Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
నోటికి రుచిగా, కడుపుకు హాయిగా..అమృతం లాంటి మిల్లెట్ సాంబార్ రైస్
మిల్లెట్ సాంబార్ రైస్ అనేది రుచికి ఏమాత్రం తీసిపోని, సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే ఒక గొప్ప వంటకం. ఇందులో పప్పులు, కూరగాయలు, సజ్జలు అన్నీ కలిసి ఉండటం వల్ల ఇది ఒక కంప్లీట్ మీల్ గా మారుతుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టంగా తింటారు. ఇది తయారు చేయడం సులభం, లంచ్ బాక్సులకు పర్ఫెక్ట్ గా ఉంటుంది.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-సజ్జలు
-కందిపప్పు
-పసుపు
-ఉప్పు
-కారం
-ఉల్లిపాయ
-టమాటో
-మునగకాయ
-క్యారెట్
-కొత్తిమీర
-కరివేపాకు
-సజ్జలు
-ఆయిల్
-ఆవాలు
-జీలకర్ర
-ఎండుమిర్చి
-పచ్చిమిర్చి
-ఇంగువ
-వెల్లుల్లి
-గుమ్మడికాయ ముక్కలు
-బీన్స్
-వంకాయ
-కాలీఫ్లవర్
-చింతపండు
-ధనియాల పొడి
-సాంబార్ పొడి
-బెల్లం
తయారీ విధానం
-ముందుగా 1 కప్పు సజ్జలను రాత్రంలా లేదా కనీసం 5 గంటలు నానబెట్టాలి.
-తర్వాత నీటిని వడకట్టి సజ్జలను మిక్సీ గిన్నెలో వేసి 4 సార్లు పల్స్ మోడ్ లో కొన్ని సెకన్లు గ్రైండ్ చేస్తే అది రవ్వగా అవుతుంది. ఇలా అయితే సరిగ్గా ఉడుకుతుంది.
-ఇప్పుడు ఓ కుక్కర్ లో గ్రైండ్ చేసిన సజ్జల మిశ్రమం, పావు కప్పు నానబెట్టిన కందిపప్పు, పావు టీస్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, 3 కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూతపెట్టి మీడియం మంట మీద 4-5 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆపేయాలి.
-ఇప్పుడు అడుగు మందంగా ఉండే కడాయి స్టవ్ మీద పెట్టి అందులో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడి చేశాక అందులో 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయల ముక్కలు వేసి వేయించాలి.
-మిర్చి నల్లబడిన తర్వాత అందులో 10 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ వేసి ఆపాలి.
-కరివేపాకు చిట్లడం ఆగిన తర్వాత అందులో క్యూబ్స్ గా కట్ చేసిన పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీరుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, 7-8 మునక్కాడ ముక్కలు వేసి మూతపెట్టి మునక్కాడలు మెత్తబడేదాకా మగ్గించాలి. దీనికి 4-5 నిమిషాల సమయం పడుతుంది.
-ఇప్పుడు మూత తీసి అందులో ముప్పావు కప్పు గుమ్మడికాయ ముక్కలు, చీరుకున్న 1 వంకాయ ముక్కలు, పావు కప్పు ఫ్రెంచ్ బీన్స్, పావు కప్పు కాలీఫ్లవర్ ముక్కలు, పావు కప్పు క్యారెట్ ముక్కలు వేసి 2 నిమిషాలు కలుపుతూ వేయించాలి.
-తర్వాత అందులో అర కప్పు నీళ్లు పోసి మూతపెట్టి మగ్గించుకోవాలి.
-కూరగాయల ముక్కలు మగ్గలోగా ఓ గిన్నెలో నిమ్మకాయంత నానబెట్టిన చింతపండు నుంచి గట్టిగా పిండి సారం తీసేయండి. చింతపండు సారంలో అర టేబుల్ స్పూన్ కారం, పావు టీస్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వేపిన ధనియాల పొడి, ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి చేత్తోనే బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు 70 శాతం వరకు వేగిన కూరగాయల మక్కల్లో కలుపుకున్న పులుసు పోసి మీడియం మంట మీద రెండు పొంగులు రానివ్వాలి.
-ఇప్పుడు అందులో క్యూబ్స్ గా కట్ చేసిన 2 టమాటోల ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి.
-ఇప్పుడు ఇందులో ఉడికిన సజ్జ మిశ్రమం పోసి, 1 కప్పు వేడి నీరు, కొంచెం కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసి 4-5 నిమిషాల పాటు మూతపెట్టి మీడియం మంట మీద ఉడకనివ్వాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
-బాగా ఉడుకుపట్టి దగ్గరపడుతున్నప్పుడు ఉప్పు, కారం రుచి చూసి కావాలనుకుంటే వేసుకోండి.
-చివరగా అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొత్తిమీర తురుగు కొంచెం చల్లి కలిపి దించేయండి. అంతే మిల్లెట్ సాంబార్ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












