కోడి గుండెకాయల ఫ్రై,మీరెప్పుడూ తినని వంట.. రుచి ఆహా అనేలా ఉంటుంది, ఎలా చేసుకోవాలంటే?

చికెన్‌తో రకరకాల వంటకాలు చేసుకుంటూ ఉంటారు. అందులో కూరలు, ఫ్రైలు ఇలా చాలానే ఉంటాయి. అయితే మీరెప్పుడైనా కోడి గుండెకాయ తిన్నారా? కొందరు దీనిని తినడానికి ఇష్టపడరు. కానీ ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. ఈ స్టోరీలో కోడి గుండెతో 65 ఫ్రై ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కోడి గుండెకాయలతో ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు

పావుకిలో కోడి గుండెకాయలు
ఫ్రై చేయడానికి సరిపడా నూనె
రెండు చెంచాల కారం
ఒక చెంచా పసుపు
రుచికి సరిపడా ఉప్పు
రెండు పచ్చిమిర్చి
కొద్దిగా కరివేపాకు
గరం మసాలా
మిరియాల పొడి
ధనియాల పొడి
ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్
ఒక కోడి గుడ్డు
కార్న్ ఫ్లోర్

కోడి గుండెకాయలతో ఫ్రై తయారీ విధానం

ఈ కోడి గుండెకాయలతో ఫ్రై చేసుకోవడం చాలా సులభం. అందుకోసం ముందుగా కోడి గుండెకాయలు తీసుకోవాలి. వాటిని కత్తెరతో మధ్యలో నుంచి చీల్చి.. శుభ్రంగా కడుక్కొని ఓ ప్లేట్‌లో వేసుకోవాలి.

ఇప్పుడు ఆ కోడి గుండెకాయలపై రెండు చెంచాల కారం, ఒక చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ మసాలాలు అంతా ఆ గుండెకాయలకు పట్టుకునే విధంగా బాగా కలుపుకోవాలి. అనంతరం అందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే ఒక గుడ్డు పగలగొట్టుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిపై గుండెకాయలను ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసుకోవాలి. అందులో మనం ముందుగా మసాలాలు దట్టించి పెట్టుకున్న కోడి గుండెకాయలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేశాక.. ఆ నూనెలోనే రెండు లేదా మూడు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని, గుండెకాయలపై పెట్టుకుంటే ఎంతో రుచికరమైన, అలాగే అద్భుతమైన కోడి గుండెకాయలా 65 సిద్ధమైనట్లే. మీరూ ఓసారి దీనిని ట్రై చేయండి.

[ of 5 - Users]
Story first published: Tuesday, February 11, 2025, 14:10 [IST]
Desktop Bottom Promotion