For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pregnancy: కొందరిలో రెండోసారి గర్భం ఎందుకు కష్టంగా మారుతుంది? ఇవే కారణాలు కావొచ్చు!

|

Pregnancy: ఓ బిడ్డకు జన్మనివ్వడం అనేది ఓ మధురానుభూతి. అమ్మ అని పిలిపించుకోవడం నిజంగా ఓ వరం అనే చెప్పాలి. నాన్న పిలుస్తుంటే ఆ ఆనందాన్ని వెల కట్టలేం. అలాగే రెండో బిడ్డను ప్లాన్ చేసుకోవడం మీకు మీ జీవిత భాగస్వామికి థ్రిల్లింగ్ అనుభవంగా ఉంటుంది. నవ జాత శిశువును చూసుకోవడంలో ముందు అనుభవం ఉన్న మీరు ఈ సమయంలో శారీరకంగా మరియు మానసికంగా సిద్ధమై ఉంటారు. ఇక ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. కానీ కొందరిలో ఈ ఎదురుచూపులు ఎప్పటికీ అలాగే ఉంటాయి.

సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటి?

సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటి?

ఈ మధ్య కాలంలో రెండో సారి గర్భం దాల్చడం చాలా మందిలో సమస్యగా మారింది. మొదటిసారి వచ్చినంత సులభంగా చాలా మందిలో రెండో సారి గర్బం రావడం లేదు. ఇలా రెండోసారి గర్భం రావడం కష్టంగా మారడాన్ని వైద్యులు సెకండరీ ఇన్ఫెర్టిలిటీ గా అభివర్ణిస్తున్నారు. ఈ రకమైన సమస్య ఈ మధ్య కాలంలో చాలా మందిలో కనిపిస్తుంది. ముఖ్యంగా 30 ఏళ్ల చివరకు వచ్చిన వారు 40వ పడిలో అడుగుపెట్టిన మహిళల్లో ఈ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ కనిపిస్తోందని గైనకాలజిస్టులు చెబుతున్నారు.

రెండోసారి గర్భం దాల్చడం అంత కష్టమా?

సంతానోత్పత్తి విషయానికి వస్తే, మొదటి సారి గర్భం దాల్చడం, శిశువు జన్మించడం అనేది.. రెండో గర్భం రావడానికి సూచిక ఏమాత్రం కాదన్నది వైద్యులు చెప్పే మాట. మొదటి గర్భం విజయవంతంగా జరిగిందని... రెండోది కూడా అలాగే సక్సెస్ అవుతుందని అనుకోవడం పొరపడినట్లే. సెంకడరీ ఇన్ఫెర్టిలిటీ అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రాథమిక వంధ్యత్వానికి కారణమయ్యే అనేక అంశాలు ద్వితీయ వంధ్యత్వాన్ని కూడా కారణం కావొచ్చు.

రెండోసారి గర్భం దాల్చలేకపోవడానికి కొన్ని కారణాలు

రెండోసారి గర్భం దాల్చలేకపోవడానికి కొన్ని కారణాలు

వయస్సు:

మహిళ సంతానోత్పత్తి సామర్థ్యం వయస్సుతో పాటు పడిపోతుంది. కాబట్టి మొదటి గర్భం కంటే రెండో సారి గర్భం దాల్చడం కష్టంగా మారుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ హార్మోన్ల ఉత్పత్తి మందగిస్తుంది. కొన్ని వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. ఈ రెండు కూడా రెండోసారి గర్భం దాల్చడంలో సమస్యగా మారవచ్చు. అలాగే వయస్సు పెరిగే కొద్దీ అండాల ఉత్పత్తి పడిపోతూ ఉంటుంది. 35 ఏళ్లు దాటినప్పటి నుండి, వయసు పెరిగేకొద్దీ సెంకడరీ ఇన్ఫెర్టిలిటీ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

పురుషులలో తక్కువ స్పెర్మ్ కౌంట్:

వయస్సు, జన్యుపరమైన సమస్యలు, పర్యావరణ కారకాలు, ఫిట్ ‌నెస్, ఇతర వ్యాధుల కోసం వాడే మందుల వల్ల స్పెర్మ్ సంఖ్య, వాటి నాణ్యత పడిపోతుంది. ఇవే కాకుండా కొన్ని అలవాట్ల వల్లక కూడా స్పెర్మ్ కౌంట్ ప్రభావితం అవుతుంది.

