Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్!
చెన్నై స్పెషల్ ఫ్రై ఇడ్లీ..10 నిమిషాల్లోనే రెడీ..వెదర్ కూల్ గా ఉన్నప్పుడు తింటే స్వర్గమే..ఎలా చేసుకోవాలంటే
దక్షిణ బారతదేశంలో చాలామంది ఇళ్లల్లో పొద్దున్నే ఉండే బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ లొ ఇడ్లీ తప్పనిసరిగా ఉంటుంది. ఇడ్లీల్లో కూడా రకరకాలు ఉంటాయి. జొన్న ఇడ్లీ,సజ్జ ఇడ్లీ ఇలా రకరకాలు టేస్ట్ చేసి ఉంటారు. అయితే కొత్తగా ఏదైనా వెరైటీగా తినాలనిపిస్తుంటే మాత్రం ఓ సారి ఇడ్లీ ఫ్రై చేసుకోవచ్చు. మిగిలిన పోయిన ఇడ్లీలతో అయినా లేదా నార్నల్ ఇడ్లీతో కూడా ఇది చేసుకోవచ్చు. దీనిని తయారుచేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. కేవలం 10 నిమిషాల్లోనే దీన్ని రెడీ చేసుకోవచ్చు. వాతావరణం చల్లగా ఉన్న సమయంలో దీన్ని చేసుకొని తింటుంటే ఆ మజానే వేరే లెవల్లో ఉంటుంది. ఇది అల్పాహారంగా, సాయంత్రం స్నాక్ గా లేదా పిల్లల లంచ్ బాక్సులో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. సాధారణ ఇడ్లీలను తినడానికి ఇష్టపడని వారికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం. చెన్నై స్ట్రీట్ స్టైల్ ఇడ్లీ ఫ్రై మీ ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
ఫ్రై ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఇడ్లీలు
-కారం
-ఉప్పు
-టమాటో
-ధనియాల పొడి
-గరం మసాలా
-కరివేపాకు
-ఉల్లిపాయ
-ఆవాలు
-పచ్చిమిర్చి
-ఆయిల్
-కొత్తిమీర
ఫ్రై ఇడ్లీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేశాక అరటీస్పూన్ ఆవాలు,2 రెమ్మల కరివేపాకు,1 ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిరపకాయల ముక్కలు వేసి వేయించాలి.
-ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పెద్ద మంట మీద వేయించాలి.
-తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి,1 టేబుల్ స్పూన్ కారం వేసి 20 సెకన్లు వేపుకున్నాక అందులో 2 టమాటాల ముక్కలు వేసి పెద్ద మంటమీదనే అవి వేపుకోవాలి. టమాటో ముక్కలు సగంపైన మగ్గిన తర్వాత 80ml నీళ్లు,అర చెక్క నిమ్మరసం వేసి కలుపుకోండి.
-టమాటో ముక్కల్లో నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్న సమయంలో అందులో 12 ఇడ్లీలను వేసి నెమ్మదిగా ఇడ్లీ విరగకుండా కలుపుకోవాలి. దించేముందు కొత్తిమీర,పావు టీస్పూన్ గరం మసాలా చల్లుకోండి. అంతే ఇడ్లీ ఫ్రై రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











