టేస్టీ రాజస్థానీ జిలేబీని చేసుకుందామా..? చాలా సింపుల్..!

Posted By:

కొన్ని స్వీట్ల పేర్లు తలచుకోగానే నోట్లో లాలాజలం ఊరుతుంది. అన్ని స్వీట్లలో జిలేబీ వేరయా అంటే కాదనే వారెవరు. సింపుల్‌గా ఉన్నా చాలా టేస్టీగా ఎక్కువగా తినాలనిపించే స్వీట్ జిలేబీ. బయట మార్కెట్లో రాజస్థానీ జిలేబీలను చూసే ఉంటాం. అప్పటికప్పుడనే పెధ్ద ఖడాయ్‌లో వేసి అమ్ముతుంటారు. అయితే బయట ఎలాంటి శుభ్రతా పాటించకుండా బయట తయారయ్యే స్వీట్స్ తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. కాబట్టి ఇంట్లోనే టేస్టీ జిలేబీని ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం.

జిలేబీ తయారు చేసే విధానం :

జిలేబీ తయారు చేయడానికి కావలసిన వంట సామాను

ఒక కప్పు మైద పిండి, రెండూ టీ స్పూన్ల ఆవు నెయ్యి, ఫుడ్ కలర్, ఐదు టీస్పూన్ల పెరుగు, రెండు కప్పుల నీళ్లు, జిలేబీలు వేయించడానికి తగినంత నూనె, బేకింగ్ సోడా, ఒక నిమ్మకాయ, రెండు కప్పుల చెక్కర

ఒక బౌల్‌లో ఒక కప్పు మైద పిండిని తీసుకోవాలి. ఇందులోనే రెండు టీ స్పూన్ల ఆవు నెయ్యిని వేసుకోవాలి. రెండింటినీ బాగా కలుపుకోవాలి. తరువాత అందులో చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ లేదా మీకు నచ్చిన
ఫుడ్ కలర్‌ను వేసుకోవచ్చు. పిండిని నెయ్యిని, ఫుడ్ కలర్ మిక్స్ చేసుకుంటూ కలిపిన తరువాత 5 టీ స్పూన్ల పెరుగుతను వేసుకొని కలపాలి. పలుచగా కాకుండా పిండిని చిక్కగా కలుపుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకుంటూ చేతితో బాగా కలుపుకోవాలి. తరువాత ఈ బౌల్‌ను పక్కకు పెట్ట. మరో ప్యాన్‌లో రెండు కప్పుల చెక్కరను తీసుకోవాలి. దీంట్లో ఒక కప్పు నీరు వేసి పాకాన్ని తయారు చేసుకోవాలి. తగినంత ఇలాయిచీ పొడిని వేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు.

ఇప్పుడు ముందుగా కలిపిన పిండిని తీసుకొని అందులో అరటీస్పూన్ వంట సోడా, అర టీస్పూన్ నిమ్మరసాన్ని వేసుకొని కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జిలేబీలు వేసే బాటిల్‌లో తీసుకోవాలి.

జిలీబేలు వేయించడానికి ఒక ప్యాన్‌ను తీసుకొని అందులో నూనె పోసుకోవాలి. జిలేబీలను నూనెలో వేసి బాగా వేంచాలి. జిలేబీలు మాడిపోకుండా లోఫ్లేమ్‌లోనే వాటిని వేంచాలి. జిలేబీలను వేంచిన తరువాత వాటిని అంతకు ముందు తయారు చేసి పెట్టుకున్నా చెక్కర పాకంలో వేయాలి. జిలేబీలు అన్నీ చెక్కర పాకంలో మునిగేలా వాటిని చెక్కర పాకంలో వేయాలి. పాకం, జిలేబీ రెండూ వేడియా ఉన్నప్పుడు ఇలా చేయాలి. ఇలా మిగిలిన మొత్తం పిండిని జిలేబీలే వేసి నూనెలో వేయించిన తరువాత చెక్కర పాకంలో వేయాలి. చక్కర పాకంలో ఒక నిమిషం జిలేబీలను పెట్టి తరువాత వాటిని బయటకు తీసు వుంచుకోవాలి. ఇక టేస్టీ స్వీటీ జిలేబీ రెడీ అయినట్టే.

జిలేబీ తయారు చేసే విధానం చెప్పిన సందర్భంగా మీకు ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నారు. జిలేబీని మొట్టమొదట ఇరాన్ దేశంలో తయారు చేసేవారు. ఇరాన్‌లో జిలేబీని జుల్బియా అని అనేవారు. కాలం మారుతున్న కొద్దీ జుల్బియా కాస్తా జిలేబీగా మారింది. అయితే 15వ శతాబ్దంలో జిలేబీ స్వీట్ భారత దేశ స్వీట్లల్లో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. ఎన్ని కొత్త రాకాల స్వీట్లు వచ్చినప్పటికీ జిలేబీ స్థానం ఇంకా అలాగే ఉంది.

[ of 5 - Users]
Desktop Bottom Promotion