Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Ragi Kanji: ఈ రాగి కంజి తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు, ఎలా చేసుకోవాలంటే?
ఇప్పుడైతే మనం ఫ్యాన్సీ ఫ్యాన్సీ బ్రేక్‌ఫాస్ట్‌లు తింటున్నాము. కానీ ఒకప్పుడు మన పూర్వికులు మిల్లెట్స్ ఆహరం ఎక్కువగా తీసుకునే వారు. రాగి జావా, జొన్న గట్కా వంటి ఆహారాన్ని ఉదయాన్నే తీసుకునే వారు. అందుకే వారు ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా బలంగా ఉంటున్నారు. అయితే మన పూర్వికులు చేసుకుని ఓ ఆహారపు వంటకం రాగి కంజి. ఇది చాలా ఆరోగ్యకరమైన, రుచికరమైన సాంప్రదాయ భారతీయ ఆహారం. దీనిని ఎలా చేసుకోవాలి? దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రాగి కంజి తయారీకి కావలసిన పదార్థాలు:
1/2 కప్పు రాగి పిండి
2 కప్పుల నీరు
రుచికి ఉప్పు
1/2 టీస్పూన్ జీలకర్ర పొడి (ఐచ్ఛికం)
1/4 టీస్పూన్ ఆవాలు (ఐచ్ఛికం)
కొన్ని కరివేపాకు ఆకులు (ఐచ్ఛికం)
తయారీ విధానం:
- ఈ రాగి కంజిని తయారు చేసుకోవడానికి ముందుగా.. ఒక గిన్నెలో రాగి పిండిని నీటితో బాగా కలపాలి. పిండి కలిపేటప్పుడు ఎలాంటి ఉండలు లేకుండా చూసుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి, తక్కువ మంట మీద నిరంతరం కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం చిక్కబడే వరకు ఉడికించాలి. ఆ తరువాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి.
- మీకు కావాలంటే, జీలకర్ర పొడి, ఆవాలు మరియు కరివేపాకు ఆకులు వేసి కలపవచ్చు. ఆ తరువాత కంజిని వేడిగా లేదా చల్లగా తీసుకోవచ్చు. అంతే ఎంతో ఆరోగ్యకరమైన రాగి కంజి సిద్ధమైనట్లే.
రాగి కంజి ఆరోగ్య ప్రయోజనాలు:
ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












