Chia Seeds: బరువు తగ్గాలంటే ఉదయాన్నే చియా సీడ్స్ బ్రేక్‌ఫాస్ట్ తినాలి.. ఎలా చేసుకోవాలంటే?

బరువు అనేది ఈ మధ్య కాలంలో అత్యంత ప్రమాదకరమైన, అత్యంత చింతించాల్సిన సమస్యగా మారిపోయింది. చాలా మంది బరువు తగ్గేందుకు నానా రకాలుగా కష్టపడుతున్నారు. కొందరు డైట్స్ చేస్తుంటే మరికొందరు జిమ్‌లకు వెళ్లి కండలు కరిగిస్తున్నారు. అయినప్పటికీ వారు అనుకున్న విధాలుగా ఫలితాలు రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. అలాంటి వ్యక్తులు చియా సీడ్స్‌తో చేసే ఈ రెసిపీని తింటే కచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఎంత తిన్నా కూడా బరువు పెరగరు. ఇందులో పోషకాలు శరీర ఆకృతిని నిర్మించడంలో కూడా సహాయపడతాయి. ఇంతకీ ఈ చియా సీడ్స్‌తో బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చియా సీడ్స్‌తో బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు

  1. పావు కప్పు చియా విత్తనాలు
  2. ఒక కప్పు బాదం పాలు
  3. అర టీస్పూన్ వెనిలా
  4. ఒక టేబుల్ స్పూన్ తేనె
  5. స్ట్రాబెరిలు లేదా ఏదైనా పండుకు సంబంధించిన పొడవాటి ముక్కలు

చియా సీడ్స్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేసుకునే విధానం

ఈ చియా విత్తనాలతో బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులో చియా విత్తనాలు, బాదం పాలు, వెనీలా క్రీమ్, తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఆ ద్రావణంలో చియా విత్తనాలు బాగా కలిసిపోయే విధంగా కలుపుతూనే ఉండాలి. అలా మొత్తం కలిసిపోయాక ఆ మిశ్రమాన్ని అయిదు నుంచి పది నిమిషాల పాటు కదిలించకుండా అలానే వదిలేయాలి.

పది నిమిషాలు పూర్తయిన తరువాత.. ఆ మిశ్రమాన్ని మరోసారి కలుపుకొని దానిని రెండు నుంచి మూడు గంటల సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఆ తరువాత దానిని తీసుకొని అందులో కొన్ని బాదం పాలు వేసుకొని, పలుచగా చేసుకోవాలి. పై నుంచి స్ట్రాబెరీ ముక్కలు లేదా ఏదైనా పండుకు సంబంధించిన పొడవాటి ముక్కలను వేసుకోవాలి.

అంతే ఎంతో రుచికరమైన బరువు తగ్గేందుకు వీలుగా ఉండే చియా సీడ్స్ బ్రేక్‌ఫాస్ట్ సిద్ధమైనట్లే. దీనిని తినడం వల్ల కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దీని కారణంగా త్వరగా ఆకలి వెయ్యదు. ఫలితంగా సులభంగానే ఏమీ చేయకుండా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. బరువు తగ్గాలని మీరూ ట్రై చేస్తున్నట్లైతే ఓసారి ఈ చియా బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి.

[ of 5 - Users]
Story first published: Friday, December 27, 2024, 8:53 [IST]
Desktop Bottom Promotion