జొన్న కిచిడీ.. జొన్న రొట్టె బోర్ అనుకున్నవాళ్లు ఇది చేసుకొని తింటే ఆహా..!!

Posted By:

శరీరానికి ఎన్నో పోషకాలు అందించేే టస్టీ రెసిపీ జొన్న కిచిడీని ఎలా తయారు చేయాలో మీ ముందుకు తీసుకొని వచ్చాము. దీన్ని ఉదయం సమయంలో బ్రేక్‌ఫాస్ట్‌గా, సాయంత్రం స్నాక్‌గా అయినా తీసుకోవచ్చు. ఇంట్లో వున్న పదార్ధాలతోనే ఈ జొన్న కిచిడీని రెడీ చేసుకోవచ్చు.

జొన్న కిచిడీని తయారు చేసుకోవడానికి కావాల్సిన వంట పదార్ధాలు ఇవే :

ఒక కప్పు జొన్న రవ్వ
రుచికి సరిపడ ఉప్పు
10 మిరియాలు
చిన్న దాల్చిన చెక్క ముక్క
కొన్ని కరివేపాకులు
1 టేబుల్ స్పూన్ పచ్చి చెనగపప్పు
1 టేబుల్ స్పూన్ మినపప్పు
రెండు టీస్పూన్ల నెయ్యి
2 టీస్పూన్ల మంచి నూనె
అర టీస్పూన్ జిలుకర
ఒక టీస్పూన్ వెల్లుల్లిపాయ
రెండు పచ్చిమిరపకాయ ముక్కలు
తరిగిన ఉల్లిపాయలు

1. ముందుగా కుక్కర్‌లోకి ఒక కప్పు జొన్న రవ్వను తీసుకోవాలి. నీళ్తు పోసి జొన్న రవ్వను బాగా కడగాలి. మూడు కప్పుల జొన్న నీళ్లను జొన్న రవ్వలో పోసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడ ఉప్పును, 10 మిరియాలు చిన్న దాల్చిన చెక్క ముక్కను తీసుకోవాలి. కొన్ని కరివేపాకులు వేసి మూత పెట్టుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక వదిలేయాలి. మూత తెరిచి చూస్తే మెత్తగా అయిన జొన్న రవ్వను చూడొచ్చు.

2. స్పూన్‌తో మొత్తం జొన్న రవ్వను బాగా కలుపుకోవాలి. ఒక కప్పు నీళ్లను పోసుకొని బాగా కలుపుకోవాలి. మరో కప్పు నీళ్లను పోసుకొని కొంచెం మెత్తగా వుండేలా చూసుకోవాలి.

3. ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ పచ్చి చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పును తీసుకొని బాగా కడగాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి రెండు టీస్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. 2 టీస్పూన్ల మంచి నూనెను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో అర టీస్పూన్ ఆవాలును, అర టీస్పూన్ జిలుకరను, ఒక టీస్పూన్ వెల్లుల్లిపాయ ముక్కలను, సన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే తరిగిన ఉల్లిపాయలను వేసుకోవాలి.

4. బాగా ఫ్రై చేసిన తరువాత పావు కప్పు తరిగిన క్యారెట్ ముక్కలను, సన్నగా తరిగిన ఒక కప్పు పాలకూర ఆకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉడికించిన జొన్న రవ్వను తీసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కిచిడీ లూజ్‌గా ఉండేవిధంగా చూసుకోవాలి. మూత పెట్టి రెండు నిమిశాలు ఉడికించాలి.

5. కొన్ని కొత్తిమీర ఆకులను, రుచి కోసం ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఈ జొన్ని కిచిడీని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు.

[ of 5 - Users]
Story first published: Saturday, July 20, 2024, 10:54 [IST]
Desktop Bottom Promotion