Beetroot and Carrot Pachadi: బీట్ రూట్ క్యారెట్ పచ్చడి: హెల్తీ అండ్ టేస్టీ

Posted By:

Beetroot and Carrot Pachadi in telugu రోజూ ఒకే విధమైన పచ్చడి తిని బోరుకొట్టేస్తుంటే కాస్త డిఫరెంట్ గా ప్రయత్నించడానికి ఇక్కడ క్యారెట్ బీట్ రూట్ పచ్చడి ఉంది. రోజూ నేరుగా బీట్ రూట్ తినడం లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటుంటారు. అలా కాకుండా ఈ రెండింటి కాంబినేషన్ లో పచ్చడి తయారుచేసుకుని తింటే మరింత రుచిగా.. ఆరోగ్య ప్రయోజనాలను ఎక్కువ పొందుతారు.

క్యారెట్ అండ్ బీట్ రూట్ లో విటమిన్ ఎ, సి మరియు బీటా కెరోటిన్ అనేవి పుష్కలంగా ఉండటం వల్ల ఇవి కళ్లకి మరియు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఈ రెసిపి ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా మంచిది.

ఈ పచ్చిడి ఎలా తినాలో తెలుసా? అన్నంలో పచ్చడి కలుపుకోవడం కాదు..పచ్చడిలోనే అన్నం కలుపుకుని తింటే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కేవలం అన్నంలోకి మాత్రమే కాదు, చపాతి, మురమురాలు, అటుకులు, దోసెలు, ఇడ్లీలకు కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఈ రుచికరమైన పచ్చడి ఎలా తయారుచేయాలో తెలుసుకుని, మీరు కూడా ట్రై చేసి, రుచి ఎలా ఉందో మీ అభిప్రాయన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి.

కావాల్సిన పదార్థాలు:
క్యారెట్ ముక్కలు : 1 కప్పు
బీట్ రూట్ ముక్కలు: 1 కప్పు
పచ్చిమిర్చి : 5-8
చింతపండు: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్ కొద్దిగా వేగించడానికి

పోపుకు కావాల్సిన పదార్థాలు:
నూనె: 1 tbsp
ఆవాలు: 1tsp
శెనగపప్పు: 1tsp
మినపప్పు: 1tsp
పసుపు: చిటికెడు
ఇంగువ : చిటికెడు
ఎండు మిర్చి : 2

తయారుచేయు విధానం
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి, అందులో నూనె వేసి, కాస్త కాగిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసి వేగించాలి
2. తర్వాత అందులోనే క్యారెట్ మరియు బీట్ రూట్ ముక్కలు వేసి బాగా వేగించాలి. వేగిన తర్వాత పక్కక పెట్టి చల్లారనివ్వాలి.
3. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి కొద్దిగా చింత పండు కూడా వేయాలి.
4. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ,కాస్త కొత్తమిర వేసి కచ్చపచ్చ అంటే రఫ్ గా గ్రైండ్ చేసుకోవాలి.
5. ఇప్పుడు స్టౌ మీద ఉన్న అదే పాన్ ఉన్న దాంట్లో నూనె వేసి కాగిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చి శెనగపప్పు, మినపప్పు వేసి ఒక నిముషం వేగించాలి.
6. ఆ తర్వాత తాలింపులో ఎండుమిర్చి , కరివేపాకు వేసి పోపును సన్న మంట మీద వేగించుకోవాలి.
7. తర్వాత పసుపు, ఇంగువ వేసి బాగా కలిపి వేగించి స్టౌ ఆఫ్ చేయాలి.
8. ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని బౌల్లో తీసుకుని, దానికి పోపును జోడించి బాగా మిక్స్ చేయాలి. అంతే క్యారెట్ బీట్ రూట్ కలర్ ఫుల్ గా న్యాచురల్ గా పచ్చడి రెడీ .

[ of 5 - Users]
Story first published: Thursday, February 15, 2024, 13:14 [IST]
Desktop Bottom Promotion