Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
క్రీస్పీ కారందోశను ఇలా ఎప్పుడైనా చేసుకున్నారా.. ? దోశ పిండి కూడా అవసరం లేదు..!
బయట బండిపైన తినే కారం దోశ చాలా రుచిగా వుంటుంది. ఇంట్లో అప్పటికప్పుడు తక్కువ సమయంలో ఇలాంటి కారం దోశను ఎలా తయారు చేసుకోవాలో మేము మీకు రెసిపీని అందిస్తున్నాం. ఇంట్లో వున్న వంట సామాగ్రితోనే చాలా తక్కువ సమయంలో మీరు ఈ కారందోశను వేసుకోవచ్చు.
కారం దోశ కోసం కావాల్సిన పదార్ధాలు
1 కప్పు ఉప్మారవ్వ
1 టీ స్పూన్ చెక్కర
మంచి నూనె
ఉప్పు
2 టేబుల్ స్పూన్ల గోదుమ పిండి
2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి
1 కప్పు పుల్లటి పెరుగు
1 టీస్పూన్ చెనగపప్పు
1 టీస్పూన్ మినపప్పు
1 టీస్పూన్ ధనియాలను
చిటికెడంత మెంతులు
రుచికి సరిపడ ఎండి మిరపకాయలు
7 ఎల్లిపాయలు
1 టీ స్పూన్ జిలుకర
నిమ్మకాయ సైజలో వున్న చింతపండు
1 టీ స్పూన్ మినపప్పు
అర టీ స్పూన్ ఆవాలు
కొన్ని కరివేపాకులు
అరటీస్పూన్ బేకింగ్ సోడా
కారం దోశ తయారీ విధానం
1. ముందుగా మిక్సర్ జార్‌లో 1 కప్పు ఉప్మారవ్వ, 1 టీ స్పూన్
చెక్కర, 2 టీ స్పూన్ల ఆయిల్‌ను వేసి బాగా గ్రైండ్ చేయాలి.
2. బాగా గ్రైండ్ చేసిన తరువాత మిక్సర్ జార్‌లోకి తీసుకోవాలి.
3. 2 టేబుల్ స్పూన్ల గోదుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1
కప్పు పుల్లటి పెరుగును యాడ్ చేసుకోవాలి.
4. దోశవేసే విధంగా వచ్చేలా కావాల్సినన్ని నీళ్లను పోసుకొని యాడ్
చేసుకోవాలి.
5. రుచికి సరిపడ ఉప్పును వేసుకొని కలుపుకోవాలి.
6. బౌల్‌పై మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి.
7. స్టవ్‌పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ను యాడ్
చేసుకోవాలి.
8. 1 టీస్పూన్ చెనగపప్పు, 1 టీస్పూన్ మినపప్పు, 1 టీస్పూన్ ధనియాలను,
చిటికెడంత మెంతులు వేసి ఫ్రై చేయాలి.
9. రుచికి సరిపడ ఎండి మిరపకాయలను వేసుకోవాలి. 1 కప్పు వరకు కట్ చేసిన
ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి.
10. రుచికి సరిపడ ఉప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
11. 2 టేబుల్ స్పూన్ల నీళ్లను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
12. ఫ్రై చేసిన ఎల్లిపాయలను మిక్సర్ జార్‌లోకి తీసుకోవాలి.
13. 7 ఎల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ జిలుకర, నిమ్మకాయ
సైజలో వున్న చింతపండును యాడ్ చేసుకోవాలి.
14. ఈ మొత్తాన్నీ మిక్సర్‌లో గ్రైండ్ చేయాలి. ఈ చట్నీని ఒక బౌల్‌లోకి
వేసుకోవాలి.
15. ఇప్పుడు మరో ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ను, 1 టీ స్పూన్
మినపప్పును, అర టీ స్పూన్ ఆవాలను 16. వేసుకొని ఫ్రై చేయాలి. కొన్ని
కరివేపాకులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
17. ఈ పిండిలో అరటీస్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి.
18. ప్యాన్ తీసుకొని 1 టీ స్పూన్ మంచినూనెను యాడ్ చేసుకోవాలి.
19. ఇప్పుడు రెడీ చేసుకున్న పిండితో దోశలు వేసుకోవాలి.
20. దోశ క్రిస్పీగా వచ్చేలా జాగ్రత్త పడాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













