Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
శీతాకాలంలో చర్మం మెరవాలా? రోజూ ఒక గ్లాసు ఈ జ్యూస్ తాగండి..ఎలా చేసుకోవాలంటే
శీతాకాలం వచ్చిందంటే చాలు, మార్కెట్లో పచ్చని ఆకుకూరలు కనువిందు చేస్తాయి. అందులోనూ పాలకూర ఈ సీజన్ లో విరివిగా లభిస్తుంది. సాధారణంగా మన ఇళ్లలో పాలకూరను పప్పు లేదా వేపుడు రూపంలో తీసుకుంటాం. కానీ పాలకూరలోని పోషకాలను శరీరం వందశాతం గ్రహించాలంటే, దానిని జ్యూస్ రూపంలో తీసుకోవడమే ఉత్తమ మార్గమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు పాలకూర రసం తాగడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోవడమే కాకుండా, ముఖం కాంతివంతంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఆరోగ్యం కోసమే కాకుండా, రుచిగా కూడా ఉండేలా ఈ జ్యూస్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
పాలకూర జ్యూస్ తయారీకి కావలసిన పదార్థాలు
-తాజా పాలకూర ఆకులు
-పుదీనా ఆకులు
-దోసకాయ ముక్కలు
-నిమ్మరసం
-ఉప్పు
-వేయించిన జీలకర్ర పొడి
-నీరు
తయారీ విధానం
-ముందుగా పాలకూర, పుదీనా ఆకులను శుభ్రంగా కడగాలి.
-స్టవ్ మీద నీటిని మరిగించి అందులో పాలకూర ఆకులను వేసి 5-6 నిమిషాల పాటు ఉడికించాలి.
-ఇప్పుడు ఉడికించిన పాలకూర, పుదీనా, దోసకాయ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు కలపొచ్చు. పాలకూర జ్యూస్ రెడీ.
-తయారైన రసాన్ని గ్లాసులోకి తీసుకుని దానికి నిమ్మరసం, ఉప్పు, జీలకర్ర పొడి కలిపి వెంటనే తాగేయాలి.
ఇది తప్పక తెలుసుకోండి
పాలకూర ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దానిని తీసుకునే విధానం చాలా
ముఖ్యం. పాలకూరను ఎప్పుడూ పచ్చిగా జ్యూస్ చేసి తాగకూడదు. పచ్చి
పాలకూరలో ఆక్సలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇతర పోషకాల శోషణకు
ఆటంకం కలిగిస్తాయి, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి.
అందుకే జ్యూస్ చేయడానికి ముందు పాలకూరను వేడినీటిలో 5-6 నిమిషాలు
ఉడికించడం లేదా బ్లాంచ్ చేయడం వల్ల ఆక్సలేట్ల ప్రభావం తగ్గుతుంది. ఇది
సురక్షితమైన పద్ధతి.
ప్రయోజనాలు
-పాలకూరలోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడమే కాకుండా, మొటిమలను తగ్గించి చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది.
-ఈ జ్యూస్ లో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
-విటమిన్ సి పుష్కలంగా ఉండే పాలకూర, సీజనల్ వ్యాధుల నుండి మనల్ని రక్షించి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
-ఇందులోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రేచీకటి వంటి సమస్యలను దరిచేరనివ్వదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












