Latest Updates
-
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
బెంగళూరు స్పెషల్ మెంథ్యా బాత్..ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు!
దక్షిణ భారతీయ వంటకాల్లో, ముఖ్యంగా బెంగళూరులో మెంథ్యా బాత్ చాలా ప్రాచుర్యం పొందింది. బెంగళూరులోని అనేక హోటల్స్, ఇళ్లలో ఉదయం అల్పాహారంగా లేదా మధ్యాహ్నం భోజనంగా దీనిని విరివిగా తీసుకుంటారు. దీనిని మెంతి కూర రైస్ అని కూడా అంటారు.
ఈ వంటకం రుచిలోనే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఎంతో శ్రేష్టమైనది. బెంగళూరు స్పెషల్ మెంథ్యా బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
బియ్యం- 2 కప్పులు
మెంతి కూర - 2 పెద్ద కట్టలు
బఠానీలు - అర కప్పు
ఉల్లిపాయ - 2
టమాటో - 2
నూనె- 3 టేబుల్ స్పూన్లు
ఆవాలు, జీలకర్ర - 1 టీస్పూన్
బిర్యానీ ఆకు - 1
మరాఠీ మొగ్గ - 1
ఉప్పు -సరిపడా
పసుపు - చిటికెడు
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
పచ్చి మిరపకాయలు - 7
అల్లం - 1 అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 8
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
లవంగాలు - 3
సోంపు - అర టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
పుదీనా - కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి, పచ్చి మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు, కొత్తిమీర, పుదీనా వేసి మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ లేదా మందపాటి గిన్నె పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ వేసి వేయించాలి. సువాసన వచ్చిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చి బఠానీలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న మెంతి కూరను వేయాలి. మెంతి కూరలోని పచ్చి వాసన పోయేంత వరకు సుమారు 3-4 నిమిషాలు నూనెలో బాగా మగ్గనివ్వాలి. ఆకు పూర్తిగా వాడిపోయిన తర్వాత టమాటో ముక్కలు, పసుపు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.
-ఇప్పుడు అందులో ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ ను వేసి పచ్చి వాసన పోయే వరకు 2-3 నిమిషాల పాటు సన్నని మంటపై వేయించాలి.
-మసాలా వేగిన తర్వాత అరగంట సేపు నానబెట్టిన బియ్యం వేసి ఒక నిమిషం పాటు మసాలాతో కలిపి వేయించాలి. ఇప్పుడు బియ్యానికి తగిన మోతాదులో నీరు పోయాలి(1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీరు), రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
-కుక్కర్ మూత పెట్టి 2 నుండి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మామూలు గిన్నెలో అయితే మూత పెట్టి అన్నం ఉడికే వరకు సన్నని మంటపై ఉంచాలి.
-కుక్కర్ ఆవిరి పోయిన తర్వాత మూత తీసి ఒకసారి నెమ్మదిగా కలపాలి. అంతే వేడి వేడి, ఘమఘమలాడే బెంగళూరు స్పెషల్ మెంథ్యా బాత్ రెడీ. దీనిని పెరుగు పచ్చడి లేదా అప్పడాలతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







