Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
డబుల్ ఎగ్ ఇడ్లీ మసాలా.. 5 నిమిశాల్లో రెడీ..ఒక సారి ట్రై చేయండి..!
ఎప్పుడూ రెగులర్గా ఇడ్లీలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. కానీ ఈసారి ఈ ఇడ్లీలు మీకు అస్సలు బోర్ కొట్టదు. ఈ ఎగ్ ఇడ్లీ మసాలాలు చాలా టేస్టీగా వుంటాయ్. కేవలం 5 నుంచి పదినిమిశాల్లో ఈ ఎగ్ ఇడ్లీ మసాలాను చేసుకోవచ్చు. మీకు అప్పటి కప్పుడు ఇడ్లీలు చేసుకోవడానికి సమయం పడుతుంది అనిపిస్తే బయట టిఫిన్ సెంటర్ నుంచి ఇడ్లీలు తెప్పించుకొని ఈ ఎగ్ ఇడ్లీ మసాలా రెసిపీలను చేసుకోవచ్చు. ఒక సారి ఈ ఎగ్ ఇడ్లీ మసాలాను ట్రై చేయండి.
ఎగ్ ఇడ్లీ మసాలా తయారు చేయడానికి కావాల్సిన వంట సామాగ్రి
4గుడ్లు
కారంపొడి
అల్లంవెల్లుల్లి పేస్టు
పసుపు, మెంతులపొడి, గరంమసాలా, ఉప్పు
మంచినూనె
ఉల్లిపాయలు, నిమ్మకాయ, పూదీన ఆకులు
ఎగ్ ఇడ్లీ మసాలాను ఈ కింది విధంగా తయారు చేసుకోవాలి.
1. ఎగ్ ఇడ్లీ మసాలా చేసుకోవడానికి ముందుగా ఇడ్లీలు ఉడకబెట్టే ప్లేట్ తీసుకొని అందులో ఇడ్లీ వేసే భాగంలో నూనె రాసుకోవాలి. ప్లేటులో నాలుగు ఇడ్లీలు పెట్టే భాగాలు వుంటే అందులో నాలుగు గుడ్లను పగలకొట్టుకోవాలి.
2. వీటిని ఇడ్లీలు ఉడకబెట్టినట్టుగా ఉడకబెట్టాలి. తరువాత ఒక ప్లేటులో కావలసినంత కారంపొడి, అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, మెంతులపొడి, గరం మసాలా, రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఈ మసాలాను మొత్తం కలుపుకోవాలి.
3. ఒప్పుడు పెనంపై నూనె పోసుకొని ఉడికిన గుడ్లకు మసాలాను బాగా అంటించాలి. రెండు వైపులా మసాలాను బాగా రాయాలి. వీటిని పెనంపైన వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
4. ఇలా ఉడకబెట్టిన అన్ని గుడ్లను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకొని ఎక్కువ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇక దీంతో ఎగ్ ఇడ్లీ మసాలా రెడీ అయినట్టే.
5. ఉల్లిపాయలు, పూదీన, నిమ్మకాయలతో దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేదంటే సాయంత్రం స్నాక్‌లాగా వీటిని తినవచ్చు. రుచితో పాటు మంచి ప్రొటీన్ కంటెంట్ వున్న డిష్ ఈ ఎగ్ మసాలా
డబుల్ ఎగ్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన వంట సామాగ్రి
3 ఇడ్లీలు
2 గుడ్లు
ఆలూమసాలా,
కారంపొడి, ఉప్పు
మంచి నూనె, నెయ్యి
డబుల్ ఎగ్ మసాలాను ఈ కింది విధంగా రెడీ చేసుకోవాలి.
1. మూడు ఇడ్లీలను సెంటర్‌గా కట్ చేసుకొని ఆరు ఇడ్లీలుగా చేసుకోవాలి. వీటిని పెనంపైన వేసి వాటిపైన ఆయిల్ వేసి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి.
2. ఈ ఫ్రై చేసిన ఇడ్లీలపైన ఒక కోడిగుడ్డును పగలకొట్టి వాటిపై ఒక మీడియం సైజు ఆనియల్ ముక్కలను వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆలూ మసాలాను కూడా వేసుకోవాలి. పైన కావాలసినంత కారంపొడిని చల్లుకోవాలి.
3. వీటిని పెనంపై ఒకసైడ్ తిప్ప ఫ్రై చేసి మరో సైడ్ కూడా ఒక కోడిగుడ్డును పగలకొట్టి ఇంతకు ముందు చేసినట్టుగానే ఉల్లిపాయలు, ఆలూమసాలా, కారంపొడి, రుచికి సరిపడ ఉప్పు వేసి రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని కొంచెం నెయ్యి వేసికొని అరటాకులో వేసుకొని తింటే ఆ టేస్టును మాటల్లో చెప్పలేము.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












