Latest Updates
-
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
అమృతంతో సమానం..తిరుమల ప్రసాదం పులిహోర..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
తిరుమల పేరు వినబడగానే వెంకటేశ్వర స్వామితో పాటు అక్కడ అందించే ప్రసాదాలు కూడా కళ్ల ముందు మెదిలాడుతుంటాయి. తిరుపతిలో లడ్డు ఎంత ఫేమస్ అక్కడ ప్రసాదంగా ఇచ్చే పులిహోర కూడా అంతే ఫేమస్, నోట్లో పెట్టుకుంటే అమృతంలా ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్లు ఆగమ శాస్త్రాల నియమాలను అనుసరించి ఈ ప్రసాదాన్ని తయారుచేస్తుంటారు. అయితే ఈ పులిహోరను ఇంట్లో కూడా అదే టేస్ట్ వచ్చేలా తయారుచేసుకోవచ్చు. నిజమైన తిరుమల ప్రసాదం పులిహోరని మీ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తిరుమల ప్రసాదం పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు
-నువ్వుల నూనె
-నెయ్యి
-జీడిపప్పు
-చింతపండు
-వండిన అన్నం
-మెంతులు
-మిరియాలు
-జీలకర్ర
-ఆవాలు
-ఇంగువ
-పచ్చి శెనగపప్పు
-మినపప్పు
-కరివేపాకు
-పసుపు
-నెయ్యి
తిరుమల ప్రసాదం పులిహోర తయారీ విధానం
-ముందుగా ఒకటింపావు కప్పు(425 గ్రా)బియ్యాన్ని శుభ్రంగా కడగాలి.
-కడిగిన బియ్యంలో నాలుగున్నర కప్పుల నీళ్లు పోసి అన్నాన్ని వండుకోవాలి. అన్నం పొడి పొడిగా ఉండాలి.
-వండిన అన్నాన్ని ఓ ప్లేట్ లో వేయండి. ఆరుతున్న అన్నంలో 30 గ్రాముల నువ్వుల నూనె పోసి నెమమదిగా కలిపి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు నార,గింజలను తొలగించిన 65 గ్రాముల చింతపండును 400 ml వేడి నీళ్లు పోసి పావుగంట సేపు నానబెట్టాలి.
-ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 2 టీస్పూన్ల మెంతులు, 2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి ఆయిల్ లేకుండానే వేయించాలి. మెంతులు రంగు మారి చిట్లుతున్నప్పుడు అందులో 2 టీస్పూన్ల జీలకర్ర వేసి సన్నని సెగ మీద వేగనివ్వాలి. తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోండి లేదా రోట్లో దంచుకోండి.
-తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 150 ml నువ్వుల నూనె పోసి వేడి చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి పొంగనివ్వాలి. తర్వాత ఇందులో 2 టీస్పూన్ల పచ్చి శెనగపప్పు, 2 టీస్పూన్ల మినపప్పు వేసి మీడియం మంట మీద తాళింపుని ఎర్రగా వేపాలి. పప్పులు రంగు మారుతున్నప్పుడు అందులో అర టీస్పూన్ ఇంగువ, నాలుగు రెబ్బల కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి వేపాలి.
-వేగిన తాళింపులో నానిన చింతపండు గుజ్జుని పిండి పోయాలి. గ్రైండ్ చేసుకున్న మిరియాలు మెంతుల పొడి, 2 టేబుల్ స్పూన్ల రాళ్ల ఉప్పు కూడా వేసి మీడియం మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ 20 నిమిషాలు మరగనిచ్చి స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసి అందులో 30గ్రాముల జీడిపప్పు వేసి ఎర్రగా వేయించి స్టవ్ ఆఫ్ చేసేయండి
-తర్వాత ప్లేట్ లో చల్లారిన నువ్వులనూనె కలిపిన అన్నంలో రెడీ చేసుకున్న పులిహోర గుజ్జు వేసి మొత్తం కలిసేలా నిదానంగా కలుపుకోవాలి. ఇందులోనే వేయించిన జీడిపప్పుని నెయ్యితో సహా వేసి కలుపుకోండి. దీన్ని కనీసం 2 గంటలు పక్కన వదిలేయండి. తర్వాత ముద్ద నోట్లో పెట్టుకుంటే అమృతమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











