అరటిపండుతో టీ.. తాగితే ఒక్క రోగం కూడా రాదు.. పది నిమిషాల్లోనే సింపుల్‌గా ఇలా చేసుకోండి!

ప్రపంచంలో చాలా మంది టీ ప్రియులు ఉన్నారు. ప్రతి ఒక్కరికీ ఉదయం లేవగానే టీ కచ్చితంగా కావాల్సిందే. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు కనీసం ఒక మూడు కప్పుల టీ తాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ టీ తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, చాలా వరకు దుష్ప్రయోజనాలు ఉంటాయి. అయినప్పటికీ చాలా మంది వాటిని తాగడం మాత్రం వదలరు. అలాంటి వ్యక్తులు సాధారణ టీకి బదులు ఈ బనానా టీ తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆయుష్షు పెరగడంతో పాటు.. శరీరంలో ఉండే సమస్యలన్నీ దూరమైపోతాయి. ఇంతకీ బనానా టీ తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బనానా టీ వల్ల కలిగే ప్రయోజనాలు

చాలా మంది ఒత్తిడి తగ్గడానికి, నిద్ర బాగా పట్టడానికి బనానా టీ తాగుతుంటారు. అయితే ఫలితం మాత్రం చాలా తక్కువగా వస్తుంది. అలాంటి వ్యక్తులు బనానా టీ తాగడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు. బనానా టీలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గిపోతుంది. నిద్ర బాగా పడుతుంది. నాడీ వ్యవస్థ సడలిపోతుంది.

ఈ టీ తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు, బలం లేకుండా ఉన్నామనే ఆలోచన కలిగినప్పుడు ఈ టీ తాగడం వల్ల తక్షణ శక్తీ లభించడంతో పాటు.. మనసు ఉత్తేజంగా మారుతుంది. అలాగే ఉల్లాసంగా అనిపిస్తుంది. అలాగే బనానాలో పోషకాలు చాలా ఉంటాయి. ఇవి చాలా తొందరగా జీర్ణమైపోతాయి. దీని వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు వృథా కాకుండా సులభంగా శరీరానికి అందుతాయి.

ఈ బనానా టీ తాగడం వల్ల హృదయానికి సంబంధించిన సమస్యలు అన్నీ దూరమైపోతాయి. గుండె జబ్బులు రాకుండా.. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలన్నీ ఆరోగ్యంగా శుభ్రంగా ఉంటాయి. దీంతో పాటు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాంతివంతంగా మెరిసిపోతుంది. అందంగా కనిపించడంతో పాటు చర్మం మృదుగా ఉంటుంది. అలాగే ఈ టీ తాగడం వల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. అందుకే ఈ బనానా టీని తాగేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు.

ఎలా చేసుకోవాలి?

ఈ బనానా టీని చేసుకోవడం కూడా చాలా సులభం. కేవలం పది నిమిషాల్లోనే ఇది సిద్దయిపోతాయి. ముందుగా ఒక మూడు కప్పుల నీటిని తీసుకోవాలి. దానిని మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు అందులో అరటి పండును ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. అలాగే అందులో ఒకటి దాల్చిన చెక్క, ఒకటి లవంగం కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఆ తరువాత వగట్టుకొని తాగితే రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.

[ of 5 - Users]
Story first published: Thursday, January 16, 2025, 12:20 [IST]
Desktop Bottom Promotion