హై ప్రొటీన్ స్ప్రౌట్ సలాడ్..భల్లాలదేవలా బలమైన శక్తి,బరువు తగ్గొచ్చు..ఇలా చేసుకోండి

Posted By:

ప్రస్తుతం అందరిలోనూ ఆరోగ్యంపై శ్రద్ద పెరిగింది. మన దగ్గర చాలామంది ఉదయాన్నే ఇడ్లీ,దోసె, బోండా, ఫ్రూట్స్‌తో తయారు చేసిన సలాడ్స్ వంటివి తింటుంటారు. అయితే శరీరం ఆరోగ్యంగా దృఢంగా ఉండాలంటే మాత్రం వాటికి బదులుగా మొలకెత్తిన గింజలు,విత్తనాలు,మరికొన్నింటితో తయారు చేసే స్ప్రౌట్ సలాడ్ చాలా ఉత్తమమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన గింజల్లో అధిక మోతాదులో పోషకాలు, ఇతర మూలకాలు లభిస్తాయి. అనేక వ్యాధులను నియంత్రించే,బరువు తగ్గడానికి కూడా సహాయపడే స్ప్రౌట్ సలాడ్ ఎలా రెడీ చేసుకోవాలో ఇక్కడ చూడండి.

స్ప్రౌట్ సలాడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-యోగర్ట్(పెరుగులో ఒక రకం)
-తేనె
-ఆలివ్ ఆయిల్
-నల్ల మిరియాలు
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-చనా మొలకలు
-నిమ్మరసం
-పెసల మెలకలు
-లెట్యూస్ ఆకులు
-పచ్చి బఠాణీ
-కీర దోసకాయ
-దానిమ్మ
-పిజ్జా సీజనింగ్
-ఉప్పు
-వెల్లుల్లి

స్ప్రౌట్ సలాడ్ తయారీ విధానం

-ముందుగా ఒక బౌల్ లో 50 గ్రాముల యోగర్ట్(పెరుగులో మరో రకం) వేయండి.

-అందులోనే 1 టేబుల్ స్పూన్ తేనె,1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1/8 టేబుల్ స్పూన్ నల్లమిరియాలు,తగినంత ఉప్పు వేసి కలపండి.

-ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ పిజ్జాకు రుచిని పెంచడానికి ఉపయోగించే మసాలా దినుసులు(pizza seasoning), 1/2టీస్పూన్ కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేసి మొత్తం అన్నీ కలిసేలా బాగా కలపాలి.

-ఇప్పుడు ఓ పెద్ద బౌల్ లో ఉడకబెట్టిన పెసలు మొలకలు 70 గ్రాములు,చనా మొలకలు 70 గ్రాములు, ఉడికించిన పచ్చి బఠాణీలు 50 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు 50 గ్రాములు, కీర దోసకాయ ముక్కలు 60 గ్రాములు,దానిమ్మ 50 గ్రామలు, టమాటో 50 గ్రాములు,లెట్యూస్ ఆకులు 40 గ్రాములు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి.

-ఇందులోనే ఆల్రెడీ కలిపి ఉంచుకున్న యోగర్ట్ మిశ్రమాన్ని కూడా వేసి కలపండి. హై ప్రొటీన్ మొలకల సలాడ్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, January 25, 2025, 8:10 [IST]
Desktop Bottom Promotion