ఆవిరి కుడుము.. కుక్కర్ లేకుండా కూడా తయారు చేసుకోవచ్చు ?

Posted By:

ఆవిరి కుడుమును ఎప్పుడైనా తిన్నారా. దీంట్లో వుండే మినపప్పు, బియ్యం మాత్రమే. రుచికోసం కొంచం ఉప్పు వేసుకుంటాము. చాలా సింపుల్‌గా ఈ ఆవిరి కుడుమును రెడీ చేసుకోవచ్చు. దీని కోసం ఆవిరి కుక్కర్ అవసరం పడుతుంది. అది లేకున్నా. ఒక బౌల్‌తో తాత్కాలికంగా ఆవిరి పట్టేలా రెడీ చేసుకోవచ్చు. అది ఎలా చేస్తారో తెలుసుకుందాం. ఇంట్లో వున్న వంటసామాగ్రితోనే చాలా సింపుల్‌గా ఈ ఆవిరి కుడుమును రెడీ చేసుకోచ్చు.

ఆవిరి కుడుము కోసం కావాల్సిన పదార్ధాలు

2 గ్లాసుల మినపప్పు
1 గ్లాసు బియ్యం
ఉప్పు

ఆవిరి కుడుము తయారు చేసుకునే విధానం

1. ఒక బౌల్‌లో 2 గ్లాసుల మినపప్పు తీసుకోవాలి.
2. 1 గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి.
3. నీళ్లు పోసుకొని బాగా కడుక్కోవాలి.
4. రాత్రి ఇలా నానబెట్టుకోవాలి.
5. నానబెట్టిన వాటిని ఉదయం బయటకు తీసి మిక్సీజార్‌లో వేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
6. పిండి మరీ గట్టిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా వుండాలి.
7. ఆవిరి కుడుము చేసుకోవడానికి ప్రత్యేకంగా కుక్కర్లు వస్తాయ్. వాటిని మార్కెట్ నుంచి తెచ్చుకోవాలి.
8. ఈ కుక్కర్‌లో ఆవిరితో ఉడకానికి సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి.
9. కుక్కర్‌లో ప్లేటు వుంటుంది. ఆ ప్లేటు మీద క్లాత్ వేసుకొని దాంట్లో కలిపిన పిండిని వేసుకోవాలి.
10. కుక్కర్‌పై మూతపెట్టి ఉడికించాలి.
11. మూత తీసి చూస్తే ఆవిరికుడుము రెడీ అయిన విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చు.
12. స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి కుడుమును కిందకు దించుకోవాలి.
13. ఈ ఆవిరి కుడుమును కారంపొడి, లేదంటే ఆవకాయ పచ్చడి వేసి కలుపుకొని తినవచ్చు.

ఒక వేళ మీదగ్గర ఆవిరి కుడుము తయారు చేయడానికి కుక్కర్ లేకపోతే ఒక స్టీల్ బౌల్‌ను తీసుకోండి. దాంట్లో సగం వరకు నీళ్లు పోసి దానిపై బట్టను తాడుతో కట్టి ఆ బట్టపై ఆవిరికుడుము కోసం చేసుకున్న కలిపిన పిండిని వేసుకొని దానిపై మూత పెట్టాలి. కింద నీళ్ల నుంచి వచ్చే ఆవిరితో కుడుమ ఉడుకుతుంది. ఇలా కూడా ఆవిరి కుడుమును తయారు చేసుకోచ్చు.

[ of 5 - Users]
Desktop Bottom Promotion