* టెస్టోస్టెరాన్ బూస్టర్లను ఉపయోగించడం వల్ల స్పెర్మ్ సంఖ్య తగ్గుతుంది.

* వృషణాలు వేడికి గురైతే.. స్పెర్మ్ సంఖ్యపై ప్రభావం పడుతుంది. వృషణాలు కొన్ని ప్రయోజనాల కోసం శరీరం బయట ఉంటాయి. బిగుతుగా ఉండే బట్టలు (బైకర్ షార్ట్‌లు వంటివి) లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల వాడకం వల్ల చాలా వెచ్చగా ఉంటే స్పెర్మ్ కౌంట్ ప్రభావితం అవుతుంది.

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS):

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS):

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటే హార్మోన్ల రుగ్మత లేదా

అండోత్సర్గానికి అంతరాయం కలిగించడాన్ని పి.సి.వో.ఎస్ అంటారు. ఇది మీ పీరియడ్స్ సక్రమంగా లేకపోవడానికి కారణం అవుతుంది. PCOS, గత ఆపరేషన్లు మరియు ఇన్ఫెక్షన్లతో సహా వివిధ కారణాల వల్ల వంధ్యత్వానికి కారణం కావచ్చు.

ఊబకాయం లేదా అధిక బరువు:

అధిక బరువు ఉండటం వల్ల పురుషులు మరియు స్త్రీలకు గర్భం దాల్చడం కష్టం అవుతుంది. మహిళల్లో బరువు పెరగడం ఇన్సులిన్ నిరోధకతకు దారి తీస్తుంది.అలాగే టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. తద్వారా గర్భం రాకుండా చేస్తుంది. పురుషులలో అధిక బరువు ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది.

అధిక ఆల్కహాల్:

అధిక ఆల్కహాల్:

అధిక మద్యపానం సేవించడం వల్ల పురుషులు మరియు స్త్రీలలో గర్భం దాల్చడం కష్టం అవుతుంది. ఒక రోజులో రెండు కంటే ఎక్కువ పానీయాలు లేదా వారానికి ఏడు కంటే ఎక్కువ పానీయాలు తాగే స్త్రీలు గర్భం దాల్చడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టే అవకాశాలు తగ్గుతాయి. తక్కువ ఆల్కహాల్ వినియోగం శిశువు కోసం ప్రయత్నిస్తున్న పురుషులకు కూడా సహాయపడుతుంది. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం హార్మోన్లు, స్పెర్మ్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది.

ధూమపానం:

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చాలా మందికి తెలిసినప్పటికీ, అది సంతానోత్పత్తికి హాని కలిగిస్తుందని తెలియకపోవచ్చు. ధూమపానం అండాల ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. ఓవ్యూలేషన్ సమస్యలను సృష్టిస్తుంది. ధూమపానం మహిళల్లో ఇన్ఫెర్టిలిటీకి గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది.

రెండో గర్భం కోసం ఏంచేయాలి?

35 ఏళ్లు వయస్సు కంటే ఎక్కువ ఉన్న వారు రెండో గర్భం కోసం ప్రయత్నిస్తుంటే.. కొంత సహనం అలవర్చుకోవాలి. పైన చెప్పిన కారణాల వల్ల గర్భం రావడం కొన్ని సార్లు ఆలస్యం కావొచ్చు. రెండోసారి గర్భం కోసం జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించాలి. రోజూ వ్యాయామం చేయడంతో పాటు దురలవాట్లను మానుకోవాలి. అలాగే వైద్యులను సంప్రదించి, వారు చెప్పినట్లుగా నడుచుకోవాలి. ప్రస్తుతం పునరుత్పత్తి పద్ధతుల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. అవి మీకు సహాయపడవచ్చు. తప్పక ప్రయత్నించండి.

English summary

Why is second pregnancy difficult for some? reasons in Telugu

read on to know Why is second pregnancy difficult for some? reasons in Telugu
Story first published: Wednesday, July 20, 2022, 17:00 [IST]
Desktop Bottom Promotion