Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
చికెన్ వేపుడు ఈ స్టైల్ లో చేస్తే..టేస్ట్ వేరే లెవల్!
Recipes
oi-Venkaiah Naidu
Posted By: Venkaiah Naidu
తెలుగు వారి వంటకాల్లో ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియుల లిస్ట్ లో చికెన్ వేపుడు లేదా చికెన్ ఫ్రైకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఘాటైన మసాలాలు, కరకరలాడే చికెన్ ముక్కలు, కరివేపాకు సువాసనతో తయారయ్యే ఈ వంటకం అద్భుతమైన రుచిని అందిస్తుంది.
అయితే ఇప్పటివరకు మీరు ఎన్నో రకాల చికెన్ వేపుళ్లు రుచి చూసి ఉంటారు. అయితే ఈసారి సరికొత్తగా స్టైల్ లో స్పైసీగా, నోటికి యమ రుచిగా చికెన్ వేపుడు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
- చికెన్
- ఉప్పు
- కారం
- పసుపు
- ఎండుమిర్చి
- అల్లంవెల్లుల్లి పేస్ట్
- నిమ్మరసం
- ధనియాలు
- మిరియాలు
- జీలకర్ర
- లవంగ మొగ్గలు
- యాలకలు
- కశ్మీరీ ఎండుమిర్చి
- దాల్చిన చెక్క
- వెల్లుల్లి రెబ్బలు
- ఆయిల్
- ఉల్లిపాయలు
- కరివేపాకు
- కొత్తిమీర
తయారీ విధానం
- ముందుగా కొంచెం మీడియంగా కొట్టించుకున్న చికెన్ ముక్కలను(బోన్ తో ఉండేది 500గ్రాములు)శుభ్రంగా కడగాలి.
- ఓ గిన్నెలో కడిగిన చికెన్ ముక్కలు వేసి,ఇందులోనే 1 టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ పసుపు, 2 టీస్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్,అరబద్ద నిమ్మరసం వేసి మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకొని 15 నిమిషాలు గిన్నెను పక్కన పెట్టుకోండి.
- తర్వాత మిక్సీ గిన్నెలో 2 టీస్పూన్ల ధనియాలు, 1 టీస్పూన్ మిరియాలు, అర టీస్పూన్ జీలకర్ర, 2 టీస్పూన్ల కారం, 5 లవంగ మొగ్గలు, 5 యాలకలు, 4 కశ్మీరీ ఎండు మిరపకాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి మొత్తని పొడిలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో 12 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తని పౌడర్ లా చేయకూడదు.
- తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే బాండీని స్టవ్ మీద పెట్టి అందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక అందులో పెద్ద సైజు 2 ఉల్లిపాయల సన్నని తరుగు వేసి అవి లేత బంగారు గోధుమ రంగులోకి వచ్చేదాకా వేయించాలి.
- ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత అందులో పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి మీడియం మంట మీద 4 నిమిషాలు వేయించుకోవాలి. చికెన్ లోని పచ్చిదనం పోయే వరకు వేగనిస్తే చాలు. చికెన్ వేగుతున్నప్పుడే అందులో 1 టీస్పూన్ ఉప్పు కూడా వేయాలి.
- 4 నిమిషాల తర్వాత మూతపెట్టి తక్కువ మంట మీద మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ వేయించుకోవాలి. చికెన్ ముక్కల్లో నుంచి నీళ్లు ఊరి,అవి ఇంకిపోయి, ఆయిల్ సపరేట్ అయ్యి కొద్దిగా కలర్ మారేవరకు వేయించాలి.
- చికెన్ ముక్కలు కలర్ మారేంతవరకు వేగిన తర్వాత అందులో 4 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి.
- చికెన్ ముక్క బాగా వేగిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసిన కారం పొడిని వేసి మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. తక్కువ మంట మీద 1 లేదా 2 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది.
- తర్వాత అందులో కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆపేయాలి. అంతే స్పైసీ చికెన్ వేపుడు రెడీ. దీనిని సాంబార్ అన్నం, రసం అన్నం లేదా చపాతీతో తింటే అద్భుతంగా ఉంటుంది.
Comments
More From
Boldsky
Prev
Next
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.
[ of 5 - Users]
English summary
Finger Licking Spicy Chicken Vepudu Recipe in Telugu
Story first published: Monday, February 2, 2026, 17:44 [IST]
Other articles published on Feb 2, 2026



Click it and Unblock the Notifications









