Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Diwali 2024: దీపావళి స్పెషల్ స్వీట్ కాజు హల్వా.. ఏ విధంగా చేసుకోవాలో తెలుసా?
Recipes
oi-Banothu Praveen Kumar
Posted By: Banothu Praveen Kumar
దీపావళి పండగకు చాలా మంది స్వీట్స్ తింటూ ఉంటారు. అలాగే ఇంటికి వచ్చే అతిథులకు బహుమతిగా ఈ స్వీట్స్ ఇస్తూ ఉంటారు. దీనికోసం షాపుల నుంచి స్వీట్స్ తీసుకొని ఇస్తారు. కానీ ఈ దీపావళికి స్వీట్స్ బయటి నుంచి కాకుండా ఇంట్లోనే చేసి తినడడంతో పాటు, మీ ఇంటికి వచ్చిన అతిథులకు కూడా ఇస్తే చాలా బాగుంటుంది. అందుకే కాజు హల్వా అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
అయితే ఈ కాజు హల్వాను ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలాంటి పద్ధతుల్లో హల్వా చేసుకుంటే రుచి అమోఘంగా వస్తుందనేది ఈ స్టోరీలో చూద్దాం.
కాజు హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు
- గోధుమ పిండి
- కుంకుమ పువ్వు
- జీడిపప్పు
- పంచదార లేదా వీలైతే బెల్లం పొడి
- నెయ్యి
- యాలకుల పొడి
- డ్రై ఫ్రూట్స్
కాజు హల్వా తయారీ విధానం
- ఈ కాజు హల్వా తయారు చేయడానికి ముందుగా జీడిపప్పును మెత్తగా పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అనంతరం ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోసి మరిగించండి. నీళ్లు మరిగాక అందులో పంచదార లేదా బెల్లం పొడి వేసి, మంటను హైలో పెట్టి అది కరిగేంత వరకు మరిగించుకోవాలి. ఆ సమయంలోనే అందులో యాలకుల పొడి, కుంకుమ పూల రేకులు వేసి కొంచెం సేపు మరిగించుకొని పక్కకు పెట్టుకోవాలి.
- అనంతరం మరొక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసి.. అందులోనే గోధుమ పిండి, పిండిలా చేసుకున్న జీడిపప్పును వేయించాలి. ముఖ్యంగా మాడిపోకుండా చూసుకోవాలి. అనంతరం ఆ పిండిలో మనం ముందుగా చేసి పెట్టుకున్న పంచదార లేదా బెల్లం పొడితో చేసుకున్న పాకంను పోసి మెల్లమెల్లగా కలుపుకోవాలి.
- ఉండలు లేకుండా, మిశ్రమం దగ్గర పడే కొద్దీ కలుపుకుంటూ ఉండాలి. అనంతరం ఒక బౌల్లో ఆ హల్వాను వేసుకొని దానిపై కొన్ని డ్రై ఫ్రూట్స్ స్లైసెస్ను గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. దీపావళికి ఎంతో రుచికరమైన కాజు హల్వా సిధమైనట్లే.
Comments
More From
Boldsky
Prev
Next
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.
[ of 5 - Users]
English summary
Home made cashew halwa recipe for this diwali.. Here is secret tip to make it
Story first published: Saturday, October 26, 2024, 13:34 [IST]
Other articles published on Oct 26, 2024



Click it and Unblock the Notifications












