Latest Updates
-
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్!
పండుగల స్పెషల్..ఇంట్లోనే నోరూరించే సోన్ పాపిడి ఎలా చేసుకోవాలంటే..
సోన్ పాపిడి అనేది భారతీయ పండుగలకు, ప్రత్యేక సందర్భాలలో ఎక్కువగా తినే ఒక సాంప్రదాయ స్వీట్. ఇది పలచని పొరలతో, మెత్తగా నోట్లో కరిగిపోయే విధంగా ఉంటుంది. దీనికి పండుగల సమయంలో, ఇతర శుభకార్యాలలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీన్ని తయారుచేయడానికి వంటగదిలోని పదార్థాలు సరిపోతాయ్. ఇంట్లోనే సులభంగా సోన్ పాపిడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
సోన్ పాపిడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-చక్కెర
-శెనగపిండి
-మైదా పిండి
-యాలకల పొడి
-నిమ్మరసం
-నీళ్లు
-ఢ్రై ఫ్రూట్స్
-నెయ్యి
సోన్ పాపిడి తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో అరకప్పు నెయ్యి వేయండి.
-నెయ్యి కరిగిన తర్వాత అందులో ముప్పావు కప్పు శెనగపిండి, పావు కప్పు మైదా పిండి వేసి మీడియం మంటమీద కలుపుతూ వేయించాలి.
-మిశ్రమం కొంచెం పొడిగా అనిపిస్తుంటే అందులో 1 టీస్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. కనీసం 20 నిమిషాలు మీడియం మంట మీద కలుపుతూ బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి.
-తర్వాత అందులో అర టీస్పూన్ యాలకల పొడి వేసి కలిపుకోండి. ఫ్రై చేసిన శెనగపిండిని స్టవ్ ఆఫ్ చేశాక కూడా 2 నిమిషాలు కలుపుతూ ఉండండి.
-తర్వాత పాకం తయారీ కోసం.. స్టవ్ మీద మరో పాన్ పెట్టి అందులో 1 కప్పు చక్కెర, అరకప్పు నీళ్లు పోసి 2 పాకం రెడీ చేసుకోవాలి. చక్కెర కరిగిపోయాక 2 నిమిషాలు పెద్ద మంట మీద మరిగించాక పాకం వచ్చిందో లేదో చెక్ చేస్తూ మరిగించాలి.
-పాకం వచ్చిందో లేదో చూడటానికి ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో కొంచెం పాకం వేస్తే ఉండపాకంలా రావాలి.
-అప్పుడు స్టవ్ మీద ఉన్న పాకంలో 1 టీస్పూన్ నిమ్మరసం పోసి కలిపి 2 నిమిషాలు పెద్ద మంట మీద మరిగించాలి. పాకం లేత బంగారు రంగులోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి.
-ఇప్పుడు ఒక ప్లేట్ కి నెయ్యి రాసుకొని అందులో పాకం మిశ్రమాన్ని పోయండి. 2 నిమిషాలకు అది గట్టిపడుతుంది. అప్పుడు స్పూన్ తో దాన్ని అంతా దగ్గరకి అంటే ముద్దలా వస్తుంది. ఇప్పుడు ఈ ముద్దని ఓ బటర్ పేపర్ లోకి తీసి ఉంచి దాన్ని బాగా వత్తుకోవాలి. పొడవుగా చేస్తూ అలా 2 నిమిషాలు సాగదీస్తున్నట్లుగా బాగా వత్తుకోవాలి. పాకం రెండు కొనులను కలిపి మళ్లీ విడదీసి అలా 2 నిమిషాలు వత్తుకోవాలి. చిన్న సైజు దండ మాదిరి ఉండేలా వత్తుకోండి.
-తర్వాత దండలా వత్తుకున్న పాకం మీద ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శెనగపిండి మిశ్రమం వేసి కలుపుతూ లాగుతూ సాగదీస్తున్నట్లుగా మళ్లీ వత్తుకోవాలి. చుట్టూ తిప్పుతూ లాగుతూ చెయ్యాలి.
-మనకు కావాల్సినంత పలుచటి తీగల్లా వచ్చేదాకా లాగుతూ మడతవేస్తూ మళ్లీ లాగుతూ ఉండాలి.
-సన్నటి దారాల్లా తీగలు తీగలుగా మాదిరి వచ్చిన తర్వాత జానెడంత పొడవుతో కట్ చేసుకోవాలి.
-దాని మీద ఏదైనా పేపర్ లేదా నేరుగా అయినా నెమ్మదిగా పూరీ కర్రతో రోల్ చేయాలి.
-తర్వాత దానిని చాకుతో మీకు నచ్చిన షేపులో కట్ చేసుకుంటే సోన్ పాపిడి రెడీ. దీన్ని వెంటనే ఏదైనా డబ్బాలోకి నిల్వ చేసుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











