Egg pickle: ఎగ్ పచ్చడి..చేయడం చాలా ఈజీ..చలికాలంలో తింటే స్వర్గమే

Posted By:

కోడిగుడ్డు అంటే ఇష్టపడనివాళ్లు ఎవరూ ఉండరనే చెప్పొచ్చు. చాలామంది ప్రతిరోజూ తమ ఆహారంలో కోడిగుడ్డుని చేర్చుకుంటారు. రోజూ 1 కోడిగుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు కూడా చెప్తుంటారు. కోడిగుడ్డుతో రకరకాల వంటకాలు కూడా చేస్తుంటారు. ఆమ్లెట్​,బుర్జీ,పులుసు, ఫ్రై,పొరటు జీ వంటివి ఎన్నో చేస్తుంటారు. అయితే కోడిగుడ్డు పచ్చడి(egg pickle)మాత్రం ఎక్కువ మంది ట్రై చేసి ఉండరు.

కోడిగుడ్డు నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఆహా అని తీరాల్సిందే. ఇంట్లో చాలా ఈజీగా దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెల రోజులకు పైగా నిల్వ ఉండే కోడిగుడ్డు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

ఎగ్ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఆవ పిండి
-మెంతి పొడి
-కోడి గుడ్లు
-పసుపు
-గరం మసాలా
-నిమ్మరసం
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-ధనియాల పొడి
-ఉప్పు
-కారం
-పెప్పర్ పౌడర్
-ఆయిల్
-కరివేపాకు

ఎగ్ పచ్చడి తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిమీద కుక్కర్ పెట్టి అందులో కొంచెం నీళ్లు పోసి వేడి చేసుకోండి.

-ఇప్పుడు ఓ బౌల్ తీసుకొని అందులో 7 కోడిగుడ్లు కొట్టి అందులోనే 1 స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోండి.

-ఇప్పుడు ఇంకో చిన్న బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ రాసి అందులో ఈ కొడిగుడ్డు మిశ్రమాన్ని పోయండి. స్టవ్ మీద ఉన్న కుక్కర్ లో ఓ స్టాండ్ పెట్టి దానిమీద ఈ బౌల్ ని అలాగే పెట్టి మూత పెట్టేసి తక్కువ మంట మీద 15 నిమిషాలు అలా ఉంచండి.

-తర్వాత స్టవ్ మీద ఓ బాండీ పెట్టి అందులో 1 కప్పు ఆయిల్ పోసి నూనె వేడెక్కిన తర్వాత అందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్,పావు స్పూన్ మెంతి పౌడర్, 2 స్పూన్ల ఆవ పొడి,1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి,అర స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.

-కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, 3 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా ఓ బౌల్ కి తీసుకొని పక్కనపెట్టుకోండి.

-ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూడండి. కోడిగుడ్డు మిశ్రమం ఆమ్లెట్ లా అయి ఉంటే దానిని బయటకు తీసి ఓ ప్లేట్ పై వేసి చిన్న చిన్న ముక్కలుగా లేదా మీకు నచ్చిన సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకోండి.

-తర్వాత స్టవ్ మీద ఓ బాండీ పెట్టి అందులో 3 స్పూన్ల ఆయిల్ పోసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి ఉంచిన ఆమ్లెట్ ముక్కలను ఇందులో వేసి మంటను లో ప్లేమ్ లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోండి.

-ఆమ్లెట్ ముక్కలు బంగారు గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ముక్కలను ఓ బౌల్ లో వేసి దీనిమీద ముందుగా రెడీ చేసి బౌల్ లో పక్కనపెట్టి ఉంచిన గ్రేవీ మిశ్రమాన్ని వేసి కలుపుకోండి. అందులో ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ ని కూడా ఈబౌల్ లోని వేసి మొత్తంగా బాగా కలపండి.

-తర్వాత అందులోనే అరకప్పు నిమ్మరసం పోసి కలిపితే కోడిగుడ్డు నిల్వ పచ్చడి రెడీ. ఈ పచ్చడి నెల రోజులకు పైనే నిల్వ ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Monday, December 16, 2024, 17:09 [IST]
Desktop Bottom Promotion