు ఎక్కువ సమయం పట్టవచ్చు లేదా గర్భం దాల్చే అవకాశాలు ఉండకపోవచ్చు. 35 సంవత్సరాల గర్భధారణ పొందే వారిలో గర్భధారణ మధుమేహం, ఎండోమెట్రియోసిస్ మరియు మూత్ర మార్గము యొక్క ఇన్ఫెక్షన్స్ అభివృద్ధి చెందుతాయి. ఇది వారి కడుపులో పెరిగే పిండానికి సమస్యలను సృష్టిస్తుంది.

ప్రసవం తరువాత మళ్ళీ గర్భం

ప్రసవం తరువాత మళ్ళీ గర్భం

30ఏళ్ళ లోపు ఉన్నవారు మొదటి డెలివరీ తర్వాత రెండు మూడు సంవత్సరాల్లో తిరిగి గర్భం పొందవచ్చు. అయితే లేటు వయస్సులో మొదటి సారి గర్భాధారణ, ప్రసవం తర్వాత మీరు థైరాయిడ్ మరియు డయాబెటిస్ వంటి వ్యాధుల బారిన పడకపోతే రెండవసారి గర్భం ప్రయత్నించవచ్చు. కానీ మీరు నలభై ఏళ్లు పైబడి ఉంటే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే అది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

గర్భ నిరోధక మాత్రలు

గర్భ నిరోధక మాత్రలు

రోజూ గర్భనిరోధక మాత్రలు తీసుకునే వారు గర్భం పొందే అవకాశం ఉండదు . కొన్నిసార్లు గర్భనిరోధక మాత్ర తీసుకోని మహిళలు మందుల ద్వారా అండోత్సర్గము చేయించుకోవలసి వస్తుంది, ఇది రుతు చక్రంలో గర్భవతి అయ్యే అవకాశాలను పెంచుతుంది. కానీ ఈ నలభై ఏళ్ళ తర్వాత గర్భాధారణ పొందలేని మహిళలకు గర్భంలో ఉన్న లోపాలను లేదా సమస్యలకు గల కారణలేమిటో చెప్పలేము.

ఇబ్బందులు:

ఇబ్బందులు:

పెళ్ళై పాతిక సంవత్సరాలైనా మీరు గర్భం ధరించడానికి ప్రయత్నించకుండా ఉంటే చాలా ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. అవి ఏమిటో చూద్దాం. వీటి గురించి తెలుసుకున్న తర్వాత గర్భధారణకు ప్రయత్నించాలి.

ప్రసవం కష్టం అవుతుంది

ప్రసవం కష్టం అవుతుంది

లేటు వయస్సులో గర్భధారణ, ఆకస్మిక ప్రసవం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది తల్లి మరియు శిశువు యొక్క ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రతికూల ప్రభావానికి దారితీస్తుంది. చాలా మంది మహిళలు లేటు వయస్సులో గర్భం పొందండం ద్వారా ప్రసవ సమయంలో కష్టం అయ్యి సిజేరియన్ కు దారితీస్తుంది.

శిశు ఆరోగ్యం

శిశు ఆరోగ్యం

మహిళలు లేటుగా గర్భం దాల్చడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తరచుగా ప్రభావం చూపుతుంది. గర్భాధారణ ఆలస్యం కారణంగా శిశువు ఆరోగ్య విషయంలో సమస్యలకు దారితీస్తుంది. తల్లి కావాలని సిద్ధమవుతున్నప్పుడు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి.

పిల్లల వైకల్యాలు

పిల్లల వైకల్యాలు

గర్భధారణ సమయాన్ని ఆలస్యం చేయడం వల్ల శిశువు పుట్టుకతో వచ్చే లోపాలు ఏర్పడతాయి. ఇది భవిష్యత్తులో చాలా సమస్యలకు కూడా దారితీస్తుంది. కొంతమందికి సహజ ప్రసవంతో ఇబ్బంది ఉంటుంది. అందువల్ల సిజేరియన్ వల్ల కూడా భవిష్యత్తులో మహిళలు కొన్నిసమస్య ఎదుర్కొంటారు. లేటు వయస్సులో పిల్లలు కనే వారిలో సిజేరియన్ సాధారణం, వీటి ద్వారా సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయని తప్పనిసరిగా తెలుసుకోవాలి.

English summary

Risk Factors Of Pregnancy After 40

We have listed some of the risk factors of pregnancy after 40's read on.
Desktop Bottom Promotion