Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
గసగసే పాయస రెసిపి : గసగసాల పాయసం చేయటం ఎలా
కర్ణాటక రాష్ట్ర సంప్రదాయ స్వీటు వంటకం గసగసే పాయసం. ఇది అన్ని ప్రముఖ పండగలకి, రోజులకీ వండుకుంటారు. దీన్ని గసగసాలు, కొబ్బరి, బెల్లంతో తయారుచేస్తారు.
గసగసాల పాయసం ఎన్నో పోషకవిలువలున్నది మరియు చాలా చలవచేసేది. అందుకే భోజనం తర్వాత తీసుకుంటారు. నోటి పుళ్ళు, నిద్రలేమిని తగ్గించటానికి కూడా దీన్ని తింటారు. ఈ పాయసాన్ని తాగిన వెంటనే నిద్రమత్తు వస్తుంది.
ఖుస్ ఖుస్ ఖీర్ అన్ని పండగలకి చేసుకోదగ్గ సులభమైన స్వీటు పదార్థం. మీకు బెల్లంతో చేసిన స్వీట్లు ఇష్టమైతే, ఈ పాయసం మీ నాలుకకి ఎంతో ఆనందాన్నిస్తుంది. చిత్రాలు, వీడియోల సాయంతో తయారీ విధానం చదివేసి త్వరత్వరగా చేసుకోండి.
Recipe By: కావ్యశ్రీ ఎస్
Recipe Type: స్వీట్లు
Serves: 4కి
-
గసగసాలు - 3 చెంచాలు
బెల్లం - ½ మధ్య సైజు పాత్రలో
నీరు - అరగ్లాసు
కొబ్బరి కోరు - 1 కప్పు
ఏలకులు - 2
నీరు - పావు కప్పు
-
1. గసగసాలను ఒక వేడిచేసిన పెనంలో తీసుకోండి.
2. అవి కొంచెం బ్రౌన్ రంగులోకి మారేవరకు పొడిగా వేయించండి.
3. స్టవ్ పై నుంచి తీసేసి చల్లబడనివ్వండి.
4. ఈ లోపల ఆ వేడిపెనంలో బెల్లం వేయండి.
5. పావు కప్పు నీళ్ళు పోసి బాగా కలపండి.
6. మూతపెట్టి బాగా కరగనివ్వండి.
7. అదే సమయంలో, గసగసాలను మిక్సీలో వేయండి.
8. కొబ్బరికోరు,ఏలకులను కూడా వేయండి.
9. పావుకప్పు నీళ్ళు పోసి మిక్సీని తిప్పి పేస్ట్ లా తయారుచేయండి.
10. బెల్లం కరిగాక, ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలపండి.
11. 2-3 నిమిషాల పాటు మధ్య మంటపైన ఉడకనివ్వండి.
12. మాడిపోకుండా అప్పుడప్పుడూ కలుపుతూ ఉండండి.
13. ఉడికాక, వేడివేడిగా వడ్డించండి.
- 1. రుచికావాలంటే పాలను వేసుకోవచ్చు.
- 2. కొబ్బరితోపాటు గసగసాలను మిక్సీలో రుబ్బుతున్నప్పుడు, నానబెట్టిన బియ్యాన్ని కొంచెం వేస్తే గట్టిగా అవుతుంది.
- 3. బెల్లం బదులు పంచదార వేయవచ్చు; కానీ పాయసం రుచి మారిపోతుంది.
- 4. వేయించిన డ్రై ఫ్రూట్లను జతచేయడం చాలా మంచిపద్ధతి. ఇవి మరింత రుచిని తెస్తాయి.
- వడ్డించే పరిమాణం - 1 కప్పు
- క్యాలరీలు - 136 కాలరీలు
- కొవ్వు - 4 గ్రాములు
- ప్రొటీన్ - 3గ్రాములు
- కార్బొహైడ్రేట్లు - 14 గ్రాములు
- చక్కెర - 9 గ్రాములు
- ఐరన్ - 5%
స్టెప్ బై స్టెప్ - గసగసే పాయస తయారీ ఎలా
1. గసగసాలను ఒక వేడిచేసిన పెనంలో తీసుకోండి.
2. అవి కొంచెం బ్రౌన్ రంగులోకి మారేవరకు పొడిగా వేయించండి.
3. స్టవ్ పై నుంచి తీసేసి చల్లబడనివ్వండి.
4. ఈ లోపల ఆ వేడిపెనంలో బెల్లం వేయండి.
5. పావు కప్పు నీళ్ళు పోసి బాగా కలపండి.
6. మూతపెట్టి బాగా కరగనివ్వండి.
7. అదే సమయంలో, గసగసాలను మిక్సీలో వేయండి.
8. కొబ్బరికోరు,ఏలకులను కూడా వేయండి.
9. పావుకప్పు నీళ్ళు పోసి మిక్సీని తిప్పి పేస్ట్ లా తయారుచేయండి.
10. బెల్లం కరిగాక, ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలపండి.
11. 2-3 నిమిషాల పాటు మధ్య మంటపైన ఉడకనివ్వండి.
12. మాడిపోకుండా అప్పుడప్పుడూ కలుపుతూ ఉండండి.
13. ఉడికాక, వేడివేడిగా వడ్డించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






























