కర్నాటక స్టైల్ అక్కీ రోటీ ఎప్పుడైనా తిన్నారా..? ఫుల్ పోషకాలు ఇంకా టేస్టీ కూడా..!

Posted By:

టిఫిన్స్‌కు ఎప్పుడూ ఇడ్లీ, వడ, దోశ మాత్రమే కాకుండా ఈ సారి ఏదైనా స్పెషల్‌గా ట్రై చేద్దాం. మన తెలుగు వంటలే కాదు పక్క రాష్ట్రాల వారి టిఫిన్స్ ట్రై చేస్తే ఆ కిక్కే వేరుగా వుంటుంది. వాళ్ల టిఫిన్స్ రుచులు కూడా మనం తప్పకుండాచూడాలి. ఈ సారి కర్నాటక వారి అక్కీ రోటీని ట్రై చేద్దాం. అక్కీ రోటీ దక్షిణ భారతదేశంలో చాలా పాపులర్ డిష్. కర్నాటకలో ఇది చాలా స్పెషల్ వంటకం. ఇందులో పోషకాలు, ఫైబర్ మెండుగా వుండాయ్. ఇందులో వుండే కూరగాయలు,కొబ్బరి, మసాలాల వల్ల చెడు కొలిస్ట్రాల్ లాంటివి ఏవీ లేకుండా వుంటాయ్. ఈ అక్కీరోటీని ఇంట్లో వున్న పదార్ధాలతోనే చాలా ఈజీగా చేసుుకోవచ్చు. ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.

అక్కీ రోటీ తయారు చేయడానికి కావాల్సిన వంట సామాగ్రి

1 క్యారెట్‌
1 మీడియం సైజు ఉల్లిపాయ
1 ఇంచు అల్లం
కొన్ని మెంతులు, కొన్ని కరివేపాకులు
1/2 కప్పు మెంతులు, 1/2 కప్పు తురిమిన క్యారెట్లు, 1/2 కప్పు స్నగా తరిగిన ఉల్లిపాయలు
1/2 కప్పు తరిగిన 7.కొత్తిమీర ఆకులు
సన్నగా తరిగిన అల్లం ముక్కలు
3 సన్నగా తిరగిన పచ్చిమిరపకాయలు
1/2 కప్పు తురిమిన కొబ్బరి, 1 టీస్పూన్ జీలకర్ర
ఒకటిన్నర కప్పు బియ్యం పిండి

అక్కీ రోటీని ఈ కింది విధంగా రెడీ చేసుకోండి చాలా సింపుల్ స్లైల్లో

1. 1 క్యారెట్‌ను తీసుకొని కడిగి పై పొట్టును తీసుకొని సన్నగా తరుక్కోవాలి.
2. 1 మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకోవాలి
3. 1 ఇంచు అల్లంను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
4. కొన్ని మెంతులు, కొన్ని కరివేపాకులను నీళ్లల్లో తీసుకొని బాగా కడుక్కోవాలి.
5. తరిగిన కూరగాయలన్నింటినీ ఒక ప్యాన్‌లోకి తీసుకోవాలి
6. 1/2 కప్పు మెంతులు, 1/2 కప్పు తురిమిన క్యారెట్లు, 1/2 కప్పు స్నగా తరిగిన ఉల్లిపాయలు, 1/2 కప్పు తరిగిన 7.కొత్తిమీర ఆకులను ఒక గిన్నెలో తీసుకోవాలి.
8. 1 టీస్పూన్ అంతలో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 3 సన్నగా తిరగిన పచ్చిమిరపకాయలను కూడా తీసుకోవాలి.
9. 1/2 కప్పు తురిమిన కొబ్బరి, 1 టీస్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి.
10. ఒకటిన్నర కప్పు బియ్యం పిండిని కూడా యడ్ చేసుకోవాలి.
11. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. 20 నిమిశాల వరకు మూతపెట్టి వదిలేయాలి.
12. తరువాత దీంట్లో కావాల్సినన్ని నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి.
13. ఒప్పుడు ఒక అరటి ఆకును తీసుకొని దాన్ని నీళ్లతో కడిగి దానిపై నూనెతో రాయాలి.
14. ఇప్పుడు ఒక పిడికెడు బియ్యంపిండిని తీసుకొని ఆకుపై పెట్టి గట్టిగా ప్రెస్‌చేస్తూ అప్పడంలా చేసుకోవాలి. ఇది 15. మరీ మందంగా, మరీ సన్నగా లేకుండా చూసుకోవాలి.
16. ఇప్పుడు దోశవేసే ఒక ప్యాన్‌ను తీసుకొని దానిపై ఒక చెంచా నూనెపోసి బాగా వేడి చేయాలి. ఇప్పుడు ఈ అప్పడాన్ని ప్యాన్‌పై వేసి ఫ్రై అయ్యేలా చూడాలి.
17. కొన్ని సెకన్ల వరకు ఒకేవైపుకు వుంచి, నూనెను అద్దుకుంటూ అటూఇటూ తిప్పుతూ వుండాలి.
18. ఇక ఈ అక్కీ రోటీ బంగారు రంగులో వచ్చే వరకూ దీన్ని తిప్పుతూనే వుండాలి. తరువాత ప్యాన్ పైనుంచి కిందకు 19. దించుకోవాలి. టమాటా చట్నీ, లేదంటే కొబ్బరి చట్నీతో దీన్ని నంచుకొని తినవచ్చు. చాలా టేస్టేగా వుంటుంది.

[ of 5 - Users]
Story first published: Sunday, July 7, 2024, 10:26 [IST]
Desktop Bottom Promotion