Chilli Garlic maggi recipe: చిల్లి-గార్లిక్ మ్యాగీ తయారీ విధానం.. ఈ సింపుల్ టిప్స్‌తో ఇంట్లోనే చేసుకోవచ్చు

నిజాయితీగా చెప్పాలంటే మ్యాగీ అనేది కేవలం వంటకం మాత్రమే కాదు. ఒక ఎమోషన్ కూడా. ఇంట్లో వంట చేయడానికి ఏమీ లేనప్పుడు, అర్థరాత్రి ఆకలైనప్పుడు మ్యాగీ చేసుకోని కడుపు నింపుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. కొండల్లో విహారయాత్రలకు వెళ్ళినప్పుడు, చిన్నపిల్లలు స్నాక్ అడిగినప్పుడు దీనిని చేసి పెడుతుంటారు.

అలాంటి మ్యాగీలో ఎన్నో రకాల రెసిపీలు వచ్చేశాయి. తందూరి మాగీ నుండి చీజీ వెర్షన్ల వరకు అనేక రకాలుగా దీనిని వండడం మొదలు పెట్టేశారు. ఇప్పుడు చిల్లీ గార్లిక్ మ్యాగీ అనే కొత్త హిట్ రెసిపీ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. దీనిని ఇంట్లోనే సులువుగా ఎలా తయారు చేసుకోవాలి, ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చిల్లి-గార్లిక్ మ్యాగీ తయారీకి కావాల్సిన పదార్థాలు

> పొట్టు తీసిన రెండు వెల్లుల్లి రెబ్బలు
> ఒక టీ స్పూన్ తరిగిన ఎండు మిరపకాయలు
> అర టీ స్పూన్ కారంపొడి
> అర టీ స్పూన్ మ్యాగీ మసాలా సాచెట్
> సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి
> సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ
> ఒక టీ స్పూన్ సోయా సార్
> ఒక టీ స్పూన్ వైట్ వెనిగర్
> కొంచెం వంట నూనె

చిల్లి-గార్లిక్ మ్యాగీ తయారు చేసుకునే విధానం

> ముందుగా ఒక మీడియం సైజు పాన్ తీసుకోవాలి. అందులో కొంత నీరు పోసి, అందులోనే ఒక టీ స్పూన్ వంటనూనె వేయాలి. కొంత నీరు మరిగాక.. అందులో ఒక ప్యాకెట్ మ్యాగీని వేసి మరిగించాలి. మరీ మెత్తబడకుండా, కొంచెం గట్టిగానే ఉండేలా మరిగించుకోవాలి. తరువాత ఒక పెద్ద జల్లెడ తీసుకొని.. మ్యాగీని నీటిని వేరు చేయాలి.

> ఇప్పుడు ఒక మిక్సీలో పైన పేర్కొనబడిన పదార్థాలన్నిటినీ బాగా మిక్సీ పట్టుకోవాలి. అన్ని బాగా మెత్తగా గ్రైండ్ అయినట్లు నిర్ధారించుకున్న తరువాతే వాటిని మిక్సీ గిన్నెలో నుంచి బయటికి తీసేయాలి.

> ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని, అందులో కొంచెం నూనెను పోసుకోవాలి. అందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నూనె, వెల్లుల్లి వేడెక్కిన తరువాత అందులో మనం మిక్సీ పట్టుకొని ఉంచిన మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని, వెల్లుల్లి నూనెతో బాగా కలుపుకోవాలి. మిశ్రమం మొత్తం వెల్లుల్లికి, నూనెలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి.

> నూనె, మసాలా బాగా కలిసిపోయిన తరువాత అందులో మనం ముందుగానే వడగట్టిన మ్యాగీని వేసుకోవాలి. ఆ మ్యాగీకి మసాలా మొత్తం పెట్టుకునేలా బాగా కలుపుకోవాలి. అప్పుడే మ్యాగీకి సరైన ఫ్లేవర్ వస్తుంది.

> అదనపు క్రంచ్ కోసం మ్యాగీపై తెల్ల నువ్వులు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ఆకులను వేసుకోవాలి. అనంతరం కాసేపు మీడియం మంట మీద ఉంచి, మ్యాగీని మంట నుంచి కిందకు తీసేస్తే సరి. వేడి వేడిగా, ఎంతో రుచికరమైన చిల్లి-గార్లిక్ మ్యాగీ రెడీ అయిపోతుంది.

[ of 5 - Users]
Story first published: Thursday, October 17, 2024, 12:18 [IST]
Desktop Bottom Promotion