Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
కరకరలాడే సగ్గుబియ్యం వడలు..తింటే అద్భుతం అంటారు,ఎలా చేసుకోవాలో చూడండి
వడల్లో అనేక రకాల వెరైటీలు ఉంటాయి. వీటిలో సగ్గుబియ్యం వడలు ఒకటి. ఇవి క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ లేదా సాయంత్నం స్నాక్ లోకి ఎలా తీసుకున్నా అదిరిపోతుంది. ఒక్కటి తిని ఆగరు. ఇంకా కావాలి అని అడుగుతంటారు. అంత రుచికరంగా ఉంటాయి. క్రిస్పీగా ఉండే ఈ సగ్గుబియ్యం వడలు ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు. దీనికి పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. సగ్గుబియ్యం వడలు తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
సగ్గుబియ్యం వడలు తయరీకి కావలసిన పదార్థాలు
-సగ్గుబియ్యం
-జీలకర్ర
-పచ్చిమిర్చి
-కొత్తిమీర
-ఉప్పు
-చక్కెర
-పల్లీలు
-బంగాళదుంప
-పుదీనా
-ఆయిల్
సగ్గుబియ్యం వడలు తయారీ విధానం
-ముందుగా పావు కేజీ సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి అందులో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి.
-తర్వాత స్టవ్ మీద ఓ పాన్ పెట్టి అందులో 1 కప్పు పల్లీలు వేసి ఆయిల్ లేకుండానే వేయించి పక్కనపెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పొట్టు తీసేయాలి. ఇందులో నుంచి సగం కప్పు పల్లీలు తీసుకొని మిక్సీలో వేసి పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోవాలి.
-తర్వాత చట్నీ కోసం మిగిలిన అరకప్పు పొట్టు తీసిన పల్లీలు మిక్సీ గిన్నెలో వేసి,ఇందులోనే 1 కట్ట కొత్తిమీర, గుప్పెడు పుదీనా, 4 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగి ఉప్పు, కొద్దిగా చక్కెర, కొద్దిగా నిమ్మరసం వేసి మధ్య మధ్యలో కొంచెం నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చెట్నీ రెడీ. దీన్ని పక్కనపెట్టుకోండి.
రాయలసీమ పల్లెల స్పెషల్ బెండకాయ బజ్జీ..టేస్ట్ లో తిరుగుండదు అంతే..ఎలా చేసుకోవాలంటే..
-ఇప్పుడు రెండు బంగాళదుంపలను ఉడికించుకోవాలి.
-తర్వాత నానిన సగ్గుబియ్యంలో కచ్చాపచ్చగా గ్రైండ్ చేసిన పల్లీలు, 1 టీస్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి, ఉడికించిన బంగాళదుంపల తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. నీళ్లు అస్సలు వేయకూడదని గుర్తుంచుకోండి.
-తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని సగ్గుబియ్యం మిశ్రమాన్ని ముద్దలుగా చేతిలోకి తీసుకొని వడలుగా వత్తి వాటిని వేడి వేడిగా కాగే నూనెలో వేయించుకోవాలి. అంతే కరకరలాడే సగ్గుబియ్యం వడలు రెడీ. వీటిని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీతో నంజుకొని తింటే ఆ మజానే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









