ఇంట్లోనే చికెన్ హలీంను ఇలా ఈజీగా తయారు చేసుకోండి..!

Posted By:

ముందుగా అరకేజే బోన‌లెస్ చికెన్ తీసుకొని నీళ్లల్లో ఉప్పు వేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఒక కప్పు గోదుమ రవ్వను ఒక బౌల్‌లో తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ బియ్యం, ఒకటిన్నర టేబుల్ స్పూన్ బార్లీ. ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ ఎర్ర పప్పు, ఆర టీ స్పూన్ పెసరపప్పు, ఒక టీ స్పూన్ నువ్వులు, ఒక టీ స్పూన్ పచ్చి శెనగపప్పు వేసి అన్నింటినీ కలుపుకోవాలి. తరువాత ఆ మొత్తాన్ని ఒక పెద్ద బౌల్‌లో వేసుకొని దాంట్లో నీళ్లు పోసి ఐదు గంటల వరకు నానబెట్టారు.

ఇంట్లోనే చికెన్ హలీం చేయడం చాలాఈజీ..

పప్పులు మొత్తం నానిన తరువాత దానంతటినీ మిక్సీలా పేస్ట్ బాగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కుక్కర్‌లో ఐదు టేబుల్ స్పూన్ల నాణ్యత కలిగిన నెయ్యిని వేసి అందులో ఒక కప్పు కాజు, కొన్ని బాదాం ముక్కలను, పిస్తా, కిస్‌మిస్‌లను లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. తరువాత అందులోంచి ఆ డ్రైఫ్రూట్స్‌ను ఒక గిన్నెలో తీసుకోవాలి.

ప్రూ చేసిన అదే నెయ్యిలో కొన్ని దాల్చిన చెక్కలు, ఇలాయిచీలు వేసి మిరియాలు, లవంగాలు, తోకమిరియాలు, ఒక టీ స్పూన్ షాజీరా వేసి కలుపుకోవాలి. మళ్లీ అందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కోసి, రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్ బ్రౌన్ కలర్‌లో ఫ్రై చేసుకోవాలి. అంతకు ముందు నానబెట్టుకున్న చికెన్‌ను ఇక్కడ ఫ్రై చేస్తున్న బౌల్‌లో వేసి బాగా కలుపుకోవాలి. అలా ఐదు నిమిషాలు కలుపుకున్న తరువాత, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి.

ఇంట్లోనే టేస్టీగా చికెన్ హలీం

ఉడికిన చికెన్‌లో అరటీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా , అర స్పూన్ మిరియాల పొడి, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, రెండు స్పూన్ల కారం వేసి ఒక పది నిమిషాల వరకు మొత్తం చికెన్‌ను మీడియం మంట పెట్టి కలపుకుంటూ ఉండాలి.

తరువాత అర కప్పు గడ్డ పెరుగు, కొంచెం కొత్తిమీర, పూదీన తీసుకొని చికెన్‌లో వేసుకొని మళ్లీ బాగా కలుపుకోవాలి. చికెన్ ఇంకా బాగా మెత్తగా ఉడకడానికి అరలీటరు వేడినీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి. చికెన్ బాగా ఉడికిన తరువాత పక్కకు తీసుకోవాలి.

హలీంలో ఎన్నో పోషకాలు

ముందుగా వేపుకున్న డ్రైఫ్రూట్స్, అరకప్పు గడ్డ పెరుగును మిక్సీలో వేసి మొత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పక్కను కుక్కర్‌లో ఉన్న చికెన్‌ను పప్పు గుత్తితో పేస్ట్‌గా రుబ్బుకోవాలి.

హలీంను బాగా కలుపుకోవడానికి ఒక పెద్ద బౌల్‌లో నాలుగు స్పూన్ల నెయ్యివేసుకోవాలి. అందులో డ్రైఫ్రూట్ పేస్ట్ వేసి ఒక కప్పు నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ బౌల్‌ను జావ కలిపినట్లుగా స్టవ్ మీద 15 నిమిషాల వరకు కలుపుకోవాలి. తరువాత పప్పు గుత్తితో రుబ్బుకున్న చికెన్‌ను ఈ బౌల్‌లో వేసి రెండింటినీ మళ్లీ బాగా మెత్తగా కలుపుకోవాలి. మీడియం మంటపైన ఇలా కలుపుతూనే ఉండాలి.

కలిపిన దాంట్లో మళ్లి ఒకటిన్నర స్పూన్ల గరం మసాలా, నాలుగు స్పూన్ల నెయ్యివేసి మరో 20 నిమిశాల వరకు కలుపుతూనే ఉండాలి. ఒక గంట తరువాత హలీం మనకు రెడీ. టేస్ట్ కోసం ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు.

ఇక ఫైనల్‌గా హలీం రెడీ అయిన తరువాత ప్లేట్‌లో తీసుకొని ఫ్రైడ్ ఉల్లిపాయలు, పూదీన, కాజు, నిమ్మకాయ ముక్కలతో సర్ చేసుకొని ఆరగించండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది.

[ of 5 - Users]
Desktop Bottom Promotion