For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్త్రీలకు తీవ్ర ఇబ్బందులు కలిగించే గర్భాశయ కణుతులు(ఫైబ్రాయిడ్స్‌): కారణాలు, లక్షణాలు, చికిత్స మరియు

స్త్రీలకు తీవ్ర ఇబ్బందులు కలిగించే గర్భాశయ కణుతులు(ఫైబ్రాయిడ్స్‌): కారణాలు, లక్షణాలు, చికిత్స మరియు

|

సహజంగా స్త్రీలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు. స్త్రీలు ఎదుర్కొనే సాధారణ సమస్యలో ఒకటి. గర్భాశయ ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్స్ ను కణుతులు లేదా సాధారణ భాషలో గడ్డలు అని కూడా పిలుస్తుంటారు. వీటినే వైద్యపరిభాషలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అని పిలువబడుతుంది. వీటి భారీన పడ్డ మహిళలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు.

Uterine Fibroids: Symptoms, Causes,Treatment and Natural Remedies,

ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల పొడవు వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే వీటి పెరుగుదల కొందరిలో వేగంగా ఉంటే , మరికొందరిలో ఆలస్యంగా ఉంటుంది. ఇంకొందరి నిదానంగా నిలకడగా, స్వల్ప పరిమాణంలో ఉంటూ ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు. గర్భాశయంలో వీటిని ఉనికిని, పరిమాణంను బట్టి మూడు రకాలుగా విభజిస్తారు.

గర్భాశయంలో ఉనికిని, పరిమాణంను బట్టి మూడు రకాలు

గర్భాశయంలో ఉనికిని, పరిమాణంను బట్టి మూడు రకాలు

1) సబ్‌సీరోజల్‌ ఫైబ్రాయిడ్స్‌

2) ఇంట్రామ్యూరల్‌ ఫైబ్రాయిడ్స్‌

3) మ్యూకోజల్‌ ఫైబ్రాయిడ్స్‌.

గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ కు కారణాలు:

గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ కు కారణాలు:

  • గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఎందువల్ల ఏర్పడతాయన్న విషయంపై ఇంతరకు నిర్ధారణ లేదా స్పష్టత లేదు. కానీ, స్త్రీల శరీరంలో కొన్ని హార్మోన్ల కారణంగా ..ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది.
  • మహిళల పీరియడ్స్, గర్భదారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది.
  • మహిళల మోనోపాజ్ దశలో అంటే నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పత్తి చాలా వరకు తక్కువగా ఉండటంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది.
  • ఇంకా స్థూలకాయం, వంశపార్యపర్యత వల్ల కూడా గర్భాశయంలో కణుతులు ఏర్పడటానికి ముఖ్య కారణాలు.
  • గర్భాశయంలో కణుతులు ఉంటే లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

    గర్భాశయంలో కణుతులు ఉంటే లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

    • గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిమాణం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి.
    • అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి లక్షణాలు కనబడుతాయి.
    • ఇంకా ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పెరిగి తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తుంది.
    • ప్రేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు.
    • చికిత్స:

      చికిత్స:

      శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు.

      డైట్ టిప్స్ :

      డైట్ టిప్స్ :

      చాలా వరకు తాజా పండ్లు, కూరగాయలు, లెగ్యూమ్స్, మరియు చేపలు మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆ మెడిటేరియన్ డైట్ ను రెగ్యులర్ గా తసుకుంటే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఫైబ్రాయిడ్ రిస్క్ ను తగ్గిస్తుంది.

      గ్రీన్ టీ :

      గ్రీన్ టీ :

      గ్రీన్ టీని రెగ్యులర్ గా తాగాలి. ఇందులో ఉండే ఎపిహల్లోక్యాటెచిన్ గల్లెట్ ఫైబ్రాయిడ్ సెల్స్ పెరగకుండా నివారిస్తుంది. ఫైబ్రాయిడ్ డెత్ రేటు పెంచుతుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ మిరయు యాంటీ ప్రొలిఫరేషన్ మరియు యాక్సిడేటివ్ ప్రభావాల వల్ల కూడా కణుతులు కుచుంచుకుపోవడం జరుగుతుంది.

      పాలు :

      పాలు :

      అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎపిడెర్మాలాజీ ప్రకారం రోజుకు మూడు నాలుగు సార్లు డైరీ ప్రొడక్ట్స్ తీసుకునే వారిలో 30శఆతం యూటేరియన్ పైబ్రాయిడ్స్ రావని నిర్ధారించారు.

      ఆపిల్ సైడర్ వెనిగర్ :

      ఆపిల్ సైడర్ వెనిగర్ :

      ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్ లో ఇది చాలా పర్ఫెక్ట్ హోం రెమెడీ. శరీరంలో ఫైబ్రాయిడ్ కు కారణం అయ్యే టాక్సిన్స్ ను తొలగించడానికి ఇది చాలా సహాయపడుతుంది. ఫ్యాట్ లాస్ ను ప్రోత్సహిస్తుంది. కణుతులను ముడుచుకుపోయేలా చేస్తుంది.

      వెల్లుల్లి :

      వెల్లుల్లి :

      వీటిలో ఉండే న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు టూమర్స్ మరియు యూటేరియన్ ఫైబ్రాయిడ్స్ పెరగకుండా అడ్డుకుంటుంది. రోజుకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తినవచ్చు.

      ఆమ్లా:

      ఆమ్లా:

      ఫైబ్రాయిడ్స్ నివారించడంలో ఎక్సలెంట్ న్యాచురల్ రెమెడీ ఆమ్లా. ఆమ్లాలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫైబ్రాయిడ్స్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తాయి. ఒక టీస్పూన్ ఆమ్లా పౌడర్ ఒక టీస్పూన్ తేనె కలిపి ఉదయం పరగడుపున తీసుకోవాలి.

      ఆల్కహాల్ మానేయాలి:

      ఆల్కహాల్ మానేయాలి:

      కొన్ని రకాల ఆల్కహాల్స్ ఫైబ్రాయిడ్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఆల్కహాల్ హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ కు కారణం అవుతుంది. కాబట్టి, వాటిని ఆల్కహాల్ మానేయడం మంచిది.

English summary

Uterine Fibroids: Symptoms, Causes,Treatment and Natural Remedies

A natural cure for fibroids is not only effective in most cases, but it also answers your query about how to treat fibroids at home without any risk of side-effects.
Story first published:Friday, September 20, 2019, 17:31 [IST]
Desktop Bottom Promotion