Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
పాతకాలం నాటి బలవర్ధకమైన సజ్జ లడ్డూ..ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో సజ్జలు ఎప్పుడూ ముందువరుసలో ఉంటాయి. సజ్జలతో చేసే లడ్డూ ఎప్పుడైనా తిన్నారా? చాలా చాలా టేస్టీగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి బోలెడు మేలు చేస్తాయి. కొన్ని ప్రాంతాల్లో నాగులచవితి రోజున ఈ లడ్డూని ప్రసాదంగా కూడా చేస్తుంటారు. ఇప్పుడంటే రకరకాల లడ్డూలు అందుబాటులో ఉంటున్నాయి కానీ ఒకప్పుడు మన పూర్వీకులు ఈ లడ్డూలు తినే బలంగా ఉండేటోళ్లు. పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటారు. టేస్టీ అండ్ హెల్దీ సజ్జ లడ్డూని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
సజ్జ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు
-సజ్జలు
-పల్లీలు
-నెయ్యి
-నువ్వులు
-ఎండుకొబ్బరి
-యాలకలు

సజ్జ లడ్డు తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నెలో ఒక కప్పు సజ్జలు వేసి రెండు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసి 5-6 గంటలు నానబెట్టాలి.
-తర్వాత సజ్జలను వడగిన్నెలో వేసి నీళ్లు అన్నీ పోయాక సజ్జలను ఓ పల్చని గుడ్డపై పోయండి తడి అంతా పూర్తిగా పోయే దాకా నీడలోనే ఆరనివ్వాలి.
-తర్వాత ఈ సజ్జలను ఓ గిన్నెలో వేసి దాన్ని స్టవ్ మీద పెట్టి వేయించుకోవాలి. తక్కువ మంట మీద ఆయిల్ లేకుండానే వీటిని కరకరలాడే దాకా వేయించుకున్నాక ఓ గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద ఉన్న పాన్ లోనే అరకప్పు పల్లీలు వేసుకొని తక్కువమంట మీద వేయించుకొని వీటిని ఓ ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లోనే పావు కప్పు నవ్వులు వేసి అవి చిటపటలాడేదాకా వేయించి ఓ ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి.
బలమైన రాగి తీపి రొట్టెలు..రక్తహీనతకు,బరువు తగ్గాలనుకున్నోళ్లకు బెస్ట్..ఎలా చేసుకోవాలంటే
-అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో ముందుగా వేయించిన సజ్జలు, నాలుగు యాలకలు వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి ఓ ప్లేట్ లోకి తీసి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేయించిన నువ్వులు, వేయించిన పల్లీలు, పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసి ఈ పొడిని గ్రైండ్ చేసిన సజ్జ పిండిలో వేసి కలపాలి. ఇందులోనే ముప్పావు కప్పు తురుమిన తాటి బెల్లం లేదా మామూలు బెల్లం వేసి మెత్తం కలిసేలా కలుపుకోండి.
-ఈ మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసి ముద్దగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని ఓ ప్లేట్ లోకి తీసుకొని బాగా కలిసేలా కలుపుకోండి.
-ఈ పిండిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలపండి. తర్వాత పిండిని కొంచెం కొంచెం చేతుల్లోకి తీసుకొని లడ్డూల్లా చేసుకోండి. అంతే సజ్జ లడ్డు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications