ఇడ్లీలు మిగిలిపోయాయా? అయితే ఇలా స్నాక్స్ చేసుకోండి.. ఎలా చేసుకోవాలంటే?

ఉదయాన్నే చాలా మంది ఇడ్లీలు తినడానికి ఇష్టపడుతుంటారు. ఇందులో హానికరమైన నూనె ఉండకపోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని, అలాగే తొందరగా ఇంట్లోనే దీనిని తయారు చేసుకోవచ్చని చాలా మంది ఎంతో ఇష్టంగా దీన్ని తింటూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇడ్లీలు మిగిలిపోతాయి. ఎక్కువ అయిపోవడం వల్లనో లేదా ఇతర కారణాల వల్ల మిగిలిపోతుంటాయి.

అయితే మిగిలిపోయిన ఇడ్లీలను పారేయకుండా సాయంత్రం షేజ్వాని ఇడ్లీ లాంటి స్నాక్ ఐటెంలా తయారు చేసుకోవచ్చు. ఈ షేజ్వాని ఇడ్లీని ఎలా చేసుకోవాలి? దానికి ఎలాంటి పదార్థాలు కావాలి అనేది ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.

షేజ్వాని ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు

  • ఆరు ఇడ్లీలను సమాంతరంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి
  • మూడు టీస్పూన్ల షేజ్వాన్ సాస్
  • ఒకటి తరిగిన ఉల్లపాయ
  • నిలువుగా చీల్చిన రెండు పచ్చి మిర్చి
  • మూడు టేబుల్ స్పూన్ల నూనె
  • కొన్ని క్యాప్సికం ముక్కలు(కావాలనుకుంటేనేం వేసుకోవాలి)
  • కొంచెం తరిగిన ఉల్లి కాడలు
  • ఆవాలు
  • గరం మసాలా
  • సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు
  • రుచికి సరిపడా ఉప్పు
  • కొత్తిమీర

షేజ్వాని ఇడ్లీ తయారీ విధానం..

  • ముందుగా మనం తీసుకున్న ఆరు ఇడ్లీలు తీసుకోని.. ఒక్కో ఇడ్లీని సమాంతరంగా ఆరు ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఒక పెనం తీసుకొని.. అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడయ్యాక.. అందులో ఆవాలు వేసుకోవాలి. నూనె వేడికి ఆవాలు చిట్లి చిటపటాలాడుతున్నప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లులి రెబ్బలు, నిలువుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి.
  • అవన్నీ కొద్దీ నిమిషాల పాటు వేగాకా.. అందులో మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు, క్యాప్సికం ముక్కలు వేసుకొని హై మంట మీదే కొంచెం సేపు ఫ్రై కానివ్వాలి. మనం ముందుగా వేసుకున్న నూనె అందులో వేసిన కూరగాయక ముక్కలకు సరిగ్గా పట్టుకునే విధంగా కలుపుకోవాలి. అప్పులే ముక్కలు నూనెలో బాగా ఫ్రై అవుతాయి.
  • ఆ తరువాత అందులో మూడు టేబుల్ స్పూన్ల షజ్వాన్ సాస్ వేసుకోవాలి. అలాగే గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అలాగే ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో ముందుగా ముక్కలు చేసి పెట్టుకున్న ఇడ్లీలను వేసుకోవాలి. ఆ ఇడ్లీలకు షేజ్వాన్ మిశ్రమం సరిగ్గా పట్టుకునే విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి.
  • వాటిని సరిగ్గా ఒక నిమిషం పాటు హై మంట మీద ఉడకనివ్వాలి. తరువాత మూత తీసి దానిపైన కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడిగా ఎంతో రుచికరమైన షేజ్వాన్ ఇడ్లీ సిద్దమైపోతుంది. దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్‌లో తీసుకొని కొంచెం నిమ్మకాయ జ్యూస్ పిండుకొని తింటే రుచి అదిరిపోతుందంతే!
[ of 5 - Users]
Story first published: Monday, November 11, 2024, 9:44 [IST]
Desktop Bottom Promotion