For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Premature Baby Care Tips: నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డల సంరక్షణలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

|

Premature Baby Care Tips: బిడ్డకు జన్మనివ్వడం అనేది ఓ అద్భుతమైన అనుభవం. తల్లి, తండ్రి కావడం అనేది ఓ మధురానుభూతి. కానీ శిశువులు నెలలు నిండకముందే పుడితే వారి సంరక్షణ కొంత సవాల్ తో కూడుకుని ఉంటుంది. వారు చాలా సున్నితంగా ఉంటారు. శిశువును కంటికి రెప్పలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

శిశువుల పట్ల జాగ్రత్త అవసరం:

శిశువుల పట్ల జాగ్రత్త అవసరం:

నెలలు నిండకముందే పుట్టే శిశువుల శరీర భాగాలు పూర్తి స్థాయిలో ఎదగవు. పూర్తి స్థాయిలో బిడ్డ ఎదగకముందే జన్మిస్తే వారిని... ఇంక్యూబేటర్ లో ఉంచి చికిత్స అందిస్తారు. గర్భంలో ఉండే తరహా వాతావరణం కల్పించి బిడ్డను, లోపలి అవయవాలు ఎదిగేలా చేస్తారు. ఆ బిడ్డను దవాఖానా నుండి ఇంటికి తీసుకువచ్చినా కూడా తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

ఏ వారంలో ప్రసవం జరుగుతుంది:

ఏ వారంలో ప్రసవం జరుగుతుంది:

సాధారణంగా 40 వారాల లోపు ప్రసవం జరుగుతుంది. ఇది 37 నుండి 40 వారాల మధ్య ఉంటుంది. కొంతమందిలో వారం నుండి 10 రోజుల తేడా ఉంటుంది. 37 వారాల లోపు పిల్లలు పుడితే దానిని ప్రిమెచ్యూర్ కోవలోకి వస్తారు. ఒకవేళ 28 వారాల లోపే ప్రసవం జరిగితే అలాంటి కేస్ ను ఎక్స్ ట్రీమ్ ప్రి మెచ్యూర్ గా పరిగణిసతారు. నెలలు నిండకుండానే పుట్టిన శిశువులను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి.

జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఏమిటి?:

జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఏమిటి?:

నెలలు నిండని పిల్లలు తరచుగా ఇన్ఫెక్షన్లు, హైపోథెర్మియా, శ్వాస సమస్యలు చుట్టు ముడతాయి. అలాగే అలాంటి శిశువుల్లో అవయవాలు పూర్తి స్థాయిలో ఎదగవు. దీని ఫలితంగా, వారు గర్భాశయం వెలుపల ఉన్న తర్వాత ఒకసారి జీవితాన్ని సరిగ్గా స్వీకరించలేరు. అందుకే వారికి ప్రత్యేక శ్రద్ధ అవసరం అవుతుంది..

1. నాడీ వ్యవస్థలోని కొన్ని భాగాలు ఇంకా బాగా అభివృద్ధి చెందకపోవచ్చు.

2. చర్మం కింద వేడిని ఉత్పత్తి చేసే కొవ్వు చాలా తక్కువ ఉంటుంది.

3. శరీర బరువు లేదా తక్కువ కొవ్వు సమస్యల కారణంగా వారు తమ చర్మం నుండి త్వరగా వేడిని కోల్పోతారు.

4. వారు అపరిపక్వ ఊపిరితిత్తులను కలిగి ఉండవచ్చు. ఇది శ్వాస సమస్యలకు దారితీయవచ్చు.

5. వారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే వారు వివిధ అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

6. వారి మెదడులోని సిరలు సాధారణం కంటే సన్నగా మరియు అపరిపక్వంగా ఉంటాయి. అందువల్ల రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.

ప్రీమెచ్యూర్ బేబీస్ సంరక్షణ:

ప్రీమెచ్యూర్ బేబీస్ సంరక్షణ:

1. తల్లిపాలు ఇవ్వడం

తల్లిపాలు బిడ్డ సంరక్షణ, పోషణకు ఎంతో ముఖ్యమైనవి. శిశువు పుట్టిన తర్వాత మొదటి 6 నెలల వరకు తల్లి పాలు తప్ప మరేది తినిపించకూడదు.

