Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Bhogi special recipe: చెరుకు పానకంతో సగ్గుబియ్యం పాయసం..తిరుగులేని రుచి,ఇదిగో రెసిపి
సంక్రాంతికి స్పెషల్ గా ఇంట్లో పొంగలి చేసుకుంటుంటాం. అయితే పాలు అవసరం లేకుండా చెరుకు రసంతో సగ్గుబియ్యం పాయం చేస్తే టేస్ట్ యమా రుచిగా ఉంటుంది. ఈ భోగి పండుగ రోజున కొత్తగా ఏదైనా స్వీట్ రెసిపి చేసి ఇంట్లో వాళ్లకి పెట్టాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. చెరుకు రసం, పెసరపప్పు ఉపయోగించి సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలి, దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-పెసరపప్పు
-సగ్గుబియ్యం
-చెరుకు రసం
-పచ్చి కొబ్బరి ముక్కలు
-ఎండుద్రాక్ష
-జీడిపప్పు
-యాలకల పొడి
తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద కప్పునిండా సగ్గుబియ్యాన్ని తీసుకొని రెండు గంటలపాటు నానబెట్టుకోండి.
-వేయించిన ఒక చిన్న కప్పు పెసరపప్పుని కూడా రెండు గంటలపాటు నానబెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నానబెట్టిన సగ్గుబియ్యం, నానబెట్టిన పెసరపప్పు వేయండి. ఇందులోనే కొద్దిగా నీళ్లు పోసి మూతపెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి.
-తర్వాత స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎండుద్రాక్ష వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అందులో కొంచెం మీగడ వేసి వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇందులో 1 పెద్ద కప్పు నిండా చెరుకు పానకం పోసి మూతపెట్టి బాగా ఉడకనివ్వాలి.
-తర్వాత అందులో ఉడికించిన సగ్గుబియ్యం,పెసరపప్పు మిశ్రమాన్ని వేసి మొత్తం కలిసేలా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి.
-తర్వాత యాలకల పొడి దానిమీద చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే సగ్గుబియ్యం పాయసం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












