Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి!
తెలుగు వాళ్ల భోజనం గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చేవి ఆవకాయ, గోంగూర. ఈ రెండు పేర్లు వింటేనే మనకు తెలియకుండానే నోటిలో నీళ్లూరుతాయి. గోంగూర అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది గోంగూర పచ్చడి,గోంగూర పప్పు లేదా గోంగూర చికెన్, మటన్.
కానీ గోంగూరతో అద్భుతమైన, కమ్మని గోంగూర కారం (పొడి) కూడా తయారు చేయొచ్చు. కరివేపాకు పొడి, పుట్నాల పొడిలాగే గోంగూరతో చేసే ఈ కారం అద్భుతమైన రుచిని ఇస్తుంది. గోంగూర కారం ఎలా చేయాలో, దానికి ఏమేం కావాలో వివరంగా చూద్దాం.
.గోంగూర కారం తయారీకి కావాల్సిన పదార్థాలు
తాజా గోంగూర ఆకులు - 3 కప్పులు
ఎండుమిర్చి - 12 (మీ కారానికి తగినట్లుగా కాస్త మార్చుకోవచ్చు)
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
మెంతులు - ముప్పావు టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 6
నువ్వులు - 1 టేబుల్ స్పూన్
నూనె - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
గోంగూర కారం తయారీ విధానం
- ముందుగా గోంగూరను ఆకులుగా తుంచుకుని, నీళ్లలో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఆకులలోని నీరంతా వడకట్టి, ఒక పొడి వస్త్రం మీద ఆరబెట్టాలి. ఈ ఆకులకు తడి అస్సలు ఉండకూడదు. ఆకుల్లో ఏమాత్రం తడి ఉన్నా పొడి త్వరగా పాడైపోతుంది.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టి వేడి చేయాలి. ఎండుమిర్చి, మెంతులు, ధనియాలు, జీలకర్ర, నువ్వులను విడివిడిగా, సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించిన వాటన్నింటినీ ఒక పళ్లెంలోకి తీసుకుని చల్లారనివ్వాలి.
-తర్వాత అదే కడాయిలో కేవలం అర స్పూన్ నూనె వేసి వేడి చేసి, ముందుగా ఆరబెట్టుకున్న గోంగూర ఆకులను వేయించాలి. మంట సిమ్‌లో ఉంచి, ఆకులు పొడిపొడిలాడుతూ క్రిస్పీగా మారేంతవరకు ఓపిగ్గా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఒక డ్రై మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఎండుమిర్చి వేసి మళ్లీ మిక్సీ పట్టాలి. ఇవి బాగా నలిగాక, వేయించి పెట్టుకున్న గోంగూర ఆకులు, వెల్లుల్లి జతచేసి గ్రైండ్ చేయాలి. మరీ మెత్తని పౌడర్‌లా కాకుండా కాస్త బరకగా మిక్సీ పడితే రుచి అద్భుతంగా ఉంటుంది. చివరగా తగినంత ఉప్పు వేసి కలిపితే.. ఘుమఘుమలాడే గోంగూర కారం రెడీ.
ఈ కారం పొడిని గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటుంది. అదే ఫ్రిజ్‌లో పెట్టుకుంటే చాలా నెలలు నిల్వ ఉంటుంది.
వేడి వేడి అన్నంలోకే కాదు ఇడ్లీ, వేడివేడి దోశల్లోకి కూడా ఇది అద్భుతమైన కాంబినేషన్. ఉప్మా మీద కొద్దిగా ఈ పొడిని చల్లుకుని తింటే, ఆ ఉప్మాకి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












