Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Egg Puff: బేకరీ స్టైల్ ఎగ్ పఫ్..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
ఎగ్ పఫ్స్ అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా ఆఫీసులలో లేదా ఫ్యాక్టరీలలో పనిచేసే ఉద్యోగులు అయితే బ్రేక్ టైంలో దగ్గర్లోని బేకరీకో లేదా క్యాంటీన్ కో వెళ్లి వేడి వేడి ఎగ్ పఫ్ లను(egg puffs) లాగించేస్తుంటారు. అయితే బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ లను ఒవేన్ అవసరం కూడా లేకుండానే ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. బేకరీ స్టైల్ లో ఎగ్ పఫ్ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి. నాలుగు ఎగ్ పఫ్ లను చేసుకోడానికి సంబంధించిన కొలతలతో ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేయండి.
ఎగ్ పఫ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-మైదాపిండి
-ఉల్లిపాయ
-కోడిగుడ్డు
-పచ్చిమిర్చి
-ఉప్పు
-నూనె
-బటర్
-చక్కెర
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-కారం
-జీలకర్ర పొడి
-థనియాల పొడి
-చాట్ మసాలా
-పసుపు
ఎగ్ పఫ్ తయారీ విధానం
-ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి,పావు టీ స్పూన్ ఉప్పు,పావు టీ స్పూన్ చక్కెర వేసుకోండి.
-ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోండి. పిండి మొత్తాన్ని ముద్దలా సాఫ్ట్ గా కలుపుకున్న మూత పెట్టి 20 నిమిషాలు అలా వదిలేయండి.
-ఇప్పుడు రెండు గుడ్లను ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించండి. ఉడికిన తర్వాత పొక్కు తీసేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు 50 గ్రాముల బటర్ ని బయటపెట్టుకొని అది సాఫ్గ్ గా అయ్యేంతవరకు అలా ఉంచండి.
-ఇఫ్పుడు పిండిని తీసి ఒకసారి చేతులోకి తీసుకొని బాగా పిసకాలి.
-తర్వాత దానిమీద పొడి పిండిని అద్దుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోండి.
-తర్వాత సగం బటర్ ని స్ప్రెడ్ చేయండి. పైన కొంచెం పిండి చల్లుకొని బుక్ ఫోల్డ్ లా ఎడ్జెస్ ని ఫోల్డ్ చేసుకొని తర్వాత సెంటర్ లోకి ఫోల్డ్ చేసుకోండి.
-తర్వాత దానిపైన కొంచెం మైదాపిండిని రెండు వైపులా చల్లుకొని స్ప్రెడ్ చేసుకోండి. దీనిపైన బాగా తడిపి నీరు పిండిన గుడ్డ ఉంచి డీప్ ఫ్రిడ్జ్ లో 20 నిమిషాల పాటు పెట్టండి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో సన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి వేసి వేపండి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను,రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలర్ వచ్చే వరకు వేపుకోండి.
-తర్వాత అందులో అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,చిటికెడు పసుపు,అర టీ స్పూన్ కారం,అర టీ స్పూన్ జీలకర్ర పొడి,అర టీ స్పూన్ ధనియాల పొడి,అర టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోయండి.
-నీరు అంతా కొంచెం దగ్గరకు అయ్యేవరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి అది పక్కకు దించుకొని పెట్టుకోండి.
-ఇప్పుడు డీ ఫ్రిడ్జ్ లో ఉంచిన కలిపిన మైండా పిండిని బయటకు తీసి దాని మీద 25 గ్రాముల బటర్ వేసి దానిపైన కొంచెం పొడి పిండి చల్లుకుంటూ బాగా స్ప్రెడ్ చేసి ముందులాగే ఫోల్డ్ చేసి మళ్లీ డీ ఫ్రిడ్జ్ లో 20 నిమిషాలు పాటు ఉంచి బయటకు తీయండి.
-ఇప్పుడు ఆ పఫ్ పేస్ట్రీని సగానికి కట్ చేయండి. దాని కొంచెం పొడి పిండి వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి. స్క్వేయర్ షేప్ వచ్చే వరకు రోల్ చేసుకోండి.
-తర్వాత స్ప్రెడ్ చేసుకున్న దానిని నాలుగు పార్ట్ లుగా డివైడ్ చేసుకోండి.
-ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్లను నాలుగు పార్ట్ లుగా కట్ చేసుకొని దాని మీద కొంచెం కారం పొడి,ఉప్పు,కొంచెం పెప్పర్ పొడిని చల్లుకోండి.
-ఇప్పుడు కట్ చేసుకున్న ఆ పిండి పార్ట్స్ మీద ముందుగా తయారుచేసుకున్న ఉల్లిపాయ కర్రీని కొంచెం కొంచెంగా వేసి స్ప్రెడ్ చేసుకొని వాటి మీద ఎగ్స్ ని రివర్స్ లో బోర్లించుకొని సైడ్ రెండు ఎడ్జెస్ ని క్లోజ్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు వాటి మీద కొంచెం చల్లుకోండి. దీంతో కలర్ మంచిగా వస్తుంది.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక లోతుగా ఉండే గిన్నెను పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టి మూత పెట్టి 5 నిమిషాల పాటు వేడి చేసుకోండి.
-తర్వాత ఒక అల్యూమినియం ప్లేట్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసి ఈ ఫఫ్స్ అన్నీ అందులో పెట్టి స్టవ్ మీద ఉండే గిన్నెలో ఈ ప్లేట్ పెట్టి మూత పెట్టండి.
-మీడియం మంట మీద దాదాపు అరగంట తర్వాత మూత తీసి ఆ ఫఫ్ లను రెండో వైపుకి తిప్పి పెట్టాలి.
-లో ప్లేమ్ మీద అలా 5 లేదా 10 నిమిషాలు ఉంచితే చాలు క్రిస్పీగా ఉండే ఎగ్ పఫ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












