గుజరాత్,మహారాష్ట్ర స్పెషల్ రెసిపి..ఇది తినే వారికన్ని తెలివితేటలు,ఎలా చేయాలంటే

Posted By:

పెరుగుతో తయారు చేసే సంప్రదాయ భారతీయ డెజర్ట్ శ్రీఖండ్ ఎప్పుడైనా తిన్నారా? గుజరాత్, మహారాష్ట్రలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది..పండుగలు,ప్రత్యేక సందర్భాలలో గుజరాత్, మహారాష్ట్రలో దీనిని ఇళ్లల్లో తయారుచేస్తుంటారు. శ్రీఖండ్ రుచికరమైనదమేకాకుండా ఆరోగ్యకరమైనది కూడా. ఇది కాల్షియం, ప్రోటీన్ ల గొప్ప మూలం. జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తి పెంచడానికి,చర్మాన్ని మృదువుగా తేమగా ఉంచడానికి ఆరోగ్యానికి, జుట్టుకు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.

ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే టేస్టీ శ్రీఖండ్ ని ఇంట్లో చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. దీనిని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

శ్రీఖండ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు

పెరుగు - 1 లీటరు
చక్కెర - 1 కప్పు
యాలకుల పొడి - 1 టీస్పూన్
కుంకుమపువ్వు - కొన్ని పలుకులు
బాదం, పిస్తా, జీడిపప్పు - గార్నిష్ కోసం

మెదుడుని కత్తిలా షార్ప్ గా మార్చే సూపర్ ఫుడ్..వంటగదిలో ఉంటది,99శాతం మంందికి తెలియని రహస్యం

శ్రీఖండ్ తయారీ విధానం

-శ్రీఖండ్ తయారీ కోసం ముందుగా పెరుగును ఒక పలుచని గుడ్డలో వేసి దానిని రాత్రంతా వేలాడదీయాలి. దీని వలన పెరుగులోని నీరు మొత్తం పోయి చిక్కటి పెరుగు మిగులుతుంది.

-ఇప్పుడు ఈ చిక్కటి పెరుగును ఒక గిన్నెలో వేసి ఇందులోనే చక్కెర, యాలకుల పొడిని వేసి కలపాలి.

-చక్కెర పూర్తిగా కరిగే వరకు ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి.

-కుంకుమపువ్వును కొద్దిగా వేడి పాలలో కలిపి ఆ మొత్తాన్ని ఈ మిశ్రమంలో కలపాలి.

-ఇప్పుడు ఈ శ్రీఖండ్ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో 2-3 గంటలు చల్లబర్చాలి.

-చివరగా బాదం, పిస్తా, జీడిపప్పులతో గార్నిష్ చేయండి. అంతే టేస్టీ శ్రీఖండ్ రెడీ. దీనిని చల్లగా తింటుంటే ఆహా ఏమి రుచిరా అని తీరాల్సిందే.

-మీరు మీ రుచికి అనుగుణంగా వివిధ రకాల శ్రీఖండ్‌లను తయారు చేయవచ్చు. మామిడి పండ్ల గుజ్జుతో లేదా స్ట్రాబెర్రీ పండ్ల గుజ్జుతో, గులాబీ రేకులతో అయినా శ్రీఖండ్ తయారుచేసుకోవచ్చు.

[ of 5 - Users]
Story first published: Friday, February 21, 2025, 12:00 [IST]
Desktop Bottom Promotion