Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
సింపుల్ రెసిపీ, అద్భుతమైన రుచి..కొబ్బరి అట్టు ఎలా చేసుకోవాలంటే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ వంటి దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన ఒక సాంప్రదాయ అల్పాహారం కొబ్బరి అట్టు. ఇది సాధారణ దోశకు భిన్నంగా, కొబ్బరి రుచి, సువాసనతో ప్రత్యేకంగా ఉంటుంది. కొబ్బరి, బియ్యం పిండితో తయారయ్యే ఈ అట్టు రుచి, ఆరోగ్యం రెండింటినీ అందించే ఒక అద్భుతమైన అల్పాహారం. దీనిని సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీ దినచర్యలో ఈ రుచికరమైన,పౌష్టికమైన అల్పాహారాన్ని చేర్చుకోవడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఒక అడుగు ముందుకు వేసినట్లే. కొబ్బరి అట్టు తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
కొబ్బరి అట్టు తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఉల్లిపాయ
-వెల్లుల్లి రెబ్బలు
-ఎండుమిర్చి
-నువ్వులు
-కొబ్బరి తురుము
-అల్లం
-పచ్చిమిర్చి
-జీలకర్ర
-పసుపు
-ఉప్పు
కొబ్బరి అట్టు తయారీ విధానం
-ముందుగా ఒకటిన్నర గ్లాసు బియ్యాన్ని బియ్యాన్ని గంటన్నర సేపు నానబెట్టాలి.
-తర్వాత మిక్సీ గిన్నెలో నానబెట్టిన బియ్యం,1 కొబ్బరి చెక్క తురుము, 3 స్పూన్ల నువ్వులు, 10 పచ్చిమిర్చి,2 చిన్న స్పూన్ల జీలకర్ర, 5ఎండుమిర్చి, 2 ఇంచుల అల్లం,4 వెల్లుల్లి రెబ్బలు,1 ఉల్లిపాయ ముక్కలు, కొంచెం నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసుకున్న పిండిలో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉల్లికోడు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొబ్బరి అట్టు పిండిని ఇడ్లీ లేదా దోశ పిండి లాగా పొంగబెట్టాల్సిన అవసరం లేదు. దీనిని వెంటనే తయారు చేసుకోవచ్చు. అయితే కొన్ని గంటలు పులయనిస్తే రుచి ఇంకా బాగుంటుంది.
-తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి బాగా వేడి చెయ్యాలి.
-పెనం వేడెక్కిన తర్వాత దానిమీద ఓ గుంట గరిటతో కలిపిన పిండిని తీసుకొని స్టవ్ మీద అట్టు పోసుకోవాలి.
-అట్టు పైన కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. నూనె లేదా నెయ్యితో అట్టుని రెండువైపులా బాగా కాల్చుకోండి. అంతే టేస్టీ కొబ్బరి అట్టు రెడీ. దీనిని నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే నోటికి స్వర్గమే.
ప్రయోజనాలివే
కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCTs) పుష్కలంగా ఉంటాయి. ఇవి
శరీరం ద్వారా త్వరగా జీర్ణమై శక్తిగా మారతాయి. బియ్యం కార్బోహైడ్రేట్
లను అందిస్తుంది.. ఇది రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన శక్తిని
ఇస్తుంది. కొబ్బరిలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి
ముఖ్యమైన విటమిన్లు,మినరల్స్ ఉన్నాయి..ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను
అందిస్తాయి. బియ్యం పిండి కూడా బి విటమిన్లు వంటి కొన్ని పోషకాలను
అందిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications










