Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఎగ్ సాండ్విచ్ను ఈ స్టైల్లో ఎప్పుడైనా చేసుకున్నారా..? సాండ్విచ్ మేకర్ కూడా అవసరం లేదు..!
ఈ వీకెండ్లో ఇంట్లోనే వుంటాము కాబట్టి ఒక మంచి స్నాక్ రెసిపీని మీకోసం తీసుకొని వచ్చామ్. బ్రెడ్ ఆమ్లెట్ మనకు తెలిసిందే. కానీ ఎగ్ సాండ్విచ్ ఎలా చేయాలో మీకు వివరించబోతున్నాం. చాలా సింపుల్‌గా త్వరగా ఇంట్లో వున్న వంటసామాగ్రితోనే ఈ ఎగ్ సాండ్విచ్ను రెడీ చేసేసుకోవచ్చు. ఇది రెడీ చేయడానికి 10 నిమిశాలకంటే ఎక్కువ సమయం కూడా పట్టదు.
ఆకలిగా వుండి టైమ్ లేకపోతే ఈ రెసిపీని వెంటనే రెడీ చేసుకోచ్చు. ఈ ఎగ్ సాండ్విచ్ చేసుకోవడానికి మీ దగ్గర సాండ్విచ్ ప్రెస్సర్ లేకపోయినా నడుస్తుంది. మరి ఈ ఎగ్ సాండ్విచ్ను ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం.
ఎగ్ సాండ్విచ్ కోసం కావాల్సిన పదార్ధాలు
3 గుడ్లు
అర టీస్పూన్ మిరియాల పొడి
తగినంత ఉప్పు
2 టేబుల్ స్పూన్ల మయోనైస్
1 టీస్పూన్ నిమ్మరసం
4 మిల్క్ బ్రెడ్ స్లైసులు
4 టేబుల్ స్పూన్ల బటర్
ఒక ఉల్లిపాయ
ఎగ్ సాండ్విచ్ తయారు చేసే విధానం
1. ముందుగా మూడు గుడ్లను స్టవ్‌పైన ఉడికించాలి
2. ఉడికిన గుడ్లను చిన్నిచిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
3. కట్ చేసిన గుడ్లను ఒక బౌల్లోకి తీసుకొని అర టీస్పూన్ మిరియాల పొడి, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల మయోనైస్‌ను యాడ్ చేసుకోవాలి.
4. బౌల్ లో వేసుకున్న వాటిని స్పూన్‌తో బాగా కలపాలి. ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని పిండుకొని పేస్టులా కలుపుకోవాలి.
5. నాలుగు మిల్క్ బ్రెడ్ స్లైసులను తీసుకోవాలి. పేస్ట్ చేసుకున్న గుడ్డును బ్రెడ్ పై మొత్తం స్ప్రెడ్ చేసి పై నుంచి మరో బ్రెడ్‌ను పెట్టి సాండ్‌విచ్‌లా క్లోజ్ చేయాలి.
6. బ్రెడ్‌ను ప్యాన్‌పై ఫ్రై చేయడానికి ప్యాన్‌ను స్టవ్‌పైన పెట్టుకోవాలి.
7. స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బ్రెడ్‌ను ఫ్రై చేస్తూ వుండాలి.
8. బ్రెడ్ కిందాపైన బటర్‌ను అప్లై చేస్తూ ఫ్రై చేస్తూ వుండాలి.
9. ప్యాన్‌లో బటర్‌ను నేరుగా వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. అయితే ఒక్కో బ్రెడ్‌కు రెండు స్పూన్ల కంటే ఎక్కువ బటర్‌ను యాడ్ చేసుకోవద్దు.
10. బ్రెడ్ మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసిన తరువాత బ్రెడ్‌ను ప్లేటులోకి తీసుకోవాలి.
11. బ్రెడ్ ను రెండు పీసులుగా కట్ చేసుకొని సాస్‌తో తినవచ్చు. ఉల్లిపాయను సన్నగా తరిగి బ్రెడ్ పైన చులలుకొని కూడా సర్వ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లేదా ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కింద ఈ రెసిపీని 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