2. వారికి చాలా దగ్గరగా ఉండాలి

2. వారికి చాలా దగ్గరగా ఉండాలి

స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్ మీ బిడ్డ మరియు మీకు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. దీనిని 'కంగారూ కేర్' అని కూడా అంటారు. బిడ్డను చర్మానికి దగ్గరగా అంటిపెట్టుకోవడం వల్ల వారు బరువు పెరుగుతారు. అలాగే తల్లి, తండ్రి శరీరం నుండి వచ్చే వెచ్చదనం వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వారి గుండె మరియు శ్వాస రేటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది వారికి ఎక్కువ సమయం ప్రశాంతంగా మరియు గాఢనిద్రలో గడపడానికి సహాయపడుతుంది.

3. సేఫ్ స్లీపింగ్ మార్గదర్శకాలు

3. సేఫ్ స్లీపింగ్ మార్గదర్శకాలు

శిశువులతో కలిసి తల్లి నిద్రపోవాలి. పడుకుని పాలు ఇవ్వడం చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అలాగే పక్కనే బిడ్డను చూసుకుంటూ ఉండటానికి మించిన మధురానుభూతి మరోటి దొరకదు. ఇది మెదడులో పాజిటివ్ సంకేతాలను ఇస్తుంది. ఏది ఏమైనప్పటికీ, 3 నెలల లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న నెలలు నిండకముందే జన్మించిన పిల్లలు సాధారణంగా కో-స్లీప్ లో ఉన్నప్పుడు సడెన్ ఇన్ ఫ్యాంట్ డెత్ సిండ్రోమ్‌కు ఎక్కువగా గురవుతారని గుర్తుంచుకోవాలి. అందువల్ల మీరు మీ బిడ్డ పక్కన ఒకే గదిలో పడుకోవచ్చు. మీ మంచం పక్కన తొట్టిలో శిశువును నిద్రపుచ్చవచ్చు.

4. బిడ్డ ఎదుగుదలను పర్యవేక్షించాలి:

4. బిడ్డ ఎదుగుదలను పర్యవేక్షించాలి:

వైద్యుల వద్దకు ఎప్పటికప్పుడు వెళ్లాలి. వారి ఆరోగ్యానికి సంబంధించి రెగ్యులర్ చెకప్స్ చేయించాలి. ఇలా టైమ్-టు-టైమ్ వెళ్లడం ద్వారా శిశువు ఆరోగ్యంపై డాక్టర్లకు అవగాహన ఏర్పడుతుంది. అలాగే శిశువు ఎదుగుదలను తల్లి ఎప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలి.

5. బిడ్డ ఎదగడానికి సాయం చేయాలి:

5. బిడ్డ ఎదగడానికి సాయం చేయాలి:

మీ బిడ్డ ఎల్లప్పుడూ సంపూర్ణంగా, మంచి ఆరోగ్యంతో ఉండాలి. శిశువు ప్రాథమిక అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చాలి. అది శిశువు వృద్ధి చెందడానికి సహాయపడుతుంది. శిశువుతో ఆడుకోవడానికి సరైన సమయాన్ని వెచ్చించాలి. శిశువు ఇష్టాలు, అయిష్టాలను తెలుసుకోవాలి.

6. అవసరమైన సాయాన్ని పొందాలి

6. అవసరమైన సాయాన్ని పొందాలి

బిడ్డ సంరక్షణలో ఇతర కుటుంబసభ్యుల నుండి సాయం పొందాలి. శిశువును తల్లి ఒక్కరే జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టసాధ్యం కాబట్టి భర్త లేదా ఇతర కుటుంబసభ్యుల సాయం అడగాలి. మీరు ఓకే అనుకున్నప్పుడు సరైన వ్యాయామం చేయాలి. దానికి కొంత సమయాన్ని కేటాయించాలి. ఈ చిన్న విరామాలు తరచుగా మీరు ముందుకు సాగడానికి మరియు మీ బిడ్డతో అభివృద్ధి చెందడానికి అవసరమైన శక్తిని కనుగొనడంలో మీకు బాగా సహాయపడతాయి.

English summary

Premature Baby Care Tips : Precautions to take in the care of premature babies

read on to know Premature Baby Care Tips : Precautions to take in the care of premature babies
Desktop Bottom Promotion