Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Ash gourd halwa: శృంగార సమస్యలకు సంజీవని..బూడిద గుమ్మడికాయ హల్వా ఇలా చేసుకోండి
ఆరోగ్యానికి మేలు చేసే అనేకరకాల పోషకాలు గుమ్మడికాయలో ఉంటాయి.
గుమ్మడికాయ గింజలు,గుమ్మడికాయతో చేసే కూరలు,గుమ్మడితో చేసే
స్వీట్లు,హల్వా దేనికదే ప్రత్యేకమైనది. ఇక,
తెల్ల గుమ్మడికాయ హల్వాకి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది.
ఆయుర్వేదంలో దీనిని కూష్మాండ లేహ్యం అంటారు.
వీర్య వృద్దికి,ఇతర శృంగార సమస్యలు ఉన్నవారికి గుమ్మడికాయ హల్వా అద్భుతంగా పనిచేస్తుంది. దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటది. తెల్ల గుమ్మడికాయ హల్వాని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ తెల్ల బూడిద గుమ్మడికాయ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
బూడిద గుమ్మడికాయ హల్వా తయారీకి కావాల్సిన
పదార్థాలు
-తెల్ల బూడిద గుమ్మడికాయ
-చక్కెర
-నెయ్యి
-జీడిపప్పు
-కుంకుమపువ్వు
-యాలకల పొడి
-నిమ్మరసం
-పచ్చ కర్పూరం
బూడిద గుమ్మడికాయ హల్వా తయారీ విధానం
-ముందుగా తెల్ల బూడిద గుమ్మడికాయ తీసుకొని దానిపైన చెక్కు తీసేయండి. తర్వాత లోపలి గింజలు కూడా తీసేయండి.
-ఇప్పుడు దానిని మీడియం సైజ్ రంధ్రాలు ఉన్న వైపు తరుముకోండి.
-ఈ గుమ్ముడి కాయ తరుము అంతా ఓ గుడ్డలో వేసి గట్టిగా పిండి నీరంతా తీసేయండి. ఈ పిప్పికి సమానంగా పంచదారను ఓ బౌల్ లోకి తీసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో పిండేసిన గుమ్మడి తురుము నీరు పోసి ఆ తర్వాత ఇందులోనే గుమ్మడి పిప్పి వేసి మంటను మీడియం ప్లేమ్ లో పెట్టి కలుపుతూ దగ్గరగా వచ్చేదాకా ఉడికించండి.
-తర్వాత ఇందులో బౌల్ లో తీసి ఉంచిన పంచాదర వేసి కలపండి. పంచదార కరిగి జిగురు వచ్చేదాకా ఉడికించండి. దీనికి 10-15 నిమిషాల సమయం పట్టొచ్చు.
-జిగురు వచ్చి,నీరుగా జారుగా వచ్చిన తర్వాత అందులో 5-6 బొట్లు నిమ్మరసం, కుంకుమ పువ్వు, కొంచెం నెయ్యి,యాలకల పొడి కొంచెం,చిటికెడు పచ్చ కర్పూరం కొద్దిగా వేసి 7-8 నిమిషాలు ఉడికించండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగినత తర్వాత అందులో కొంచెం జీడిపప్పు వేసి దోరగా వేయించండి. తర్వాత దీనిని హల్వాలో కలిపేయండి.
-ఈ హల్వాని స్టవ్ మీద నుంచి తీసి పక్కనపెట్టి కొద్దిసేపు చల్లారనిచ్చి సర్వ్ చేసుకోండి. టేస్ట్ చూసిన తర్వాత బూడిద గుమ్మడి హల్వానా మజాకానా అని అంటారు. తడి తగలకుండా ఉంచితే 10 రోజుల వరకు ఈ హల్వా నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












