Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
రాజుల కాలం నాటి వంట..ఇది కదా తినాల్సింది..ఎనర్జీ డబుల్,ఎలా చేసుకోవాలంటే..
రాజుల కాలంలో ఉల్లి, వెల్లుల్లి, టమాటోలు వంటివి వాడకుండా కొన్ని రకాల కూరగాలయలతో ఓ ప్రత్యేకమైన కర్రీ తయారుచేసేవాళ్లు. మన అమ్మమ్మల కాలంలో కూడా ఈ కర్రీ చాలా ఫేమస్. ముఖ్యంగా సాత్విక భోజనం తినేవాళ్లు ఈ కర్రీని ఎక్కువగా చేసుకొని తినేటోళ్లు. ఈ కూర తిన్నారంటే ఎవరైనా మైమర్చిపోవాల్సిందే. మంచి గ్రేవీతో ప్రత్యేకమైన రుచి ఉండే ఈ కూర తినాలంటే అదృష్టం ఉండాలి అంటారు. ఈ కూర అన్నం, చపాతీ, జొన్న రొట్టెలు ఎందులోకైనా అదిరిపోతుంది. రాజుల కాలం నాటి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ మీరు కూడా మీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావలసిన పదార్థాలు
-జీలకర్ర
-గసగసాలు
-పచ్చి కొబ్బరి
-దొండకాయ
-వంకాయ
-బంగాళదుంప
-ఆవాల నూనె లేదా గానుగ నూనె
-ముల్లంగి
-గుమ్మడికాయ ముక్కలు
-ఆవాలు
-ఉప్పు
-పచ్చి అరటికాయ
-బీన్స్
-ఎండు మిర్చి
-బిర్యానీ ఆకు
-పచ్చిమిర్చి
-పసుపు

తయరీ విధానం
-ముందుగా ఓ గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల పెద్ద ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసి వీటిలో నీళ్లు పోసి కనీసం అరగంట పాటు నానబెట్టుకోవాలి.
-తర్వాత వాటిని నీళ్లతో పాటు మిక్సీ గిన్నెలో లేదా రోట్లో వేసి ఇందులో రెండు అంగుళాల అల్లం ముక్కలు,గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో రెండు స్పూన్ల ఆవాల నూనె వేడి చేసి అందులో 1 కప్పు బంగాళదుంప ముక్కలు, 1 కప్పు బీన్స్ వేసి ఇందులోనే కొంచెం ఉప్పు వేసి కలుపుతూ ఎక్కువ మంట మీద వేయించి వాటిని నూనె రాకుండా ఓ గిన్నెలోకి తీసి పక్కనపెట్టుకోండి.
-తర్వాత అదే కడాయిలో మిగిలిన నూనెలోని 1 కప్పు దొండకాయ చీలికలు, 1 కప్పు ముల్లంగి ముక్కలు వేసి ఇందులోనే చిటికెడు ఉప్పు వేసి పెద్ద మంట మీద కలుపుతూ వేయించి పక్కన పెట్టుకోండి.
-తర్వాత కడాయిలో మరో స్పూన్ ఆయిల్ వేసి అందులో 1 కప్పు పచ్చి అరటికాయ ముక్కలు, 1 కప్పు పచ్చ వంకాయ ముక్కలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత కడాయిలో 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడయ్యాక అందులో 1 ఎండుమిర్చి ముక్కలు, 1 బిర్యానీ ఆకు వేసి వేగాక అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలుపుతూ వేయించుకోవాలి. కొద్దిగా వేగాక ఇందులో 10 పచ్చిమిర్చిలను కచ్చాపచ్చాగా దంచి వేసి ఇందులోనే పసుపు, ఉప్పు వేసి బాగా కలిసేలా కలపాలి.
చుక్క ఆయిల్ అక్కర్లేదు..పొద్దున్నే ఈ జొన్న అంబలి తింటే కొండలు ఢీ కొట్టే శక్తి ..ఎలా చేసుకోవాలంటే
-మసాలా పేస్ట్ వేగి కొంచెం ఆయిల్ పైకి కనిపిస్తున్న సమయంలో అందులో 1 కప్పు గుమ్మడికాయ ముక్కలు వేసి కలిపి మూతపెట్టి తక్కువ మంట మీద 5-6నిమిషాలు ఉడికించుకోవాలి. అడుగుపట్టకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి.
-గుమ్మడికాయ ముక్కలు 50శాతం వరకు ఉడికిన తర్వాత అందులో ముందుగా వేయించి పెట్టుకున్న కూరగాయల ముక్కలు అన్నీ వేసి మసాలా అంతా వాటికి పట్టేలా బాగా కలుపుకోవాలి.
-తర్వాత అందులో గ్రేవీకి తగ్గట్లుగా కొన్ని నీళ్లు పోసుకోండి. ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లి దించేసుకోవాలి. అంతే రాజుల కాలం నాటి కూరగాయ ముక్కల వంట రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
