Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
5 నిమిషాల్లో రెడీ..పెనం మీదనే అదిరిపోయే పనీర్ బ్రెడ్ పిజ్జా
సాయంత్రం సమయాల్లో వెరైటీగా,టేస్టీగా ఏదైనా తినాలని నాలుకు పీకేస్తుంటది. ఆ సమయంలో మనకు గుర్తొచ్చే మొదటి పేరు పిజ్జా. అయితే పిజ్జా కొనాలంటే భారీ రేటు..ఇంట్లో చేసుకోవాలంటే పెద్ద తతంగం అని వదిలేస్తారు. మీ పిజ్జా కోరికలను కేవలం 5 నిమిషాల్లో తీర్చే ఒక అద్భుతమైన, మాయాజాలం లాంటి రెసిపీ ఉంది. అదే పనీర్ బ్రెడ్ పిజ్జా. దీనిని తవా మీద కేవలం 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. రుచి అద్భుతంగా ఉంటుంది. పిల్లలకే కాదు, పెద్దలకు కూడా ఇష్టమైన సాయంత్రపు స్నాక్ గా, అల్పాహారంగా లేదా అప్పటికప్పుడు వచ్చే అతిథులకు చిటికెలో చేసి పెట్టగలిగే గొప్ప వంటకంగా ఇది ఉంటుంది. పనీర్ బ్రెడ్ పిజ్జాను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఉల్లిపాయలు
-క్యాప్సికం
-చిల్లీ ప్లేక్స్
-పనీర్
-ఆనియర్ పౌడర్
-గార్లిక్ పౌడర్
-ఒరెగానో
-బ్లాక్ పెప్పర్ పౌడర్
-ఉప్పు
-మయోనైజ్
-పిజ్జా సాస్
-రెడ్ బెల్ పెప్పర్
-బ్రెడ్
-యెల్లో బ్రెడ్ పెప్పర్
-మోజరెల్లా చీజ్
-బటర్
తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ తీసుకొని అందులో 1కప్పు సన్నని ఉల్లిపాయ తరుగు,పావు కప్పు క్యాప్సికమ్, పావు కప్పు రెడ్ బెల్ పెప్పర్స్, పావు కప్పు యెల్లో బెల్ పెప్పర్స్, 4 టేబుల్ స్పూన్ల పిజ్జా సాస్, 4 టేబుల్ స్పూన్ల మయోనైజ్, చిన్న చిన్న క్యూబ్స్ గా కట్ చేసిన 200 గ్రాముల పనీర్, 1 టేబుల్ స్పూన్ ఆనియన్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పౌడర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ ఒరెగానో, అర టీస్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, ఉప్పు కొంచెం తక్కువగానే వేసి మొత్తం స్పూన్ తో కలిసేలా కలుపుకోవాలి.
-తర్వాత 4 బ్రెడ్ స్లైసులను(పీసులను)తీసుకోండి.
-బ్రెడ్ స్లైసుల మీద ముందు బటర్,తర్వాత పిజ్జా సాస్ వేసి స్ప్రెడ్ చేయండి. మీ దగ్గర పిజ్జా సాస్ లేకుంటే టమాటో కెచప్ అయినా ఉపయోగించవచ్చు.
-తర్వాత ఒక్కో బ్రెడ్ స్లైసు మీద ఒక్కో చీజ్ స్లైసులను ఉంచండి. వీటిమీద మనం బౌల్ లో ముందుగా రెడీ చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని వేయండి. వీటిమీద మోజరెల్లా చీజ్ సన్నని తరుగు చల్లుకున్నా చిల్లీ ఫ్లేక్స్ చల్లుకోండి. తర్వాత ఒరెగానో చల్లుకోండి
-తర్వాత స్టవ్ మీద తవా లేదా పెనం పెట్టాలి. మంటను తక్కువలో ఉంచి పెనం మీద రెడీ చేసుకున్న కొంచెం బటర్ వేసి మొత్తం అప్లయ్ చేశాక బ్రెడ్ స్లైసులను ఉంచి మూతపెట్టి అది తినడానికి రెడీ అయ్యదాకా వేడి చేసుకోవాలి. తర్వాత మిగిలిన అన్నీ బ్రెడ్ స్లైసులను అలా ఒక్కొక్కటిగా ఉంచి వేడి చేసుకోవాలి. అంతే పన్నీర్ బ్రెడ్ పిజ్జా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications










