Latest Updates
-
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి
ఒక్కసారి ఈ అఫ్గానీ ఎగ్ కర్రీ రుచి చూశారంటే.. మళ్లీ మళ్లీ వండుతారు!
గుడ్డు లేదా ఎగ్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆమ్లెట్, ఎగ్ భుర్జీ లేదా సాధారణ ఎగ్ కర్రీ. కానీ ఎప్పుడూ ఒకే రకమైన ఎగ్ కర్రీ తిని బోర్ కొట్టిందా? అయితే ఓసారి అఫ్గానీ ఎగ్ కర్రీ ట్రై చేయండి. రెగ్యులర్ ఎగ్ కర్రీల మాదిరి ఇందులో కారం, టమాటాలు వాడరు. దీనికి బదులుగా పెరుగు, ఫ్రెష్ క్రీమ్, జీడిపప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఉపయోగించి క్రీమీగా, తెల్లటి లేదా లేత ఆకుపచ్చని గ్రేవీతో దీన్ని తయారు చేస్తారు.
ఇది రెస్టారెంట్ స్టైల్ రుచిని ఇస్తుంది. రోటీ, నాన్, పరాఠా, లేదా జీరా రైస్‌తో అద్భుతంగా ఉంటుంది. అఫ్గానీ ఎగ్ కర్రీ మీ ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
-ఉడికించిన గుడ్లు
-నూనె
-ఉప్పు
-ఉల్లిపాయలు
-పచ్చిమిర్చి
-అల్లం
-వెల్లుల్లి రెబ్బలు
-కొత్తిమీర
-జీడిపప్పు
-గడ్డ పెరుగు
-ఫ్రెష్ క్రీమ్
-పెప్పర్ పౌడర్
-జీలకర్ర పొడి
-వెన్న (బటర్)
-దాల్చిన చెక్క
-యాలకులు
-లవంగాలు
-కసూరి మేథీ
-పసుపు
తయారీ విధానం
-స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 టీస్పూన్ల ఆయిల వేసి వేడి చెయ్యండి.
-వేడెక్కిన ఆయిల్ లో 2 ఉల్లిపాయల పొడవాటి చీలికలు వేసి ట్రాన్సపరెంట్ గా మారేవరకు వేయించుకున్నాక అందులోనే 2 ఇంచుల అల్లం, 9 వెల్లుల్లి రెబ్బలు, పావు కప్పు జీడిపప్పు, 10 పచ్చిమిరపకాయలు, 1 టీస్పూన్ ఉప్పు వేసి ఒక్క నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసి,ఇందులోనే గుప్పెండ కొత్తిమీర కాడలతో సహా వేసి, పావు కప్పు కన్నా కొంచెం తక్కువ నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొంచెం నూనె, పసుపు వేసి వేగాక ఇందులో ఉడికించి పెట్టుకున్న 6 గుడ్లను(చాకుతో గాట్లు పెట్టుకోండి) వేసి వేయించి గుడ్లను తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న కడాయిలోనే కొంచెం బటర్, గ్రైండ్ చేససి పెట్టుకున్న పేస్ట్, 2 లవంగ మొగ్గలు, అర ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకలు వేసి 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత అందులోనే అర కప్పు పెరుగు వేసి, 1 టీస్పూన్ జీలకర్ర పొడి, అర టీస్పూన్ గరం మసాలా, అర టీస్పూన్ పెప్పర్ పౌడర్, అర టీస్పూన్ ఉప్పు, పావు టీస్పూన్ పసుపు వేసి కలిపి మరో 2 నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి.
-ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు అందులో 1 టీస్పూన్ కసూరి మేథీ, పావు కప్పు ప్రెష్ క్రీమ్(పాల మీద మీగడ చిలక్కొట్టుకుంటే వచ్చేదే), ముప్పావు కప్పు నీళ్లు పోసి బాగా కలుపుకోండి.
-ఉడకడం మొదలైన తర్వాత అందులో వేయించి పెట్టుకున్న కోడిగుడ్లన్నీ వేసి మూత పెట్టి దగ్గర పడేంతవరకు వేయించుకోండి. ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు అందులో కొత్తిమీర తరుగు చల్లుకొని కలుపుకొని స్టవ్ ఆపేయండి. అంతే అప్గానీ ఎగ్ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












