Latest Updates
-
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే!
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
ఎండాకాలం వచ్చేసింది. మండుతున్న ఎండల దెబ్బకు మధ్యాహ్నం పూట వేడివేడి అన్నం, కారంకారంగా ఉండే కూరలు తినాలంటేనే మనసు అంగీకరించదు. ఇలాంటి సమయంలో కడుపుకు చల్లగా, నోటికి కమ్మగా ఏదైనా తినాలనిపిస్తుంది. అప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేది పెరుగన్నం.
పెరుగు తినడం వల్ల శరీరానికి తక్షణ చలవ దొరుకుతుంది. ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే, రోజూ తినే సాధారణ పెరుగన్నం కంటే, దానికి కాస్త స్పెషల్ టచ్ ఇస్తే ఎలా ఉంటుంది? కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు జోడించి చేస్తే, ఆ రుచికి ఇంట్లో వాళ్లంతా ఫిదా అవ్వాల్సిందే.
వేసవిలో శరీరాన్ని చల్లబరిచి, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే స్పెషల్ పెరుగన్నం'ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్పెషల్ పెరుగన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు
అన్నం (మెత్తగా ఉడికించినది) - 1 కప్పు
గట్టి పెరుగు - 2 కప్పులు
పాలు - అర కప్పు
ఆవాలు - 1 టీస్పూన్
శనగపప్పు - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరగాలి)
ఎండుమిర్చి - 2
అల్లం తరుగు - 1 టీస్పూన్
ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగిన ముక్కలు)
కొత్తిమీర - కొద్దిగా
కరివేపాకు - రెండు రెమ్మలు
దానిమ్మ గింజలు - పావు కప్పు
ద్రాక్ష పండ్లు - గుప్పెడు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
స్పెషల్ పెరుగన్నం తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించుకోవాలి. పప్పులు ఎర్రగా మారుతున్నప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడేలా వేయించి స్టవ్ కట్టేయాలి. ఈ తాలింపు మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేయాలి. అన్నం మరీ పలుకుగా కాకుండా, గరిటెతో కొద్దిగా మెత్తగా అయ్యేలా స్మాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల అన్నం పెరుగును బాగా పీల్చుకుని కమ్మటి రుచిని ఇస్తుంది.
-ఈ మెత్తటి అన్నంలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తురిమిన అల్లం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా సిద్ధం చేసుకున్న కమ్మటి గట్టి పెరుగును వేయాలి. ఇక్కడే ఒక చిన్న ట్రిక్ ఉంది. నీళ్లకు బదులుగా కాచి చల్లార్చిన పాలు పోసి కలపాలి. దీంతో పెరుగన్నం త్వరగా పుల్లగా మారకుండా, రోజంతా కమ్మగా ఉంటుంది.
-ఇప్పుడు పక్కన పెట్టుకున్న తాలింపు మిశ్రమాన్ని ఇందులో వేసి కలపాలి. దానిమ్మ గింజలు, ద్రాక్ష పండ్లను పైన చల్లుకోవాలి. చివరగా మీ రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే నోరూరించే స్పెషల్ పెరుగన్నం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












