For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Kangaroo Care: ఇంక్యుబేటర్ కంటే కూడా కంగారూ చికిత్సే బెటర్

|

Kangaroo Care: జంతువులు అన్నింటిలో కంగారూల కొద్దిగా భిన్నంగా ఉంటాయి. వాటి శైలి, తీరు, రూపు ప్రత్యేకంగా ఉంటాయి. అలాగే కంగారూలు అనగానే గుర్తుకు వచ్చేది పొట్ట దగ్గర ఉండే సంచి లాంటి నిర్మాణం. ఇందులో అవి చిన్న కంగారూలను మోసుకెళ్తుంటాయి. పొట్ట సంచిలో ఉంచుకుని వాటికి రక్షణ కల్పించడంతో పాటు ఇంకా చాలా జీవన నైపుణ్యాలను నేర్పిస్తాయి.

What is kangaroo care and its benefits in Telugu

పిల్లల పట్ల కంగారూల శైలిని బట్టే కంగారూ కేరింగ్ అనే విధానం అభివృద్ధి చేశారు వైద్య నిపుణులు.

 కంగారూ కేర్ అంటే ఏంటి?

కంగారూ కేర్ అంటే ఏంటి?

శిశువును తల్లి ఛాతికి దగ్గరగా ఉంచుకోవడం. తల్లి కాకుండా తండ్రి లేదా దగ్గరి కుటుంబసభ్యులు కూడా ఇలా శిశువును ఛాతీకి దగ్గరగా ఉంచుకోవచ్చు. ఈ రకమైన స్పర్శ బంధానికి మాత్రమే కాకుండా వైద్యపరంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

శిశువుకు డైపర్ తప్ప ఏమీ ఉంచకూడదు. ఛాతీపై పడుకోబెట్టి ముందు ఒంటిపై షర్ట్ వేసుకోకూడదు. అలా అయితేనే చర్మ స్పర్శ తగిలి ప్రయోజనం చేకూరుతుంది. వెచ్చదనం కోసం దుప్పటి, టవల్, హాస్పటిల్ గౌను చుట్టూ చుట్టుకోవాలి.

కంగారూ కేరింగ్ ప్రయోజనాలు:

కంగారూ కేరింగ్ ప్రయోజనాలు:

* శిశువు హృదయ స్పందన రేటును స్థిరీకరిస్తుంది.

* శ్వాస సరళిని మెరుగుపరుస్తుంది. శ్వాసను క్రమబద్ధీకరిస్తుంది.

* ఆక్సిజన్ సంతృప్త స్థాయిలను మెరుగుపరుస్తుంది.

* నిద్రపోయే సమయంలో పెరుగుతుంది.

* శిశువు మరింత వేగంగా బరువు పెరుగుతారు.

* ఏడవడం తగ్గుతుంది.

* శిశువుతో బంధాన్ని మెరుగుపరుస్తుంది. సాన్నిహిత్యాన్ని పెంచుతుంది.

* రొమ్మ పాల ఉత్పత్తిని పెంచుతుంది.

ఇంక్యూబేటర్ కంటే బెటర్..

ఇంక్యూబేటర్ కంటే బెటర్..

నెలలు నిండక ముందే పుట్టిన వారికి, తక్కువ బరువుతో జన్మించిన శిశువులకు ఇది మరింత ముఖ్యం. శిశువులో ఏవైనా సమస్యలు వస్తే కంగారూ చికిత్స చేసిన తర్వాతే ఇంక్యుబేటర్‌లో పెట్టాలంటూ ఈమధ్యే ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను విడుదల చేసింది. వెంటిలేటర్‌తో శ్వాస అందించాల్సిన వారికి తప్ప అందిరికీ ఇదే నియమం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 15 - 20 శాతం మంది శిశువులు నెలలు నిండకముందే జన్మిస్తున్నారని అంచనా. ఇలా నెలలు నిండక ముందే పుట్టే శిశువుల్లో పలు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. శ్వాస తీసుకోవడం ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం సహా ఇతర ఇబ్బందులు వస్తుంటాయి. ఇలాంటి శిశువులు మరింత ఎక్కువ సంరక్షణ ద్వారా మాత్రమే తిరిగి కోలుకుంటారు. అలా శిశువులు కంగారూ చికిత్స వల్ల త్వరగా కోలుకుంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అంతకు ముందు ఇలాంటి శిశువులను మొదటి ఇంక్యుబేటర్‌లో ఉంచిన తర్వాతే కంగారూ చికిత్స చేయాలని చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా తన మార్గదర్శకాలను సవరించింది. కంగారూ చికిత్స చేసిన తర్వాతే ఇంక్యుబేటర్‌లో ఉంచాలని చెప్పింది.

కంగారూ చికిత్సతో శిశువుల్లో రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతున్నట్లు, ఒత్తిడి తగ్గడంతో పాటు శ్వాస ఇబ్బందులు క్రమంగా తగ్గుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది.

English summary

What is kangaroo care and its benefits in Telugu

read on to know What is kangaroo care and its benefits in Telugu
Story first published:Friday, December 9, 2022, 17:05 [IST]
Desktop Bottom Promotion