Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
నోరూరించే మట్టగిడసల పులుసు..పాతకాలం పద్దతిలో ఈ విధంగా చేశారంటే కంచం నాకేస్తారు
మట్టగిడసలు అంటే బురదలో పెరిగే చేపలు. వీటిని బురదమట్ట చేపలు అని అంటుంటారు. ఈ చేపలతో చేసే పులుసు చాలా రుచికరంగా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా మట్టగిడసల పులుసు చాలా మేలు చేస్తుంది. మట్టగిడసల పులుసును వివిధ రకాలుగా తయారు చేస్తారు. అయితే సాంప్రదాయ పద్ధతిలో మట్టగిడసల పులుసు ఎలా తయారుచేయాలి,తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూడండి.
మట్టగిడసల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు
మట్టగిడస చేపలు - 1 కేజీ
నూనె - 4 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీ స్పూన్
మెంతులు - 1/2 టీ స్పూన్
కరివేపాకు - 2 రెమ్మలు
పసుపు - 1/2 టీ స్పూన్
కారం - 2 టీ స్పూన్లు
ధనియాల పొడి - 1 టీ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 4
టమాటోలు - 2
చింతపండు - 1 నిమ్మకాయ సైజు అంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర - కొద్దిగా
మట్టగిడసల పులుసు తయారీ విధానం
-ముందుగా బురదమట్ట చేపలు లేదా మట్టగిడస చేపలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోయాలి.
-తర్వాత చింతపండును నీటిలో నానబెట్టి రసం తీయాలి.
-ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టి ఆయిల్ వేడి చేయాలి.
-వేడెక్కిన ఆయిల్ లో ఆవాలు, మెంతులు, కరివేపాకు వేసి వేయించాలి.
-తర్వాత ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి తరుగు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
-తర్వాత అందులో టమాటో ముక్కలు, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి.
-ఇప్పుడు అందులో చింతపండు రసం, చేప ముక్కలు వేసి కలపాలి.
-మూత పెట్టి చేప ముక్కలు ఉడికే వరకు ఉడికించాలి.
-కొత్తిమీర చల్లి దించేయడమే.
-పులుసు చిక్కగా కావాలనుకుంటే కొద్దిగా శనగపిండి లేదా బియ్యం పిండిని నీటిలో కలిపి వేసుకోవచ్చు.
-పులుసును మరింత రుచికరంగా చేయడానికి కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు.
-మట్టగిడసల పులుసును అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.
కోటీశ్వరులు కూడా కక్కుర్తి పడి తినే రెసిపి ఇదే..ఎలా చేయాలంటే
మట్టగిడసల పులుసు ప్రయోజనాలు
మట్టగిడస చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి.మట్టగిడసలలోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. మట్టగిడస చేపలు మెదడు పనితీరును మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి. ఈ చేపలలో విటమిన్ డి కూడా ఉంటుంది, ఇది ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. మట్టగిడసలలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, ఇది కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. ఈ చేపలలో ఐరన్ కూడా ఉంటుంది, ఇది రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









