క్వాలీ ఫ్లవర్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి..?

Posted By:

ఈ రోజు క్వాలీఫ్లవర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నాన్‌వెజ్‌లో కూడా రాని టేస్ట్ మనకు క్వాలీఫ్లవర్ ఫ్రై వల్ల వస్తుంది. క్వాలీ ఫ్లవర్ ఫ్రై చేయడం చాలా సులభం. ఇంట్లో వున్న ఇంగ్రీడియంట్లతో క్వాలీఫ్లవర్‌ఫ్రైను చేసుకోవచ్చు. 100 గ్రాముల క్వాలీఫ్లవర్‌లో సుమారు 25 క్యాలరీలు వుంటాయ్. 2గ్రాముల వరకు ప్రొటీన వుంటుంది. సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు కూడా వుంటాయ్. క్వాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

క్వాలీ ఫ్లవర్ ఫ్రై తయారు చేసుకునే విధానం

గోభీ ఫ్రై చేయడానికి ఒక మీడియం సైజు క్వాలీఫ్లవర్‌ను తీసుకోవాలి. గోభిలో ఎలాంటి పురుగులు లేకుండా జాగ్రత్త పడాలి. క్వాలీఫ్లవర్ ముక్కలను మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా చిన్న సైజులో కట్ చేసుకోవాలి. ఇలా మీడియం సైజులో క్వాలీఫ్లవర్‌ను కట్ చేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. కట్ చేసిన క్వాలీఫ్లవర్ ముక్కలను రెడీగా పక్కకు పెట్టుకోవాలి. ఒక ఖాలీ ప్లేటులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలను, ఒక టేబుల్ స్పూన్ నువ్వులను, ఆరేడు జీడిపప్పు పలుకులను తీసుకోవాలి. జీడిపప్పుకు బదులుగా రెండు టీ స్పూన్ల గసగసాలనైనా లేదంటే పుచ్చపండు విత్తనాలను తీసుకోవాలి. అలాగే నాలుగైదు లవంగాలను కూడా తీసుకోవాలి. చిన్న దాల్చిన చెక్క ముక్కలను, యాలాకులను తీసుకోవాలి. ఒక టీస్పూన్ మిరియాలను, అర టీస్పూన్ జిలకరను తీసుకోవాలి. రెండు ఎండు మిరపకాయలను కూడా తీసుకోవాలి. కారం కూడా ఎక్కువ వేయడం వల్ల రెండు ఎండి మిరపకాయలను యాడ్ చేసుకోవాలి. దీన్ని చిటపటమనేలా వేంచుకోవాలి.

ఇప్పుడు వేంచిన మసాలాను ప్లేటులోకి తీసుకొని దాన్ని చల్లారేదాకా చూడాలి. ఒక ప్యాన్‌లో క్వాలీఫ్లవర్ ఉడకబెట్టడానికి కొన్ని నీళ్లను పోసుకోవాలి. ఇలా నీళ్లను ప్యాన్‌లో సగం వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్లను బాగా మరిగించాలి. నీళ్లు బాగా మరిగిన తరువత ఒక అరటీస్పూన్ ఉప్పును, చిటికెడు పసుపును వేసుకోవాలి. మొత్తం ఈ నీళ్లను బాగా కలుపుకోవాలి. నీళ్లల్లో క్వాలీఫ్లవర్‌ను బాగా ఉడికే వరకు చూసుకోవాలి. బాగా ఉడికిన తరువాత ఏ డస్ట్ పార్టికల్స్ లేకుండా చూసుకోవాలి. రెండు మూడు నిమిశాలు క్వాలీఫ్లవర్‌ను నీళ్లల్లో అలాగే ఉడకబెట్టాలి.

ఇప్పుడు క్వాలీఫ్లవర్ ముక్కలను ొక ఖాలీ ప్లేటులోకి తీసుకోవాలి. ఫ్రై చేసిన దినుసులను మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులోనే నాలుగైదు వెల్లుల్లి పాయలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేయాలి. లేదంటే ఉండలుగా మారుతుంది. ధీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లో తీసుకొని దాంట్లో చిటికెడు ఉప్పును వేసుకోవాలి. కొంత పసుపును యాడ్ చేసుకోవాలి. ఒక టీస్పూన్ కారాన్ని కూడా తీసుకోవాలి. ఈ పొడి పేస్ట్‌లా వచ్చేంత వరకు కొన్ని నీళ్లను కలుపుకోవాలి. నీళ్లను ఎక్కువగా కలుపుకుంటే పలచబడిపోతుంది. కాబట్టి కొద్దిగానే తీసుకోవాలి. ఇందులో క్వాలీ ఫ్లవర్‌ను వేసుకొని మసాలాతో బాగా కలుపుకోవాలి. ముక్కలకు మసాలా ఇంకా బాగా పట్టేలా కలుపుకోవాలి.

కలుపుకున్న తరువాత ఐదు నిమిషాలను దీన్ని పక్కన పెట్టుకోవాలి. క్వాలీ ఫ్లవర్‌ను ఫ్రై చేయడానికి ప్యాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్‌ను వేసుకోవాలి. అందులో కొన్ని క్వాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేడయిన తరువాత అరటీ స్పూన్ జిలకర, అర టీస్పూన్ ఆవాలను, కొన్ని ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో క్వాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకోవాలి. స్టవ్‌ను లో ఫ్లేమ్‌లో పెట్టి ఆరేడు నిమిషాల తరువాత మసాలా పొడిని, పచ్చిమిరపకాయ ముక్కలను, కరివేపాకును కలుపుకోవాలి. నాలుగు నిమిషాల తరువాత క్వాలీఫ్లవర్ ప్యాన్ మూత తీయాలి. ఇక దీంతో క్వాలీఫ్లవర్ ఫ్రై రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, May 26, 2024, 21:15 [IST]
Desktop Bottom Promotion